EPAPER

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Trump blames Biden, Harris for second assassination attempt: యావత్ ప్రపంచమంతా ఆసక్తి ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు దగ్గరపడుతోంది. నవంబర్ లో జరగనున్న ఈ ఎన్నికలలో ఈ సారి ఎన్నికలు ఏకపక్షంగా జరగవని తేలిపోయింది. సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రత్యర్థులు తమ ప్రచార హోరును పెంచారు. రిపబ్లికన్ పార్టీ తరపున ట్రంప్ పోటీచేస్తున్నారు. డెమోక్రటిక్ పార్టీ తరపున కమలా హ్యారిస్ పోటీ చేస్తున్నారు. ఇటీవల జరిగిన బహిరంగ డిబేట్ లో ట్రంప్, కమలా హ్యారిస్ వాడి వేడిగా డిబేట్ జరిగిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షురాలైతే అక్కడి ప్రజలకు హ్యారిస్ ఏం చేస్తారని ట్రంప్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా హ్యారిస్ సమాధానం ఇచ్చారు.


నంబర్ వన్ గా తీర్చిదిద్దుతా

తాను మిడిల్ క్లాస్ నుంచే వచ్చానని..తనని గెలిపిస్తే చిన్న, మధ్య తరగతి కుటుంబాలు, చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తానని కమలా హ్యారిస్ చెప్పారు. ట్రంప్ వస్తే కేవలం శ్రీమంతులకే లబ్ధి చేకూరుస్తారని విమర్శలు గుప్పించారు. అయితే ట్రంప్ మాట్లాడుతూ అమెరికాను నెంబర్ వన్ గా తీర్చిదిద్దడమే తన ఏకైక లక్ష్యమన్నారు. ఇమ్మిగ్రేషన్స్ గురించి ట్రంప్ మాట్టాడటానికి ప్రయత్నిస్తుంటే హ్యారిస్ మీరు చెప్పినదానినే మళ్లీ మళ్లీ అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డులా చెబుున్నారని విమర్శించారు. అలా హోరాహోరీగా సాగింది వీరి డిబేట్. అయితే యావత్ ప్రపంచమంతా ఈ డిబేట్ ని గమనించింది. ఇప్పటికే అమెరికా ఓటర్లు ఓ స్పష్టమైన అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.


Also Read: స్టారు క్రిమినల్ హిస్టరీ… నెలలపాటు జైల్లోనే…

కాల్పులకు కారణం వారే

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ టార్గెట్ గా ఇటీవల ఏకే 47 రైఫిల్ తో దుండగుడు దాడిచేసిన విషయం విదితమే. ఈ సంఘటనకు సంబంధించి నిందితుడు ర్యాన్ వెస్టీ రౌత్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. కాగా సురక్షితంగా ట్రంప్ ను రక్షణాధికారులు అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనపై ట్రంప్ స్పందించారు. బైడెన్, కమలా హ్యారిస్ తో సహా డెమోక్రటిక్ నేతలు తనని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని..తనని ఓ దేశద్రోహిగా ముద్రిస్తూ ప్రజలలో దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా హ్యారిస్, బైడెన్ ప్రసంగాలు ఉంటున్నాయని అన్నారు. వారి మాటలతో దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారని మండిపడ్డారు. నాకు కూడా వారిలా మాట్లాడటం వచ్చు..కానీ మర్యాదలేకుండా నేను అలా మాట్లాడలేనని తనకంటూ ఓ స్టేటస్ ఉందని..చిల్లరగా వారిలా మాట్లాడలేనని అన్నారు.

గెలుపు ఖాయం..

వారి మాటలు పట్టుకుని కొన్ని భజన మీడియాలు కూడా వారికి మద్దతుగా తన గురించి చెడ్డగా చిత్రీకరిస్తూ వార్తా కథనాలు వండి వారుస్తున్నారని..ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని మండిపడ్డారు. వీరంతా కలసి తనపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని..అలా రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే కొందరు తనపై పనిగట్టుకుని దాడులు చేస్తున్నారని..ఈ దాడులన్నీ వారి వ్యాఖ్యల వలనే అంటూ సంచలనాత్మక కామెంట్స్ చేశారు ట్రంప్.అమెరికా అధ్యక్ష ఎన్నికలలో తన గెలుపు ఖాయమని సర్వేలు చెబుతున్నాయని..అది చూసి తట్టుకోలేక ఇలాంటి చవకబారు ఎత్తులతో వారు ప్రజలలో మరింత దిగజారుతున్నారని ట్రంప్ మండిపడ్డారు.

Related News

India canada diplomatic row: నిజ్జర్ హత్య కేసు చిచ్చు.. ఆరుగురు కెనడా దౌత్య వేత్తలను బహిష్కరించిన భారత్

UN Peacekeepers Netanyahu: ‘అడ్డుతొలగండి.. లేకపోతే మీకే నష్టం’.. లెబనాన్‌ ఐరాస కార్యకర్తలను హెచ్చరించిన నెతన్యాహు

China military Drill Taiwan| తైవాన్ చుట్టూ చైనా మిలటరీ డ్రిల్.. ‘యుద్దం రెచ్చగొట్టేందుకే’

Israeli bombardment In Gaza: గాజా బాంబుదాడుల్లో 29 మంది మృతి.. లెబనాన్ లో మరో ఐరాస కార్యకర్తకు తీవ్ర గాయాలు

Women CEOs Earning More| పురుషుల కంటే మహిళా సిఈఓల సంపాదనే ఎక్కువ .. కాన్ఫెరెన్స్ బోర్డు రిపోర్టు

Cyber Attacks On Iran: ఇరాన్ లో పెద్దఎత్తున సైబర్ దాడులు.. అణుస్థావరాలే లక్ష్యం

US airstrikes: సిరియాపై బాంబుల వర్షం..ఐసిస్ ఉగ్రస్థావరాలే లక్ష్యంగా దాడులు!

Big Stories

×