BigTV English

Trump EU Tariffs: మిత్రదేశాలనూ వదలని ట్రంప్.. యూరోప్ కూటమిపై 25 శాతం సుంకాలు

Trump EU Tariffs: మిత్రదేశాలనూ వదలని ట్రంప్.. యూరోప్ కూటమిపై 25 శాతం సుంకాలు

Trump EU Tariffs| అగ్రరాజ్యం సుంకాల దెబ్బ ఇప్పుడు యూరోప్ కూటమి (ఈయూ – యూరోపియన్ యూనియన్‌)పై పడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. యూరోప్ కూటమి దిగుమతులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. బుధవారం తొలి కేబినెట్ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. ఈయూతో వాణిజ్యంలో అమెరికాకు అన్యాయం జరుగుతోందని ఆయన ఆరోపణలు చేశారు.


‘‘27 దేశాలున్న ఈయూ కూటమి.. అమెరికా కార్లు, వ్యవసాయ ఉత్పత్తులను కొనడం లేదు. కానీ మేము (అమెరికా) మాత్రం వారి నుంచి అన్ని వస్తువులను దిగుమతి చేసుకుంటున్నాం. అమెరికా వాహన దిగుమతులపై ఈయూ 10 శాతం సుంకం విధిస్తోంది. ఈయూ ప్యాసింజర్ కార్ల దిగుమతులపై అమెరికా విధిస్తున్న సుంకానికంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువ’’ అని ట్రంప్ తీవ్రంగా ప్రతిఘటించారు. అమెరికాను ఇరుకులో పెట్టేందుకే ఈయూ ఏర్పాటు చేయబడిందని కూడా ఆయన విమర్శించారు. ఈ పని మాత్రం ఈయూ చాలా బాగా చేస్తోందని ఎద్దేవా చేశారు.

మేమూ విధిస్తాం సుంకాలు.. ఈయూ గట్టి సమాధానం
ట్రంప్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా.. యూరోపియన్ కమిషన్ కార్యనిర్వాహక విభాగం దీటుగా స్పందించింది. ‘‘మాది ప్రపంచంలోనే అతిపెద్ద స్వేచ్ఛా వాణిజ్య మార్కెట్. అమెరికాకు ఈయూ ఒక వరం. చట్టబద్ధమైన, నిష్పాక్షికమైన మా విధానాలను ఎదుర్కొనేందుకు సుంకాలను ఉపయోగిస్తే, స్వేచ్ఛాయుత మరియు నిష్పాక్షిక వాణిజ్యానికి అడ్డంకులు కలిగిస్తే, ఈయూ గట్టిగా ప్రతిస్పందిస్తుంది’’ అని యూరోపియన్ పార్లమెంట్ రాబర్టా మెట్సోలా స్పష్టం చేశారు. ఆమె అమెరికాలోని వాషింగ్టన్ నగరంలో జాన్ హాప్ కిన్స్ యూనివర్సిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఈ మాటలన్నారు.


ఈయూ కూటమిలో సభ్య దేశమైన స్పెయిన్.. ప్రధాన మంత్రి పెడ్రో శాంచెజ్ మాత్రం ట్రంప్ నిర్ణయం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. “మా దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయాలని చూస్తే.. మేమూ గట్టిగా బదులిస్తాం. అమెరికా తీరు చాలా అన్యాయంగా ఉంది.” అని అయన అన్నారు.

Also Read:  మీ ఆదేశాలు చెల్లవు.. ట్రంప్ తలపై కోర్టు సుత్తి!

రష్యాతో ట్రంప్ స్నేహంతో.. ఈయూ కోపం
రెండు ప్రపంచ యుద్ధాలతో దెబ్బతిన్న ఐరోపా ఖండంలో ఘర్షణలకు తెరపడేందుకు 1993లో ఈయూ ఏర్పాటు చేయబడింది. అమెరికా కూడా దీన్ని ఒక చరిత్రాత్మక విజయంగానే చూసింది. ఐరోపా సమైక్యతను దశాబ్దాలుగా ప్రోత్సహించింది. కానీ ఇటీవలి కాలంలో రెండింటి మధ్య విభేదాలు పెరిగిపోతున్నాయి. ట్రంప్ రాకతో ఉక్రెయిన్‌కు మద్దతు విషయంలో అమెరికా ఉన్నట్టుండి యూరోపియన్ యూనియన్ టర్న్ తీసుకోవడంతో, కూటమి దేశాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఉక్రెయిన్ యుద్ధంపై ఐరాస తాజా తీర్మానం విషయంలో కూడా రష్యాకు అనుకూలంగా అమెరికా నిలవడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఈయూపై సుంకాల ప్రకటనను ఈ విభేదాలకు కొనసాగింపుగా చూస్తున్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఈయూ విదేశీ విధాన వ్యవహారాల సారథి కాజా కలాస్, ఆ దేశ విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో భేటీ కావాల్సి ఉండగా, సమయాభావం కారణంగా అది రద్దయింది.

ట్రంప్‌తో బ్రిటన ప్రధాన మంత్రి భేటీ
ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనేందుకు, సంబంధిత చర్చల్లో ఉక్రెయిన్‌ను మరియు ఐరోపా దేశాల నేతలను భాగస్వాములుగా చేయాలని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ కోరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో గురువారం ఆయన శ్వేతసౌధంలో భేటీ జరిగింది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో త్వరలో ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. ఉక్రెయిన్ ప్రతినిధులు లేకుండానే అమెరికా-రష్యా ప్రతినిధులు ఇటీవల చర్చించుకున్నప్పటి నుంచి ఇతర దేశాలు స్పందిస్తున్నాయి. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ ఇప్పటికే ట్రంప్‌ను కలిశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శుక్రవారం ట్రంప్‌తో భేటీ కానున్నారు. కీలకమైన ఖనిజాలపై ఈ సమావేశంలో ఒప్పందం కుదిరే అవకాశం ఉంది. అమెరికాకు వెళ్తున్నప్పుడు, ఐర్లాండ్‌లో ఆ దేశ ప్రధాని మిఖాయిల్ మార్టిన్‌తో జెలెన్‌స్కీ భేటీ అయ్యారు.

 

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×