Keratin Hair Mask: ఆరోగ్యకరమైన, మెరిసే జుట్టు కోసం సమతుల్య ఆహారంతో పాటు ప్రత్యేక శ్రద్ధ చాలా ముఖ్యం. వారానికి రెండుసార్లు గోరువెచ్చని కొబ్బరి లేదా బాదం నూనెతో జుట్టుకు మసాజ్ చేయడం వల్ల జుట్టుకు పోషణ అందుతుంది. అంతే కాకుండా జుట్టుకు బలం చేకూరుతుంది. ఇదే కాకుండా, సహజమైన హెయిర్ మాస్క్‌లు , తేలికపాటి షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ లభిస్తుంది.
జుట్టు రాలడానికి ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణమని గుర్తుంచుకోండి. అందువల్ల, ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయండి. ఇదిలా ఉంటే ఇంట్లోనే కొన్ని రకాల టిప్స్ పాటించడం వల్ల జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
కెరాటిన్ హెయిర్ మాస్క్‌లు జుట్టును మృదువుగా చేయడంతో పాటు.. డ్యామేజ్ కాకుండా సహాయపడతాయి. మీరు ఇంట్లోనే కెరాటిన్ హెయిర్ మాస్క్ సులభంగా తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
కెరాటిన్ హెయిర్ మాస్క్ తయారీకి కావలసిన పదార్థాలు:
అవిసె గింజలు- 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి నీరు- 1 కప్పు
తేనె-1 టీస్పూన్
నిమ్మరసం- 1 టీస్పూన్
అలోవెరా జెల్- 2 టేబుల్ స్పూన్లు
ఆలివ్/కొబ్బరి/ఆర్గాన్ ఆయిల్- 1 టేబుల్ స్పూన్ హెయిర్ ఆయిల్
కెరాటిన్ హెయిర్ మాస్క్ ఎలా తయారు చేయాలి ?
1. ఫ్లాక్స్ సీడ్ జెల్ తయారు చేసుకోండి:
ఒక పాన్‌లో రెండు టేబుల్‌స్పూన్ల అవిసె గింజలను వేయించి, ఆపై 1 కప్పు కొబ్బరి నీరు వేసి 7-10 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి దానిని ఫిల్టర్ చేసి చల్లబరచండి.
2.ఇతర పదార్థాలను కలపండి:
చల్లారిన అవిసె గింజల జెల్ తీసుకొని దానికి 1 టీస్పూన్ తేనె, 1 టీస్పూన్ నిమ్మరసం, 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ , 1 టేబుల్ స్పూన్ హెయిర్ ఆయిల్ కలపండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా మిక్స్ చేయండి. తద్వారా మృదువైన పేస్ట్ తయారవుతుంది.
కెరాటిన్ హెయిర్ మాస్క్ ఉపయోగించే విధానం:
కెరాటిన్ హెయిర్ మాస్క్‌ని ఉపయోగించడానికి , ముందుగా జుట్టును తడి చేయండి. ఇలా చేయడం వల్ల మాస్క్ జుట్టుకు బాగా పడుతుంది. దీని తర్వాత.. బ్రష్ లేదా చేతుల సహాయంతో జుట్టు యొక్క మూలాల నుండి చివర్ల వరకు మాస్క్‌ను అప్లై చేయండి. తేమను నిలుపుకోవడానికి 40-45 నిమిషాల పాటు జుట్టు కప్పి ఉంచండి.
హెయిర్ వాష్:
తేలికపాటి షాంపూతో జుట్టును వాష్ చేయండి. జుట్టు వాష్ చేయడానికి గోరువెచ్చని నీటిని ఉపయోగించండి.
కండీషనర్ అప్లై చేయండి:
మీ జుట్టును వాష్ చేసిన తర్వాత, మీకు కావాలంటే చాలా కండీషనర్ ఉపయోగించండి. కెరాటిన్ హెయిర్ మాస్క్‌తో జుట్టు మృదువుగా మారుతుంది.
Also Read: రైస్ వాటర్‌తో.. మచ్చలేని చర్మం మీ సొంతం
కెరాటిన్ హెయిర్ మాస్క్ యొక్క ప్రయోజనాలు :
దీని రెగ్యులర్ గా వాడటం వల్ల జుట్టు మృదువుగా, బలంగా మారుతుంది.
ఈ మాస్క్ జుట్టుకు పోషణనిస్తుంది. అంతే కాకుండా జుట్టు రాలడం తగ్గుతుంది.
మంచి ఫలితాల కోసం మీరు వారానికి ఒకసారి ఈ మాస్క్‌ని ఉపయోగించవచ్చు.
గమనిక: వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ బాధ్యత వహించదని గమనించగలరు.