Bangkok Floods: థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌ను వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. అనేక ప్రాంతాలు నీట మునిగి ఉన్నాయి. ఇంకా భారీ వర్షాలు పడతాయని అక్కడి వాతావరణ శాఖ చెప్పడంతో అక్కడి బెంబేలెత్తుతున్నాయి. ఈ విపత్తు నుంచి బయటపడటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్‌లో వరదలు బీభత్సం సృష్టించాయి. రోడ్లపై అక్కడి ప్రజలు నడవలేని పరిస్థితి నెలకొంది. నడుము లోతు నీటిలో నడుస్తూ కనిపిస్తున్నారు. కొన్ని ప్రాంతాలలో రోడ్లు మునిగిపోవడంతో సామాన్యులకు కష్టంగా మారింది. ఇళ్లు, షాపుల్లోకి నీరు చేరడంతో అక్కడివారి జీవితం అస్తవ్యస్తమైంది. బ్యాంకాక్ మహానగర పరిపాలన విభాగం రాజధానిలోని 50 జిల్లాలను విపత్తు ప్రాంతాలుగా ప్రకటించింది. దీంతో సహాయక, రెస్క్యూ ఆపరేషన్ల కోసం స్థానిక అధికారులకు ప్రత్యేక అధికారాలు లభించాయి. బ్యాంకాక్, దాని చుట్టుపక్కలున్న మూడు ప్రావిన్సులలో ప్రభుత్వ ఉద్యోగులకు సోమవారం, మంగళవారాలు ప్రభుత్వం సెలవు మంజూరు చేసింది.
థాయ్‌లాండ్ స్థానిక పత్రికల సమాచారం మేరకు.. ఆదివారం నాటికి సుమారు 52 వేల కుటుంబాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. దాదాపు 4900 మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు. అనేక ప్రాంతాలలో ప్రజలు నిత్యావసర వస్తువులను కాపాడుకోవడం, ఇళ్ల నుండి నీటిని తొలగించడంలో నిమగ్నమయ్యారు సహాయక బృందాలు. వరద పరిస్థితి తీవ్రతరం కావడంతో దుకాణాలలో నిత్యావసర వస్తువుల కొరత ఏర్పడింది. ఈ పరిస్థితి కేవలం రోడ్లకు పరిమితం కాలేదు.
బ్యాంకాక్ నగర కాలువల్లో నీటిమట్టం గణనీయంగా పెరిగింది. కాలువల ద్వారా నగరం నుండి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పంపింగ్ స్టేషన్లు పూర్తి సామర్థ్యంతో పని చేస్తున్నాయి. నగరం చుట్టూ పెద్ద సంఖ్యలో ఇసుక బస్తాలను మోహరించారు. కేవలం 48 గంటల్లో 300 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. సాధారణంగా బ్యాంకాక్‌లో సెప్టెంబర్ నెల అత్యధిక వర్షపాతం నమోదు అవుతుంది. కానీ ఈ ఏడాది వర్షపాతం సాధారణం కంటే గణనీయంగా పెరిగిందని అక్కడి వాతావరణ శాఖ చెబుతోంది.
సెప్టెంబర్ 1 నుండి 25 మధ్య రాజధానిలో బ్యాకాక్‌లో 487 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యిందంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు వరద ప్రాంతాల నుండి నీటిని బయటకు పంపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యాంకాక్‌లోని అనేక ప్రాంతాలలో నీరు తగ్గుముఖం పట్టడానికి చాలా సమయం సమయం పట్టవచ్చని సహాయక బృందాలు అంచనా వేస్తున్నాయి. ఇళ్లలో చిక్కుకుపోయిన వారికి నిత్యావసర వస్తువులను అందించడానికి, వరద ప్రభావిత ప్రాంతాలలో ట్రాఫిక్‌ను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్నాయి.
ALSO READ: రాతి యుగానికి చెందిన ప్రజలు.. చెట్లపై వారి జీవితం, భూమికి 20 మీటర్లు ఎత్తులో, ఎక్కడో తెలుసా?
బ్యాంకాక్‌లోని సువర్ణభూమి విమానాశ్రయంలో వందలాది మంది ప్రయాణికులు 14 గంటలకు పైగా చిక్కుకుపోయారు. నగరవ్యాప్తంగా వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తింది. వరదల వల్ల విమాన ప్రయాణాలకు అంతరాయం ఏర్పడింది. వరద నీటితో భారీ ట్రాఫిక్ ఏర్పడింది. విమాన సిబ్బంది సమయానికి విధులకు హాజరు కాలేకపోయారని సమాచారం. ఆదివారం నుంచి ప్రయాణికుల విమానాలు పదేపదే ఆలస్యమవుతున్నాయి.
#Thailand 🇹🇭 #ThailandFloods #BangkokFloods
Translation: via @grok; post by @iTakkung 🙏
“The flooding is extremely high in Chon Chuen Village, Bang Bo District, #SamutPrakan. In 2011, it didn't flood, but this year it's #flooding heavily because it's a lowland area where water…
— 🚶🏻Curtis S. Chin (@CurtisSChin) September 28, 2026
ఇదీ #Thailand #Bangkok #Thailandfloods #Floods వరద పరిస్థితి !
All 50 districts of Bangkok have been declared disaster areas https://t.co/ls28VE72L6https://t.co/YVOjzniILhpic.twitter.com/dCL8d3WLam https://t.co/vIBp6iyVc3
— Eclector (@eclector1419857) September 27, 2026