BigTV English

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Japan Population: జపాన్‌లో వందేళ్లకు పైబడిన వారు 1,00,000 చేరువలో.. కారణం ఇదేనట

Japan Population: ప్రస్తుత రోజుల్లో 60 ఏళ్ల నుంచి 70 ఏళ్లు బతకమే మహా గొప్ప.. 40 ఏళ్లు రాగానే ఏదో ఒక రోగం వచ్చి నానా ఇబ్బందులు పడుతున్నారు. మారుతున్న జీవినశైలి కారణంగా 35 నుంచి 40 ఏళ్ల వయస్సు ఉన్న వారికే బీపీ, షుగర్ లు, గుండె జబ్బులు వస్తున్నాయి. కానీ ఆ దేశంలో వందేళ్ల పైబడిన మనుషులు లక్షకు చేరువలో ఉన్నారు. మామూలుగా మన దేశంలో వందేళ్ల పై బడిన వారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటిది వందేళ్లు దాటిన వారు అక్షరాల 99,763 మంది ఉన్నారు. ఆ దేశం ఏదో కాదండీ.. జపాన్.. ఇక్కడ 100 ఏళ్లు పై బడిన వారి సంఖ్య దాదాపు లక్షకు చేరుకుని రికార్డ్ సృష్టించింది.


జపాన్ దేశంలో జనాభా విషయంలో చాలా విచిత్రకరమైన ధోరణి కనిపిస్తోంది. ఇది వినడానికి కొంత ఆసక్తిగా కూడా ఉంటుంది. ఓవైపు దేశంలో వందేళ్ల పై బడిన వారి సంఖ్య సరి కొత్త రికార్డ్ సృష్టిస్తుంటే.. మరోవైపు జనాభా విపరీతంగా తగ్గడం దేశాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రెండు అంశాలు దేశ భవిష్యత్తును తీవ్ర ప్రభావం చూపుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 1 నాటికి జపాన్‌లో 100 ఏళ్లు పైబడిన వ్యక్తుల సంఖ్య దాదాపు 1,00,000కు చేరువలో ఉండిరికార్డు సృష్టించింది. జపాన్‌లో 99,763 మంది సెంటినేరియన్లు (100 ఏళ్లు పైబడినవారు) ఉన్నారు. ఇది గత ఏడాది కంటే 4,644 మంది అధికం. ఈ సంఖ్యలో 88% మంది మహిళలు ఉండగా.. 12 శాతం మంది పురుషులు ఉన్నారు. అంటే సుమారు 87,800 మంది మహిళలు ఉండగా మిగిలినవారు పురుషులు. ఇది వరుసగా 55వ సంవత్సరాలుగా వందేళ్ల వయస్సు పైబడిన వారి రికార్డు నమోదు చేసినట్టు జపాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

జపాన్ దేశంలో ఇంత ఎక్కువ సంఖ్యలో వృద్ధులు ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఆరోగ్యకరమైన ఆహారం, అధునాతన వైద్య సదుపాయాలు, జీవనశైలి కారణంగా చాలా ఏళ్లు జీవిస్తున్నారు. జపనీయులు ఎక్కువగా చేపలు, కూరగాయాలను ఆహారంగా తీసుకుంటారు. చేపలను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ రోగాలు దరిచేరవు. వాళ్లు నిత్యం వ్యాయామం కూడా చేస్తుంటారు. అందుకే జపాన్ జీవిత కాల ఆయుర్దాయం ప్రపంచంలోనే ఎక్కువగా ఉంటుంది. మహిళలకు సగటున 87 ఏళ్లు.. పురుషులకు 81 ఏళ్లు ఉంటుంది.


ALSO READ: Gastric Health Tips: గ్యాస్ సమస్యకు చెక్ పెట్టండి ఇలా..! ఇంట్లోనే సులభమైన చిట్కాలు

అయితే.. జపాన్ లో రికార్డ్ స్థాయిలో ఆయుర్దాయం ఉన్నప్పటికీ.. కొన్ని సవాళ్లను కూడా తెచ్చిపెడుతోంది. దేశంలో అత్యధికంగా వృద్ధుల సంఖ్య పెరగడంతో పాటు పింఛన్ వ్యవస్థ, ఆరోగ్య సంరక్షణ, శ్రామిక శక్తి లోపాలు ఎక్కువ ఎదురువుతున్నాయి. అలాగే జనాభా సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది. జపాన్ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి వివిధ కార్యక్రమాలు అమలు చేస్తోంది. ముఖ్యంగా వృద్ధుల ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, ఎక్కువ మంది పిల్లలను కనేందుకు యువతను ప్రోత్సహిస్తుంది.

ALSO READ: DDA Recruitment: నిరుద్యోగులకు శుభవార్త.. డీడీఏలో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ రిలీజ్, పూర్తి వివరాలివే

జపాన్‌లో అత్యంత వయోవృద్ధురాలు టోమికో ఇటోకా. ఆమెకు 116 సంవత్సరాల వయస్సు ఇప్పటికీ ఆరోగ్యంగా ఉంది. ఆమె వంటి వారు ఆరోగ్యకరమైన జీవితానికి ప్రేరణ. జపాన్ ఈ రికార్డును సెప్టెంబర్ 15న జరిగే ‘రెస్పెక్ట్ ఫర్ ది ఏజ్డ్ డే’ సందర్భంగా గుర్తుచేసుకుంటుంది. వృద్ధులకు బహుమతులు, సన్మానాలు చేస్తుంది. మొత్తంగా జపాన్ దేశం ఆరోగ్యకరమైన జీవనం ద్వారా దీర్ఘాయువు సాధ్యమని నిరూపించింది. భారతదేశంలో కూడా ఇలాంటి కార్యక్రమాలు అనుసరిస్తే.. మన దేశంలో వృద్ధుల సంఖ్య పెరగే ఆస్కారం ఉంటుంది.

Related News

Russia Earthquake: మరోసారి రష్యాను వణికించిన భారీ భూకంపం, సునామీ హెచ్చరికలు జారీ!

Nepal: నేపాల్ పార్లమెంట్ రద్దు.. తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి

Musk Vs Ellison: మస్క్ ని మించిన మొనగాడు.. ప్రపంచ నెంబర్-1 కుబేరుడు అతడే

Nepal: నేపాల్‌లో ఇంకా కర్ఫ్యూ.. ఖైదీలపై సైన్యం కాల్పులు, మాజీ ప్రధాని ఇంట్లో నగదు, బంగారం సీజ్?

Donald Trump: ఇజ్రాయెల్, ఖతార్ వార్..! బెడిసికొట్టిన ట్రంప్ డబుల్ గేమ్

Charlie Kirk: అమెరికాలో రాజకీయ హింస.. ట్రంప్ సన్నిహితుడు చార్లీ కిర్క్‌ హత్య, నిందితులెవరు?

Pushpa – Trump: ‘పుష్ప’ తరహాలో ఆ దేశానికి ఝలక్ ఇచ్చిన ట్రంప్.. ఇలా తయారయ్యావేంటి మామ!

Big Stories

×