Trump Personal Jet :అమెరికా అధ్యక్షుడిగా ఎంపికైన డోనాల్డ్ ట్రంప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ.. ఆయన ప్రైవేట్ జెట్ గురించి మాత్రం ఇప్పుడు ఇంటర్నెట్ లో ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎవరికీ పెద్దగా తెలియని ట్రంప్ సొంత విమానం గురించి అనేక విశేషాల గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. విమానం లోపల ఎంత లగ్జరీగా ఉందో తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. మరి.. ఇప్పటి వరకు తెలియని ఈ విమానం ముచ్చట్లు.. ఇప్పుడు బయటకు ఎలా తెలిశాయి అనే కదా మీ ప్రశ్న.. అయితే ఈ కథనం మీ కోసమే..
ఇటీవలి అమెరికా అధ్యక్ష సమయంలో డోనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ కలిసి ప్రచారం చేశారు. ఆ తర్వాత ఎన్నికల ఫలితాల సమయంలో వారికి సంబంధించిన ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అందులో ట్రంప్, ఎలాన్ మాస్క్ కలిసి లంచ్ చేస్తున్నట్లు ఉంది. ఆ ఫోటో ట్రంప్ ప్రైవేట్ జెట్ లోనిదే. ఆ తర్వాత.. ఆ విమానం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. ఎవరికైనా ఆసక్తి ఉన్నా.. ట్రంప్ కాకుండా ఆ విమానం ఎలా ఉంటుందో చూపించే సాహసం ఎవరు చేస్తారు. కానీ.. ఈ పని చేసింది.. ట్రంప్ మనుమరాలు. తాత వద్దంటున్నా.. ఆయన ప్రైవేట్ విమానానికి సంబంధించిన వీడియోను తీసి.. యూట్యూబ్ లో పంచుకుంది. ఇందులో.. ఆ విమానంలోని లగ్జరీ, ట్రంప్ అభిరుచులు వంటి విషయాలన్నీ తెలిసేలా.. వీడియో రూపొందించింది.
తన స్నేహితురాలితో కలిసి.. ఇటీవల ఆ విమానంలో ప్రయాణించిన కై ట్రంప్.. సరదాగా సందడి చేసింది. విమానంలోని కాక్ పీట్ లోకి వెళ్లి.. పైలెట్లతో కలిసి అక్కడి వ్యూన్ ను చూపించింది. విమానం ల్యాండింగ్ దృశ్యాలనూ వీడియోలో పంచుకుంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. డోనాల్డ్ ట్రంప్ లగ్జరీ లైప్ గురించి ఆసక్తిగా మాట్లాడుకునేలా చేసింది.
ఈ విమానంలో ప్రయాణం తర్వాత కై ట్రంప్ తన తాతయ్య డోనాల్డ్ ట్రంప్ తో కలిసి.. స్పేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగాన్ని వీక్షించేందుకు వెళ్లింది. టెక్సాస్ లోని బ్రౌన్ విల్లేలో ఈ ప్రయోగం జరిగింది. కాగా.. దానిని చూసేందుకు తాతయ్య ట్రంప్ తో పాటుగా వెళ్లిన కై ట్రంప్.. ఆ సమయంలోనే విమానంలో వీడియో తీస్తానంటే.. తన తాతయ్య వద్దని అన్నారని చెప్పారు. అయినా.. తాను వీడియో తీస్తున్నానంటూ చెప్పుకొచ్చింది. తన స్నేహితురాలితో కలిసి, రాకెట్ లాంచింగ్ సమయంలో డోనాల్డ్ ట్రంప్ తో కలిసి కనిపించారు. ఆ సమయంలోనే ఎలాన్ మస్క్ తోనూ ముచ్చటించారు.
Also Read : శ్వేతజాతీయులపై వివక్ష.. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యా నాదేళ్లకు ఎలాన్ మస్క్ ఫిర్యాదు..
డోనాల్డ్ ట్రంప్ కుమారుడు జూనియర్ ట్రంప్ కుమార్తె కై ట్రంప్.. గతంలో ఎవరికీ పెద్దగా తెలియని ఈ టీనేజర్, ఈ వీడియోతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు సాధించారు.