Heavy rain: గడిచిన వారం రోజుల నుంచి తెలంగాణలో వర్షం అంతగా పడడం లేదు. రాష్ట్రంలో అక్కడక్కడా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు మాత్రమే పడుతున్నాయి. మే చివరి వారంలో వర్షాలు దంచికొట్టిన విషయం తెలిసిందే. మళ్లీ జులై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడ్డాయి. జూన్ నెలలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే వర్షాలు కురిశాయి. ఈసారి వర్షాలు సమృద్దిగా కురుస్తాయని రైతులు కాస్త ముందస్తుగానే వ్యవసాయ పనులు మొదలుపెట్టారు. మే నెల చివరి వారంలోనే పత్తి గింజలు, నార్లు పోశారు. అయితే ఆ తర్వాత జూన్ నెల వర్షాలు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందారు.. ఎప్పుడెప్పుడు వర్షాలు పడుతాయా? అని ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజుల నుంచి రాష్ట్రంలో వర్షాలే పడడం లేదు. దీంతో రైతులు వర్షాల రాక కోసం ఆకాశం వైపు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
హైదరాబాద్ లో భారీ వర్షం
ఈ క్రమంలోనే భాగ్యనగర వాసులను తెలంగాణ వెదర్ మ్యాన్ టీ. బాలాజీ అలర్ట్ చేశారు. మరో గంట సేపట్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ ను క్యుములోనింబస్ మేఘాలు కమ్మేశాయి. దక్షిణ, పశ్చిమ, ఉత్తర హైదరాబాద్ ప్రాంతాల్లో దాదాపు 2 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని వివరించారు. అటు తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇవాళ వర్షాలు పడే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు.
త్వరగా ఇంటికి వెళ్లండి..
పనులు మీద బయట ఉన్న గ్రేటర్ వాసులు త్వరగా పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తే బెటర్ అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. రోడ్లపై భారీగా వరద నీరు ప్రవహించే ఛాన్స్ ఉంది. దీంతో ఆఫీసులో ఉన్న ఉద్యోగులు వెంటనే పని కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాల నేపథ్యలో లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు.
ALSO READ: IBPS JOBS: గోల్డెన్ ఛాన్స్.. డిగ్రీతో 5208 ఉద్యోగాలు, ఇంకా 4 రోజులే సమయం