BigTV English

Russia Ukraine Syria : సిరియాలో రాజకీయ సంక్షోభం.. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఉంటుందా?

Russia Ukraine Syria : సిరియాలో రాజకీయ సంక్షోభం.. ఉక్రెయిన్ యుద్ధంపై ప్రభావం ఉంటుందా?

Russia Ukraine Syria | సిరియాలో దశాబ్దాల పాటు నడిచిన బాత్ పార్టీ ప్రభుత్వం చివరకు కుప్పకూలింది. గత 9 ఏళ్లుగా మిలిటెంట్లు, సైన్యం మధ్య నడుస్తున్న అంతర్యుద్ధం నాటకీయంగా ముగిసింది. ఇస్లామిక్ రెబెల్స్ మిలిటెంట్లతో ఏళ్ల తరబడి పోరాడుతూ.. సైనికాధికారులు అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ద్రోహం చేశారు. దీంతో బషర్ అల్ అసద్ దేశం వదిలి పారిపోవాల్సి వచ్చింది. సిరియా రాజధాని డమాస్కస్‌ని రెబెల్స్ హస్తగతం అయిపోయింది. దీంతో సిరియాలో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ పరిణామాల అలజడి అంతర్జాతీయంగా ప్రభావం చూపనుంది. ముఖ్యంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై సిరియా సంకోభం ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది.


దశాబ్ద కాలంగా సిరియా రష్యా, ఇరాన్ సాయంతో అధ్యక్షుడు అసద్ తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు అక్కడ రెబెల్స్ తో పోరాడుతూనే ఉన్నారు. అయితే మిడిల్ దేశాల్లో గత సంవత్సర కాలంలో చాలా మార్పులు జరిగాయి. గాజాలో, లెబనాన్ లో ఇజ్రాయెల్ చేసిన మారణహోమంతో ఇరాన్ రంగంలోకి దిగాల్సి వచ్చింది. దీంతో ఇరాన్ ఎక్కువగా లెబనాన్, హౌతీలకు ఆయుధాలు సరఫరా చేసేందుకే శ్రమపడాల్సి వస్తోంది. పైగా ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా దాడులు, ప్రతిదాడులు జరిగాయి. మరోవైపు రష్యా కూడా ఉక్రెయిన్ యుద్ధం చేస్తోంది. అక్కడ గత కొన్ని నెలలుగా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాల నాటో కూటమి ఉక్రెయిన్ కు భారీగా ఆయుధాలు సరఫరా చేయడంతో రష్యాకు భారీ నష్టం జరిగింది. ఈ పరిస్థితుల్లో రష్యా పూర్తి స్థాయిలో సిరియా ప్రభుత్వానికి సాయం అందించలేకపోయింది.

Also Read:  పురాతన గుడి లోపల 73 శవాలు.. 600 మొసళ్లు.. అడవి మధ్యలో పూజలు!


సిరియాలో దశాబ్డ కాలంగా రెబెల్స్ ను రష్యా, ఇరాన్ సాయంతో విజయవంతంగా కట్టడి చేసిన అధ్యక్షుడు అసద్‌కు ఇప్పుడు ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్దాల కారణంగా గత కొన్ని నెలలుగా సాయం అందలేదు. దీంతో సిరియా సైన్యం పూర్తి స్థాయిలో పోరాడలేక వెనుకడుగు వేసింది. ఇస్తామిక్ రెబెల్స్ మిలిటెంట్లు సిరియాలోని కీలక నగరాలైన హోమ్స్, అలెప్పో లను రెబెల్స్ ఆక్రమించుకోవడానికి వస్తే.. మీడియా కథనాల ప్రకారం సైన్యం పోరాడకుండానే అక్కడి నుంచి వెనక్కు మళ్లింది. ఇప్పుడు అధ్యక్షుడు అసద్ పారిపోవడంతో సైన్యం చేతిలో హమా, హోమ్స్ నగరాల్లోని కొంత భూభాగం మాత్రమే మిగిలింది.

