FB vs Bosch washing machine comparison 2026: కొత్త వాషింగ్ మెషీన్ కొనాలనే ఆలోచన రాగానే ముందుగా గుర్తొచ్చే పేర్లు IFB, Bosch. కానీ.. రెండింటిలో ఏది బెస్ట్ అనే సందేహం చాలా మందిలో ఉంటుంది.వాషింగ్ మెషీన్ కొనే ముందు అప్‌డేటెడ్ టెక్నాలజీ..స్మార్ట్ ఫీచర్లతో ఏ బ్రాండ్ ముందంజలో ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకే.. బట్టల నాణ్యత, కరెంట్ ఆదా, సర్వీస్ వంటి ఇతర అంశాలను బట్టి ఏది మీ ఇంటికి స్మార్ట్ ఛాయిస్ అవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీ ఇంటికి బెస్ట్ ఆప్షన్‌ని ఎంచుకోవడానికి ఈ గైడ్ మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది.
IFB బ్రాండ్ ముఖ్యంగా ముఖ్యంగా హార్డ్ వాటర్ సమస్యకు అనుగుణంగా తయారైంది.
టెక్నాలజీ: IFB మెషీన్స్‌లో ‘Aqua Energie’ అనే ప్రత్యేక టెక్నాలజీ ఉంటుంది. ఇది నీటిని మృదువుగా మార్చి, డిటర్జెంట్ బాగా కరిగేలా చేస్తుంది.
వారంటీ: IFB వాళ్ళు సాధారణంగా 4 ఏళ్ల మెషీన్ వారంటీని ఇస్తారు. ఇది చాలా వరకు ప్లాస్ లేదా ఇతర కంపెనీల కంటే ఎక్కువ.
ధరలు: IFB ఆటోమేటిక్ మెషీన్లు సుమారుగా రూ.28,000 నుంచి రూ.45,000 వరకు లభిస్తాయి.
Bosch మెషీన్లు జర్మన్ ఇంజనీరింగ్‌తో తయారవుతాయి. ఇవి ఫినిషింగ్‌లో చాలా పక్కాగా ఉంటాయి.
టెక్నాలజీ: వీటిలో ‘Anti-Vibration’ సైడ్ ప్యానెల్స్ ఉంటాయి. మెషీన్ తిరుగుతున్నప్పుడు శబ్దం రాకుండా.. కదలకుండా చాలా స్మూత్‌గా పని చేస్తాయి. వీటి ‘ActiveWater Plus’ టెక్నాలజీ నీటి వాడకాన్ని తగ్గించి, బట్టలను క్లీన్ చేస్తుంది.
మన్నిక:ఈ మెషీన్లు ఎక్కువకాలం పాటు పాడవకుండా పని చేస్తాయి. బట్టల మీద మచ్చలను వదిలించడంలో వీటిలోని ‘Anti-Stain’ ప్రోగ్రామ్స్ అద్భుతంగా ప నిచేస్తాయి.
ధరలు: ఈ మోడల్ మెషీన్లు సాధారణంగా రూ.32,000 నుంచి రూ.55,000 మధ్యలో ఉంటాయి.
ఏది స్మార్ట్ ఛాయిస్?
మీ అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి.
హార్డ్ వాటర్ ఉంటే.. మీ ఇంట్లో నీరు ఉప్పగా లేదా కఠినంగా ఉంటే.. IFB బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్వా ఎనర్జీ ఫీచర్ దీనికి పరిష్కారం.
ప్రశాంతత, నాణ్యత కావాలంటే.. మీకు మెషీన్ రన్నింగ్‌లో అస్సలు శబ్దం రాకూడదు, బట్టల నాణ్యత విషయంలో రాజీ పడకూడదు అనుకుంటే Boschని ఎంచుకోండి.
సర్వీస్ సపోర్ట్: ఇండియాలో IFB కి సర్వీస్ నెట్‌వర్క్ చాలా విస్తృతంగా ఉంది. అయితే.. పెద్ద నగరాల్లోనూ Bosch సర్వీస్ కూడా చాలా బాగుంటుంది.
Also Read: రూ.889కే స్మార్ట్ వాచ్.. ఫీచర్లకు ఎవ్వరైనా ఫిదా!
2026లో స్మార్ట్ ఫీచర్స్ కోసం చూస్తున్నట్లయితే.. Bosch కొంచెం ప్రీమియం అనుభవాన్ని ఇస్తుంది. తక్కువ మెయింటెనెన్స్‌తో ఎక్కువ కాలం, నీటి కండిషన్స్‌కి తట్టుకోవాలి అంటే IFB గొప్ప ఛాయిస్.
ఏ బ్రాండ్ తీసుకున్నా సరే, మీ బడ్జెట్ ,ఇంట్లోని నీటి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకసారి కొన్నాక కనీసం 8-10 ఏళ్లు పని చేసేలా చూసుకోవడం తెలివైన పని. పైన చెప్పిన ఫీచర్లను బట్టి మీ ఫ్యామిలీకి ఏది సరిపోతుందో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు చాలా ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో ఆఫర్లు నడుస్తున్నాయి. కాబట్టి ధరలను చెక్ చేసుకుని ఆర్డర్ చేయండి!