Big Shock To Kohli-Rohit: విరాట్ కోహ్లీ ( Kohli), రోహిత్ శర్మ ( Rohit) అభిమానులకు ఊహించని షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డేలతో పాటు టి20 లు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నద్ధం అవుతోంది. ఈ క్రమంలో వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఆడే అవకాశం వచ్చేది. కానీ ఈ సిరీస్ జరగడం కష్టమేనని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో బంగ్లాదేశ్ తో సంబంధాలు పెట్టుకునేందుకు మోడీ ప్రభుత్వం ముందుకు రాకపోవచ్చు అని అంచనా వేస్తున్నారు. హిందువులపై అత్యంత దారుణంగా దాడులు చేసిన బంగ్లాదేశ్ తో క్రికెట్ మ్యాచ్ లో నిర్వహించేలా మోడీ ప్రభుత్వం అనుమతులు ఇస్తే… ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియాను పంపకపోవచ్చు అని అంటున్నారు.
సెప్టెంబర్ మాసంలో బంగ్లాదేశ్ వర్సెస్ టీమ్ ఇండియా ( Bangladesh vs. Team India ) మధ్య 3 వన్డేలు, మూడు టి20 లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే బంగ్లాదేశ్ పర్యటనకు టీమిండియా వెళ్లనుంది. అయితే అంతకంటే ముందు మోడీ ప్రభుత్వం నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఇదే విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు కూడా స్పష్టం చేసింది బీసీసీఐ. మోడీ ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే… పర్యటనపై క్లారిటీ ఇస్తామని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కు లేఖ కూడా రాసిందట బీసీసీఐ. అంటే ఈ సిరీస్ నిర్వహణ అంశం మోడీ సర్కార్ నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది. దీనిపై ఇంకా చర్చలు జరగలేదు.
మరో వారం రోజుల్లో దీనిపై ఏదో ఒక విషయాన్ని మోడీ సర్కార్ ( Modi Govt) తేల్చనున్నట్లు తెలుస్తోంది. అయితే కొంతమంది మాత్రం బంగ్లాదేశ్ టూర్ కు ప్రధాని నరేంద్ర మోడీ ( Pm Modi) నో చెబుతారని అంచనా వేస్తున్నారు. మోడీ ప్రభుత్వానికి విమర్శలు వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో… ఈ సిరీస్ రద్దు అయ్యే అవకాశాలు 70% ఉన్నట్లు స్పష్టం చేస్తున్నారు. రెండు దేశాల మధ్య నెలకొన్న రాజకీయ దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వైట్ బాల్ సిరీస్ కు కేంద్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇవ్వకపోవచ్చు అని పేర్కొంటున్నారు. ఇదే జరిగితే, ఇప్పట్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మళ్ళీ బ్యాట్ పట్టడం కష్టమే. 2027 వన్డే వరల్డ్ కప్ ( 2027 ODI World Cup) దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎక్కువ వన్డేలు జరిగితే, టీమిండియా లోపాలు సవరించుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ క్రమంలో బంగ్లా టూర్ కు ప్రధాని మోడీ పెద్ద మనసు చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
Mohammad Yousuf On IND VS PAK: రాసి పెట్టుకోండి…పాకిస్తాన్ ను ఓడించే శక్తి, టీమిండియాకు లేదు