ఉక్రెయిన్ దృష్టికోణం
సిరియాలో ప్రభుత్వం కూలిపోగానే.. అతివేగంగా స్పందించిన దేశాల్లో ఉక్రెయిన్ ఒకటి. సిరియాలో ప్రభుత్వం పతనం.. రష్యా బలహీనతను చూపుతోందని ఉక్రెయిన్ ప్రభుత్వం వ్యాఖ్యానించింది. ఉక్రెయిన విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా మాట్లాడుతూ.. “సిరియా అసద్ పతనంలాగే నియంతల ప్రభుత్వాలన్నీ కూలిపోతాయి. ఎందుకంటే వారంతా రష్యా నియంత పుతిన్ ని నమ్ముకున్నవారు. ఇప్పుడు రష్యా బలం సగం తగ్గిపోయిందని నిరూపితమైంది. ఉక్రెయిన యుద్ధంలో పుతిన్ బాగా నష్టపోయారు. మరోవైపు సిరియాలో కూడా రష్యా సైనికులు, ఆయుధాలను చేసేవారు. కానీ ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వచ్చే నష్టాల ధాటిని తట్టుకునేందుకు సిరియా నుంచి రష్యా బలగాలను ఉపసంహరించుకున్నారు. రష్యా ఒకరకంగా సిరియాలో అసద్ ప్రభుత్వానికి మోసం చేసింది. అందుకే అసద్ సైన్యం ఒంటరిగా పోరాడ లేక వెనుకడుగు వేసింది. ” అని చెప్పారు.

సిరియా కోల్పోతే రష్యాకు వచ్చిన నష్టం ఏంటి?
సిరియాలో విద్రోహులతో పోరడడానికి అస్సద్ కు అదనపు సైనిక, ఆయుధ బలం అవసరమైతే.. 2015లో అందరికంటే ముందు సాయం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. కారణం యూరోప్ సమీపంలో సిరియా ఉండడం. అమెరియా, యూరోప్ లాంటి దేశాల నాటో కూటమి వల్ల రష్యాకు ముప్పు పొంచి ఉండడంతో యూరోప్‌నకు సమీపంగా రష్యాకు యుద్ధ స్థావరాలు చాలా అవసరం. అందుకే సిరియాలో నౌకదళ స్థావరం, హెయిమీమ్ ఎయిర్ మిలిటరీ బేస్ కూడా రష్యా ఏర్పాటు చేసుకుంది. యూరోప్ దేశాలతో యుద్ధ చేయాల్సి వస్తే ఈ స్థావరాలే రష్యాకు ఉపయోగపడతాయి.

కానీ ఇప్పుడు అసద్ ప్రభుత్వం కూలిపోయిన తరువాత రష్యా ప్రభావం కూడా ఆ ప్రాంతంలో కోల్పోయింది. పైగా అసద్ ఉండగానే రష్యా తన బలగాలను ఉక్రెయిన్ యుద్ధం కోసం ఉపసంహరించుకుంది. ఇప్పుడు సిరియా.. రెబెల్స్ హస్తగతం కావడంతో రష్యా నౌకాదళ, ఎయిర్ బేస్ స్థావరాలు శత్రువులు ఆక్రమించుకునే ప్రమాదముంది.

మొత్తానికి సిరియాలో ప్రభుత్వ పతనం అంతర్జాతీయ స్థాయిలో రష్యా ప్రభావాన్ని దెబ్బతీసింది. దీంతో ఇదే అవకాశంగా రష్యాను అణచివేయడానికి ఉక్రెయిన్‌తోపాటు ఇతర దేశాలు కూడా ముందుకు వస్తాయి. ఒకవేళ ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చర్చల్లో షరతులు విధించాలన్నా సిరియా కోల్పోవడంతో రష్యా వద్ద బేరసారాలు ఆడేందుకు పెద్దగా పావులు లేవు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×