Upcoming Cars in October 2026: కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తున్న వారికి అక్టోబర్ 2026 మరింత ఇంట్రెస్ట్ కలిగించనుంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 11 కొత్త కార్లు భారత మార్కెట్లోకి అడుగుపెట్టనున్నాయి. ఇందులో లగ్జరీ సెడాన్లు, ప్రీమియం SUVలు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మోడళ్లు, ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు కూడా ఉన్నాయి.
అక్టోబర్ 5న మెర్సిడెస్ మేబ్యాక్ S-క్లాస్ ఫేస్ లిఫ్ట్ విడుదల కానుంది. కొత్త గ్రిల్, రీడిజైన్ చేసిన హెడ్ ల్యాంప్స్, స్టార్ ఆకారంలోని DRLsతో ఎక్స్ టీరియర్‌లో మార్పులు కనిపించనున్నాయి. లోపల 14.4 అంగుళాల సెంట్రల్ డిస్‌ప్లేతో పాటు ప్రీమియం క్యాబిన్ లభించనుంది. అంతర్జాతీయ మార్కెట్ లో S580 వెర్షన్ 4.0 లీటర్ V8 ఇంజిన్‌తో 537hp వరకు పవర్ అందిస్తుంది.
అక్టోబర్ 6న హోండా ఎలివేట్ ఫేస్‌లిఫ్ట్, స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఎలివేట్ లో కొత్త డిజైన్, అప్‌డేటెడ్ LED లైటింగ్, 360 డిగ్రీ కెమెరా, పెద్ద టచ్ స్క్రీన్ వంటి మార్పులు ఉండొచ్చు. ప్రస్తుత 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగుతుందని భావిస్తున్నారు. అదే రోజున స్లావియా ఫేస్‌లిఫ్ట్ కూడా రానుంది. ఇందులో కొత్త 8 స్పీడ్ ఆటోమేటిక్, 10.1 అంగుళాల టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా లాంటి ఫీచర్లు ఉండనున్నాయి.
అక్టోబర్ 12న వోల్వో రెండు ఎలక్ట్రిక్ మోడళ్లను తీసుకురానుంది. EX90 మూడు వరుసలతో కూడిన ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ SUV. 106kWh బ్యాటరీతో 625 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే వెర్షన్ ఉండొచ్చని తెలుస్తోంది. అదే సమయంలో ES90 ఎలక్ట్రిక్ సెడాన్ కూడా పరిచయం కానుంది. ఇందులో 92kWh, 106kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండొచ్చు. టాప్ వేరియంట్ 696 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ వెల్లడించింది.
హ్యుందాయ్ బేయాన్ గ్లోబల్ మోడల్‌గా అక్టోబర్‌లో పరిచయం కానుంది. భారత మార్కెట్ కోసం కూడా ఈ కాంపాక్ట్ SUVని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చే అవకాశం ఉంది. అక్టోబర్ 16న కొత్త తరం ఆడి Q3 భారత్‌లో విడుదల కానుంది. పాత మోడల్‌తో పోలిస్తే ఇది మరింత పొడవుగా, పూర్తిగా కొత్త డిజైన్‌తో రానుంది. 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్, 7-స్పీడ్ ఆటోమేటిక్, క్వాట్రో AWD వంటి ఆప్షన్లు ఉండొచ్చని అంచనా.
అక్టోబర్ 17న రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ రావచ్చని తెలుస్తోంది. 1.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పాటు రెండు ఎలక్ట్రిక్ మోటార్లు పనిచేసే హైబ్రిడ్ సిస్టమ్ ఇందులో ఉండొచ్చని సమాచారం. ఈ సెటప్ సుమారు 160hp పవర్‌ను అందించే అవకాశం ఉంది.
టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ కూడా అక్టోబర్‌లోనే వచ్చే అవకాశం ఉంది. డిజైన్, ఫీచర్లలో మార్పులతో పాటు 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ కొనసాగనుంది. CNG ఆప్షన్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది. విన్‌ఫాస్ట్ చిన్న VF3 ఎలక్ట్రిక్ SUVతో భారత మార్కెట్లో తన పోర్ట్ ఫోలియోను విస్తరించేందుకు సిద్ధమవుతోంది. చిన్న సైజు కారణంగా సరసమైన EVల విభాగంలో ఇది పోటీ పడే అవకాశం ఉంది.
ఈ జాబితాలో చివరిగా వోక్స్ వ్యాగన్ వర్టస్ ఫేస్‌లిఫ్ట్ ఉంది. ఎక్స్ టీరియర్‌తో పాటు క్యాబిన్, ఫీచర్లలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. 1.0 లీటర్, 1.5 లీటర్ TSI ఇంజిన్లు కొనసాగుతాయని అంచనా. 360 డిగ్రీ కెమెరా, అప్‌డేటెడ్ ఇన్ఫోటైన్‌మెంట్ వంటి ఫీచర్లు కూడా జోడించే అవకాశం ఉంది.
Read Also: ట్రైబర్ కు ఇక టర్బో పవర్.. కొత్త వేరియంట్ అదిరింది భయ్యా!