E-Paper
Advertisement

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!

టాటా నెక్సాన్ కామో ఎడిషన్ లాంచ్.. వారెవ్వా.. ఏం ఫీచర్లు గురూ!
Advertisement

Tata Nexon Camo Edition Launch:  టాటా మోటార్స్ భారత మార్కెట్లోకి కాంపాక్ట్ ఎస్‌యూవీ నెక్సాన్ కు కొత్త కామో ఎడిషన్ ను పరిచయం చేసింది. ఈ స్పెషల్ ఎడిషన్ ప్రారంభ ధర రూ.9.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. నెక్సాన్ భారత మార్కెట్లో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని 11 లక్షలకు పైగా అమ్మకాల మైలురాయిని దాటిన సందర్భంగా ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను కంపెనీ విడుదల చేసింది. ఈ కొత్త ఎడిషన్‌ లో ఇంజిన్, పనితీరులో ఎలాంటి మార్పులు చేయలేదు. వెహికల్ లుక్‌ ను మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు కొన్ని కొత్త ఫీచర్లను యాడ్ చేసింది. దీంతో ఇప్పటికే నెక్సాన్ కొనాలనుకునే వారికి ఈ కొత్త వెర్షన్ మరో బెస్ట్ ఆప్షన్ కానుంది.

రెండు రంగుల్లో కామో ఎడిషన్ విడుదల

బయటి డిజైన్‌ లో కామో ఎడిషన్ రెండు కొత్త రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. మున్నార్ మిస్ట్, కూర్గ్ క్లౌడ్ అనే ప్రత్యేక కలర్ ఆప్షన్లను టాటా అందిస్తోంది. మున్నార్ మిస్ట్ రంగు యాష్- గ్రీన్ మిక్సింగ్ లో ఉండి, లైటింగ్ ను బట్టి కొద్దిగా రంగు మారినట్లు కనిపిస్తుంది. కూర్గ్ క్లౌడ్ మాత్రం యాష్- సిల్వర్ కలర్ తో సింపుల్‌గా ఆకట్టుకుంటుంది. ఈ రెండు రంగులతో పాటు ముందు ఫెండర్లపై స్పెషల్ కామో బ్యాడ్జ్‌ లు ఉండటం ఈ ఎడిషన్‌ కు ప్రత్యేక గుర్తింపు ఇవ్వనుంది.

క్యాబిన్ లో కీలక మార్పులు

Advertisement

క్యాబిన్‌లో కూడా కొన్ని ప్రత్యేక మార్పులు చేశారు. ముందు సీట్ల హెడ్‌ రెస్ట్‌ లపై కామో డిజైన్‌ తో ప్రత్యేక ఫినిషింగ్ ఇచ్చారు. అలాగే, ఇంటీరియర్‌ ను మరింత ప్రీమియంగా కనిపించేలా రూపొందించారు. ఫీచర్ల విషయానికి వస్తే, ఈ కామో ఎడిషన్‌ లో కొత్త 12.3 అంగుళాల టచ్‌ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ను అందించారు. దీనితో పాటు 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా ఉంటుంది. ఈ రెండు డిస్‌ ప్లేలు డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్ ను మరింత అద్భుతంగా మార్చనున్నాయి.

ఈ ఎడిషన్‌లో మరో ప్రధాన ఆకర్షణ ఇంటిగ్రేటెడ్ డాష్‌ క్యామ్. వాహనంలోని 360 డిగ్రీ కెమెరా వ్యవస్థతో అనుసంధానమై పనిచేసే ఈ డాష్‌ క్యామ్ ప్రయాణ సమయంలో వీడియోలను నిరంతరం రికార్డ్ చేస్తుంది. ప్రమాదం జరిగినప్పుడు సంబంధిత వీడియోలను ఆటోమేటిక్‌ గా సేవ్ చేస్తుంది. అవసరమైతే వాటిని కారులోని స్క్రీన్‌ పై చూడవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ కు పంపించుకోవచ్చు.

అదిరిపోయే ప్రీమియం ఫీచర్లు

Advertisement

వేరియంట్‌ను బట్టి పలు ప్రీమియం ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటిలో పనోరమిక్ సన్‌ రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, 360 డిగ్రీ కెమెరా, బ్లైండ్ వ్యూ మానిటర్, JBL 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అలాగే ఏడు ఫీచర్లతో కూడిన ADAS ఉన్నాయి. భద్రత విషయంలోనూ టాటా ఎలాంటి రాజీ పడలేదు. ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ లాంటి సేఫ్టీ ఫీచర్లతో పాటు గ్లోబల్ NCAP, భారత్ NCAP క్రాష్ టెస్టుల్లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ పొందిన భద్రతా ప్రమాణాలు కొనసాగుతున్నాయి.

ఇంజిన్ ఆప్షన్స్ గురించి..

ఇంజిన్ ఆప్షన్స్ మాత్రం స్టాండర్డ్ నెక్సాన్‌లో ఉన్నవే. ఇందులో 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, అలాగే 1.2-లీటర్ టర్బో సీఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. ట్రాన్స్‌ మిషన్ పరంగా మాన్యువల్, AMT, డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్ ఆప్షన్స్ లభిస్తాయి. నెక్సాన్ కామో ఎడిషన్ క్రియేటివ్, క్రియేటివ్+ S, క్రియేటివ్+ PS, ఫియర్‌లెస్+ PS, ఫియర్‌లెస్+ A PS వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. ఈ స్పెషల్ ఎడిషన్ కాంపాక్ట్ ఎస్‌యూవీ కొనుగోలు చేయాలనుకునే వారికి మరో క్రేజీ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.

Read Also: టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

Tags

Related News

టెస్లా, BYDలకు షాక్.. భారత ఈవీలకు ప్రపంచ గుర్తింపు!

తెలుగు రాష్ట్రాల్లో ఈవీ ఛార్జింగ్ స్టేషన్లతో డబ్బే డబ్బు.. ఇలా చేస్తే చాలు!

వాహనాలకు ఇన్సురెన్స్ అవసరమా? దాని వల్ల ఉపయోగాలేంటీ?

ఈవీ మార్కెట్ లో టీవీఎస్ దూకుడు.. జస్ట్ 7 నెలల్లో 3 లక్షలకుపైగా స్కూటర్ల సేల్!

కియా కార్లపై భారీ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.5 లక్షల తగ్గింపు!

టాటా To కియా.. రూ.20 లక్షల్లోపు బెస్ట్ సౌండ్ సిస్టమ్ కార్లు ఇవే!

టియాగో ఈవీ To విండ్సర్ ఈవీ.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు!

Big Stories

Advertisement
×