Tesla Cybertruck Explosion| అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో బుధవారం ఒక ఎలెక్ట్రెక్ వాహనం.. టెస్లా సైబర్ ట్రక్కు పేలిపోయింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం ఉదయం దాదాపు 8.40 గంటలకు లాస్ వెగాస్ నగరంలోని ట్రంప్ ఇంటర్నేష్నల్ హోటల్ బయటే ఈ ఘటన జరిగింది. క్లార్క్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ అధికారుల ప్రకారం.. హోటల్ వ్యాలెట్ పార్కింగ్ ప్రదేశంలో ఈ పేలుడు సంభవించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇది ఒక ఉగ్రదాడి అని టెస్లా కంపెనీ సిఈఓ, ప్రముఖ బిలియనీర్ ఎలన్ మస్క్ చెప్పారు.
పోలీసులు ఈ ఘటన గురించి విచారణ చేయగా.. ఈ సైబర్ ట్రక్కుని దుండగులు రెంటు తీసుకొని.. దీన్ని డెటోనేటర్ తో పేల్చేశారు. ఆ సైబర్ ట్రక్కుని పేల్చడానికి అందులోని గ్యాస్ ట్యాంక్, గ్యాస్ ట్యాంక్, క్యాంపింగ్ ఫ్యూయెల్ ని డిటోనేటర్ కు అనుసంధానం చేశారు. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తి ఆ కారులోనే ఉన్నాడు. గాయపడిన ఏడుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి ప్రాణాపాయం లేదని సమాచారం.
ట్రక్కు లోపల గ్యాసోలిన్ (పెట్రోల్) క్యానిస్టర్లకు, పేలుడు పదార్థాలు అమర్చి ఉన్న వీడియోని పోలీసులు విడుదల చేశారు. దాడి చేయడానికి దుండగులు ఒక కారు షేరింగ్ ప్లాట్ ఫామ్ టూరో ద్వారా ట్రక్కు రెంటుకి తీసుకున్నట్లు తెలిపారు.
టెస్లా సైబర్ ట్రక్కు పేలిపోవడంతో.. టెస్లా సిఈఓ ఎలన్ మస్క్ స్పందించారు. ఇది ఉగ్రదాడి అని ఆయన అభిప్రాయపడ్డారు. ట్రక్కు డిజైన్ దాని భద్రతా ఫీచర్స్ వల్ల పేలుడు భారీగా ఉన్నా ట్రక్కు దాన్ని తట్టుకుందని మస్క్ చెప్పారు.
Also Read: 2025 ప్రపంచంలో మృత్యు తాండవం.. సిరియా పతనమే పునాది.. బాబా వంగా జోస్యం
“ఆ దుష్టులు (కారు పేల్చిన దుండగులు) ఉగ్రదాడి చేయడానికి తప్పుడు వాహనం ఎంచుకున్నారు. ఆ సైబర్ ట్రక్కు భారీ పేలుడు తీవ్రతని భరించింది. పేలుడు ప్రభావాన్ని పై దిశగా మంటలను మళ్లించింది. పక్కనే హోటల్ గ్లాస్ డోర్స్ ఉన్నా.. అవి పేలిపోలేదు. పేలుడికి ముందు ఆ ట్రక్కు చార్జింగ్ స్టేషన్లలో ఫుల్ చార్చింగ్ చేసుకున్న సిసిటీవి వీడియోని టెస్లా కంపెనీ పోలీసులకు అందించడం జరిగింది. ” అని మస్క్ ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అంతకుముందు రోజు న్యూ ఓర్లియన్స్ నగరంలో ఒక వ్యక్తి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకుంటున్న జనంపైకి ఒక పికస్ ట్రక్కుతో దూసుకెళ్లాడు. ఈ ఘటనలో మొత్తం 15 మంది చనిపోయారు. అయితే నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే కాల్చి చంపారు. వరుసగా ఈ దాడులు జరగడం.. పైగా అమెరికా తదుపరి అధ్యక్షుడు ట్రంప్ హోటల్ ముందు ఆయన సన్నిహితుడు మస్క్ కంపెనీ వాహనాన్ని పేల్చేయడంతో అమెరికాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.