E-Paper
Advertisement

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!

సుందర్ పిచాయ్‌ కి షాక్.. ప్రసంగం మధ్యలో విద్యార్థుల వాకౌట్!
Advertisement

ఆల్ఫబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ కి ఊహించని పరిస్థితి ఎదురయ్యింది. ఆయన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తుండగా, విద్యార్థులంతా వాకౌట్ చేయడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఈ అనూహ్య ఘటన స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ స్నాతకోత్సవ కార్యక్రమంలో జరిగింది. జూన్ 14న జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా, విద్యార్థులు నిరసనగా సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఇజ్రాయెల్ తో గూగుల్ ఒప్పందాన్ని నిరసిస్తూ..

Advertisement

విద్యార్దులు ఎందుకు పిచాయ్ ప్రసంగిస్తుండగా బయటకు వెళ్లిపోయారనే అంశంపై అంతా ఆరా తీస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వంతో గూగుల్ కుదుర్చుకున్న ‘ప్రాజెక్ట్ నింబస్’ ఒప్పందానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఈ నిరసన చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా గూగుల్, అమెజాన్ సంస్థలు ఇజ్రాయెల్ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సైన్యానికి క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు అందిస్తున్నాయి.

గాజాలో కొనసాగుతున్న సైనిక చర్యల్లో ఇజ్రాయెల్ ఆధునిక సాంకేతికత, ఏఐ ఆధారిత వ్యవస్థలను ఉపయోగిస్తోందని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 100 మంది విద్యార్థులు సుందర్ పిచాయ్ ప్రసంగం జరుగుతున్న సమయంలో సభ నుంచి లేచి బయటకు వెళ్లారు. బయటకు వెళ్తూ పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నినాదాలు చేసినట్లు సమాచారం. అయితే, సుందర్ పిచాయ్ తన ప్రసంగంలో ఇజ్రాయెల్, గాజా, ప్రాజెక్ట్ నింబస్ గురించి ఎలాంటి ప్రస్తావన చేయలేదు. అయినప్పటికీ, గూగుల్‌ తో సంబంధం ఉన్న అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విద్యార్థులు నిరసన తెలపడం చర్చనీయాంశంగా మారింది.

ఏఐపై అమెరికా యూనివర్సిటీల్లో ఆందోళన

Advertisement

ఇటీవల అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ఏఐ ప్రభావంపై కూడా విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతోంది. AI కారణంగా భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవచ్చనే భయం వ్యక్తం అవుతోంది. ఈ కారణంగా టెక్ కంపెనీల అధిపతులు, ప్రముఖ సాంకేతిక నిపుణులు విశ్వవిద్యాలయ కార్యక్రమాలకు హాజరైనప్పుడు ప్రశ్నలు, నిరసనలు ఎదుర్కొంటున్న సందర్భాలు పెరుగుతున్నాయి.

సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు

అటు ఈ సమావేశంలో సుందర్ పిచాయ్ విద్యార్థులకు ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. ప్రపంచ పరిస్థితులు కొన్నిసార్లు ఆందోళన కలిగించవచ్చని, వార్తలు చూస్తే ఎన్నో సవాళ్లు కనిపించవచ్చన్నారు. అయితే, ప్రతి తరం తమ కాలంలో ప్రత్యేకమైన సమస్యలను ఎదుర్కొన్నదని గుర్తుంచుకోవాలని చెప్పారు. మన చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మార్చడం మన చేతుల్లో ఉండకపోవచ్చని, వాటిని ఎలా అర్థం చేసుకుంటాం, ఎలా స్పందిస్తామనే విషయం మాత్రం మన నియంత్రణలో ఉంటుందన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకునే దృక్పథం ఉంటే మంచి ఫలితాలు సాధించవచ్చని విద్యార్థులకు సూచించారు.

Read Also: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం.. ట్రంప్ సంచలన ప్రకటన!

Related News

బోరిస్ జాన్సన్ ప్రయాణిస్తున్న రైలుపై రష్యా డ్రోన్ దాడి.. త్రుటిలో తప్పిన ప్రాణపాయం!

బ్రిక్స్ ప్రసంగాన్ని ఆపి జిన్‌పింగ్ గురించి ఆరా? మోదీ విందుకు దూరంగా చైనా అధ్యక్షుడు, పుతిన్ హాజరు

240 మంది ప్రయాణికులతో వెళ్తున్న షిప్ గల్లంతు.. జావా నుండి బోర్నియోకు వెళ్తుండగా ఘటన,

బ్రిక్స్ సదస్సులో చారిత్రక ఘట్టం.. ఢిల్లీ డిక్లరేషన్‌ కు ఏకగ్రీవ ఆమోదం!

భారత్‌కు అమెరికా బిగ్ షాక్? రష్యా క్రూడాయిల్ కొనుగోళ్లపై 100% టారిఫ్!

9/11 దాడులకు 25 ఏళ్లు.. బిన్ లాడెన్ కొడుకు రీ ఎంట్రీ.. అల్ ఖైదా కొత్త వీడియో కలకలం!

బంగ్లాదేశ్‌లో హిందూ సాధువు తీవ్ర భావోద్వేగం.. దేవుడి పాదాలు తాకి కన్నీటి పర్యంతం!

పుతిన్ ‘అంతర్గత’ భద్రత.. ఆయన టిష్యూల నుండి టవల్స్ వరకు, మలం కూడా మళ్లీ రష్యాకే

Big Stories

Advertisement
×