Illu Illalu Pillalu Today Episode March 19th : నిన్నటి ఎపిసోడ్ లో.. భద్ర చెప్పిన విషయాన్ని ఎలాగైనా రామ్ రాజ్ తో తెలుసుకోవాలని భాగ్యం అనుకుంటుంది. ఈ గుడ్డుని చేతిలో పెట్టుకొని పెళ్లి మొత్తం వాళ్లే చేసేలాగా ప్లాన్ చేస్తానని అనుకుంటుంది. భాగ్యం ఆమె భర్త రామ్ రాజు మిల్లు కి వెళ్తారు. మీరు ఈ విషయాన్ని ఎందుకు దాచారు నగల కోసమే అమ్మాయిని ట్రాప్ చేసి మీ చిన్నబ్బాయి పెళ్లి చేసుకున్నారు కదా మీరు కూడా అదే చేశారా ఏంటి అని అడుగుతుంది. వాళ్లకి మాకు పాత కక్షలు ఉన్నాయి. అందుకే వాళ్ళు మా గురించి లేనిపోనివి చెప్తున్నారని రామరాజు అంటాడు.. కానీ భాగ్యం మాత్రం తన ప్లాన్ వర్క్ అవుట్ అవ్వాలని అమ్మాయి కోసం నగల కోసం మీ చిన్నబ్బాయి మోసం చేసినట్టే మీ పెద్దబ్బాయి మోసం చేయడానికి నమ్మకమేంటి మేము ఈ పెళ్లి గురించి కాస్త ఆలోచించుకుని చెప్తామని అంటుంది. వేదవతి మాత్రం తన కోడళ్ళకి చీరలు కొనాలని ఇంటికి చీరలు పిలిపిస్తుంది. అందరూ కలిసి చీరలు తీసుకోవాలని చూస్తూ ఉంటారు. నర్మదా అత్తపై సెటర్లు వేస్తూ ఉంటుంది. శ్రీవల్లి చందు ని దూరం పెడుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ధీరజ్ తన భార్య కోసం ఫుడ్ ని తీసుకొస్తాడు అది చూసి బుజ్జమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ధీరజు ప్రేమకు ఫ్రైడ్ రైస్ తెచ్చి ఇస్తాడు. ఇదేంటిది అనని అడుగుతుంది. ఫ్రైడ్ రైస్ మీ అత్త మొహం లాగే బాగా మాడిపోయింది అనేసి సెటైర్లు వేస్తాడు. కానీ ప్రేమ మాత్రం ధీరజ్ కి కౌంటర్లు ఇస్తూ వస్తుంది. అయితే ప్రేమ ధీరజ్ తనకు పెట్టిన ఖర్చు గురించి తెలుసుకోవాలని బుక్కులో లెక్కలేస్తుంది. రేపు నాకు చదువు అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాను కదా ప్రతిదీ నీకు రూపాయితో సహా లెక్క చెప్పడానికి ఈ లెక్కలేస్తున్న అనేసి అంటుంది. ఇక ఇద్దరు కాసేపు కస్సుబుసలాడుకుంటారు.
భద్ర సేన ఇద్దరు రామరాజు పెద్ద కొడుకు పెళ్లి చెడిపోయిందని బాధలో ఉన్నట్లు ఉన్నాడు ఇంకా ఇంటికి రాలేదు అక్కడ ఎక్కడైనా పడిపోయాడు ఏమో అంటూ సంతోషపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. రామరాజు అప్పుడే కన్నీళ్లతో ఇంటికి తిరిగి వస్తాడు. చూసావా ఆ మొహంలో రక్తపు చుక్క లేదు పెళ్లి చెడిపోయినందుకు బాధగా ఉందేమో అని సేన అంటాడు. అసలు ఏమైనా మనుషులేనా అని రామరాజు వాళ్ళని తిడతాడు. నా పెద్ద కొడుకు అమాయకుడు అలాంటివాడికి పెళ్లి జరగకుండా చెడిపోయేలా చేస్తారా మీరు మనుషులే నాకు కొంచమైనా అని అరుస్తాడు.
రామరాజు అరవడం విని బుజ్జమ్మ నర్మదా పరిగెత్తుకుంటూ బయటికి వస్తారు.. ఏమైంది అండి అని బుజ్జమ్మ అడుగుతుంది.. పెద్దోడి పెళ్లి చెడిపోవడానికి కారణం వీళ్లే వాళ్లకు లేనిపోనివి చెప్పి పెద్దోడి పెళ్లిని చెడగొట్టేశారు అని రామారాజు అంటాడు. ఇద్దరము పాతికేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం ఏరోజు మీ ఇంటికి రాలేదు మీ గురించి ఆలోచించలేదు. మీరు మాత్రం నన్ను ఎప్పుడు అనగా తొక్కాలి అని ఆలోచిస్తూనే ఉంటారు నేనేం పాపం చేశానని మీరు ఎలా అనుకుంటున్నారు అసలు నా పెద్ద కొడుకు అమాయకుడు వాడి జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారని రామ్ రాజ్ అంటాడు.
బుజ్జమ్మ వీరింత నీచులుగా మారతారని అస్సలు అనుకోలేదు నా కొడుకుని ఎందుకు అన్యాయం చేయాలనుకున్నారు మీకు ఏదైనా పకుంటే మా మీద తీర్చుకోండి అంతేగాని మా కొడుకు జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తారు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక రామరాజు బుజ్జమ్మను లోపలికి తీసుకొని వెళ్తాడు. తర్వాత ధీరజ్ దగ్గరికి వచ్చి నువ్వు జీవితంలో ఏదైనా పెద్ద తప్పు చేశావంటే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడమే అని అంటారు.
తర్వాత రోజు ఉదయం ప్రేమ వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది కానీ వాళ్ళ అమ్మ మాత్రం ప్రేమతో మాట్లాడడానికి ఇష్టపడదు. కాలుజారి కింద పడిపోయి దెబ్బ తగులుతుంది ప్రేమ వాళ్ళ అమ్మ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్లి లోపలికి తీసుకెళ్తుంది. నీ ప్రేమ వాళ్ళ అన్నయ్య నువ్వు మా ఇంట్లో పలికి ఎందుకు వచ్చావు వద్దు అనుకొని వెళ్ళిపోయిన దానివి మళ్లీ ఎందుకు వచ్చావు నీకు ఎంత ధైర్యం ఉంటే వస్తావు అనేసి ప్రేమ అని కొడతాడు రామరాజు మీద ప్రేమ పడుతుంది. మా ఇంటి కోడల్ని కొట్టడానికి నువ్వెవరురా అని రామరాజు అంటాడు ప్రేమను కొట్టబోయి. దెబ్బ రామరాజుకు తగులుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ధీరజ్ ప్రేమ వాళ్ళ అన్నయ్యని కొడితే చందు ని పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..