Ambati Rayudu: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మధ్య జరిగిన ఆసక్తికర పోరు ముగిసింది. చిరకాల ప్రత్యర్ధులు ఇండియా – పాకిస్తాన్ జట్లు ఆదివారం రోజు దుబాయ్ వేదికగా తలపడ్డాయి. ఈ మ్యాచ్ కోసం క్రీడాభిమానులు వేయికళ్లతో ఎదురు చూశారు. టీమిండియా ఫ్యాన్స్ అంతా భారత్ గెలవాలని కోరుకున్నారు. వారు కోరుకున్నట్లుగానే ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ సేన విజయం సాధించింది.
Also Read: Thaman – Akhil: తమన్ ను గట్టిగా తన్నిన అఖిల్..వీడియో వైరల్ !
అంతేకాకుండా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సెంచరీ పూర్తి చేసుకోవడంతో అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అయ్యింది. భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే క్రీడాభిమానులలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాయాదుల సమరాన్ని ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా చూడాలనుకుంటారు. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా జరిగిన భారత్-పాకిస్తాన్ మ్యాచ్ కి సెలబ్రిటీలు క్యూ కట్టారు. సినీ, రాజకీయ, వ్యాపార, క్రీడా రంగాలకు చెందిన హేమహేమీలతో ఆదివారం రోజు దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం కళకళలాడింది. మైదానం నలుమూలలా సెలబ్రిటీలు తలుక్కున మెరిశారు.
ఈ మ్యాచ్ చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుండి మెగాస్టార్ చిరంజీవి, ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, పుష్ప సినిమా దర్శకుడు సుకుమార్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్, క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి, సన్నీ డియోల్ ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే భారత్ ఇన్నింగ్స్ ఆరంభంలో కెమెరామెన్.. పుష్ప దర్శకుడు సుకుమార్ ని చూపించాడు. ఈ క్రమంలో తెలుగు కామెంటేటర్ ఒకరు మాట్లాడుతూ.. ” అదిగో.. తెలుగు భాషకు గర్వకారణం” అని సుకుమార్ ని ప్రశంసించారు.
ఈ మ్యాచ్ చూడడానికి చాలామంది తెలుగు వాళ్ళు వచ్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంలోనే కామెంట్రీ చేస్తున్న మాజీ క్రికెటర్ అంబటి రాయుడు {Ambati Rayudu} మాట్లాడుతూ ఒక్కసారిగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు వివాదం రేపుతున్నాయి. అంబటి రాయుడు మాట్లాడుతూ.. ” ఇలాంటి హై వోల్టేజ్ మ్యాచ్ అంటే టీవీలలో ఎక్కువగా కనిపిస్తారు కదా. అంతా షో కోసమే వస్తుంటారు. ఇలాంటి మ్యాచ్ లకు వస్తే టీవీలలో ఎక్కువగా కనిపిస్తారు కదా. ఇది పబ్లిసిటీ స్టంట్”. అంటూ {Ambati Rayudu} సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో అంబటి రాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: Hardik Pandya: పాక్ ప్లేయర్లకు చేతబడి..పాండ్యా ఫోటోలు వైరల్ !
ఈ వ్యాఖ్యలపై నెటిజెన్లు చాలామంది మండిపడుతున్నారు. “ఏంటి రాయుడు.. మన సెలబ్రిటీలను అంత మాట అనేసావ్” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మన దేశం తరఫున ఓ టీమ్ ఆడుతున్నప్పుడు.. ఆటపై ఇష్టంతో సపోర్ట్ చేయడానికి వేల రూపాయలు ఖర్చు చేసి స్టేడియానికి వచ్చిన వారిని ఈ రకంగా అవమానిస్తావా..? అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాళ్లు పబ్లిసిటీ కోసం రాలేదని.. {Ambati Rayudu} నువ్వే అటెన్షన్ కోసం ఇలాంటి కామెంట్స్ చేస్తున్నావని మండిపడుతున్నారు.
Rayudu 😭🤣pic.twitter.com/r9QKXJWEP6 https://t.co/PBRIEyxjAC
— EpicCommentsTelugu (@EpicCmntsTelugu) February 23, 2025