London: వలసలకు వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లింది లండన్ సిటీ. యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీకి లక్ష కుపైగా నిరసనకారులు పాల్గొన్నారు. యూకేలో జరిగిన అతిపెద్ద నిరసనల్లో ఇది కూడా ఒకటి. బ్రిటన్ రాజకీయాల్లో ఈ అంశం ప్రధానంగా మారింది.
అభివృద్ధి చెందిన దేశాలకు వలసలు పెద్ద సమస్యగా మారింది. వీటి కారణంగా లక్షలాది మంది ప్రతీ ఏడాది ఆయా దేశాలకు వలస పోతున్నారు. అభివృద్ధి చెందిన దేశాలకు ఇదొక సమస్యగా మారింది. కేవలం అమెరికా మాత్రమే కాదు. ఈ సెగ యూకేని సైతం తాకింది. లేటెస్ట్‌గా లండన్ సిటీలో భారీ స్థాయిలో యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీ జరిగింది.
దీనికి యూకెలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు లక్ష నుంచి లక్షన్నరకు పైగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. ఈ విషయాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు స్వయంగా వెల్లడించారు. ప్రజలు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ స్థాయిలో ప్రజలు హాజరుకావడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
ఐరోపాలో దాదాపు 44 దేశాలు ఉన్నాయి. అందులో 27 దేశాలు యూరోపియన్ యూనియన్‌గా కూటమి ఏర్పడింది. ఈయూ ద్వారా ఆయా సభ్య దేశాలు సార్వభౌమాధికారాన్ని పంచుకుంటాయి. కూటమిలో జర్మనీదే ఆధిపత్యం. కాకపోతే ఆయా దేశాలతోపాటు ఆసియా దేశాల ప్రజలు యూకెకు వలసలు పెరిగాయి. ఈ నేపథ్యంలో బ్రెగ్జిట్ పేరుతో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోతోంది.
ALSO READ: జపాన్‌లో వందేళ్లకు పైబడినవారు లక్షకు చేరువలో
దీనివల్ల యూకెకి వలసలు బాగా తగ్గాయి. ఈ ఏడాది ఇప్పటివరకు 28 వేల మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్ చేరుకున్నట్లు మీడియా రిపోర్టులు చెబుతున్నాయి. వలసలు రికార్డు స్థాయికి చేరడంపై స్థానిక జనాభాలో తీవ్ర అసంతృప్తి మొదలైంది. వలసదారుల వల్ల స్థానికుల ఉద్యోగాలను పోతున్నాయని నిరసనకారుల మాట.
అక్రమ వలసలు యూకెకు పెను భారంగా మారారని యాంటీ ఇమిగ్రేషన్ నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసియా దేశాల నుంచి యూకెకి వలసలు పెరగడంతో యాంటీ-ఇమిగ్రేషన్ కార్యకర్త టామీ రాబిన్‌సన్ ఆధ్వర్యంలో భారీగా నిరసన ర్యాలీ జరిగింది. బ్రిటన్ రాజకీయాల్లో ప్రధాన అంశం కీలకంగా మారింది.
రాబిన్‌సన్ ఈ అంశాన్ని మరింతగా పెద్దది చేస్తున్నట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. లండన్‌లో జరిగిన ర్యాలీలో నిరసనకారులు అమెరికా టోపీలు, ఇజ్రాయెల్ జెండాలు ప్రదర్శించడం కలకలం రేపింది. యాంటి ఇమిగ్రేషన్ నిరసనకారులు యూనియన్ ఫ్లాగ్, సెంట్ జార్జ్ క్రాస్ జెండాలను ప్రదర్శించారు. లండన్ బాటలో స్వీడన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
యాంటీ ఇమిగ్రేషన్ ర్యాలీలో మరో అంశం చోటు చేసుకుంది. ఈ ర్యాలీ సమయంలో జాత్యాహంకారానికి వ్యతిరేకంగా ‘స్టాండ్ అప్ టు రేసిజమ్’ పేరుతో మరో నిరసన జరిగింది. ఈ రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో 25 మంది వరకు పోలీసు అధికారులు గాయపడినట్టు బ్రిటన్ పత్రికలు చెబుతున్నాయి. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. మొత్తానికి లండన్‌లో జరిగిన ర్యాలీని వలసలు పెరుగుతున్న దేశాలు ఇదే పంథాని అనుసరించాలని భావిస్తున్నాయట.
వలస వ్యతిరేక నిరసనలతో దద్దరిల్లిన లండన్
'యునైట్ ద కింగ్డమ్' పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్‌సన్ నేతృత్వంలో లక్ష మందికి పైగా ప్రజలతో ర్యాలీ
ప్రధాని కీర్ స్టార్మర్‌కు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు
వలసదారులను బ్రిటన్ నుంచి పంపించేయాలనే… pic.twitter.com/8FE0oDS9n6
— BIG TV Breaking News (@bigtvtelugu) September 14, 2025