Central Budget: ఆర్ధిక మంత్రి నిర్మలా సీతా రామన్ నిన్న ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో ఉద్యోగ వర్గానికి తీపి కబురు అందించింది. ఉద్యోగులకు సంబంధించిన ఆదాయ పన్ను నిబంధనలపై ఊరట కలిగించే అంశాలన కేంద్ర మంత్రి ప్రకటించారు. ఇన్‌కామ్ ట్యాక్స్ నిబంధనల్లో భారీ మార్పులే చోటుచేసుకున్నాయి.ప్రస్తుత సమాజంలో ఖర్చులు విపరీతంగా పెరుగుతుండడంతో సంపాదన రేటు పెరుగుతోంది. దీంతో కేంద్రం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ రేటు అంతకంతకూ పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ప్రత్యక్ష పన్నుల స్లాబులు, రేట్లు కూడా మారుతున్నాయి. అయితే కేంద్ర ఈసారి ఆశించినదాని కన్నా ఎక్కువ మార్పులు చేర్పులు చేసింది. ఆదాయపు వనరులు పెరిగినందున స్లాబుల వ్యాప్తి పెంచి.. పన్ను రేట్లను కూడా మార్చాలన్న ఉద్యోగుల డిమాండ్లకు కేంద్రం పట్టించుకుంది.
ప్రస్తుత పాత పన్ను ప్రకారం చూసుకుంటే.. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 పన్నులేని పరిమితి రూ.2.5లక్షల నుంచి 5లక్షల వరకు ఐదుశాతం.. రూ.10లక్షల వరకు 20 శాతం, రూ.10 లక్షల నుంచి 30 శాతం పన్ను వసూలు చేస్తున్నారు. ప్రస్తుత కొత్త పన్ను ప్రకారం చూసుకుంటే.. స్టాండర్డ్ డిటెక్షన్ రూ.75000 పన్ను రిబేట్‌తో కలిపి పన్నులేని పరిమితి ఏడు లక్షల వరకు, రూ.7లక్షల నుంచి రూ.10లక్షల వరకు పది శాతం, రూ.10లక్షల నుంచి రూ.12లక్షల వరకు పదిహేను శాతం, రూ.12లక్షల నుంచి రూ.15లక్షల వరకు 20 శాతం, 15లక్షలకు పైబడితే ఆదాయంపై 30 శాతం పన్ను వసూలు చేస్తారు. దీనిలో ఎలాంటి సేవింగ్స, ఇతర తగ్గింపులు ఉండవు.
మారిన స్లాబుల ప్రకారం చూసుకుంటే.. ఇప్పటి వరకు అమలులో ఉన్న కొత్త పన్ను విధానంలో రూ.7.75లక్షల వరకు పన్ను పూర్తిస్థాయిలో మినహాయింపు ఉండేది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మారిన స్లాబుల ప్రకారం.. రూ.0-4లక్షల వరకు జీరో శాతం ట్యాక్స్, రూ.4 నుంచి రూ.8 లక్షల వరకు 5శాతం, రూ.8 నుంచి రూ.12లక్షల వరకు 10 శాతం, రూ.12-16లక్షల వరకు 15 శాతం రూ.16లక్షల నుంచి రూ.20 లక్షల వరకు 20 శాతం, రూ.20 లక్షల నుంచి రూ.24లక్షల వరకు 25 శాతం, రూ.24 లక్షలకు పైబడితే 30 శాతం ట్యాక్స్ విధిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం రూ.12లక్షల ట్యాక్స్ రిబేట్ ప్రకటించింది. అంటే స్టాండర్డ్ డిడక్షన్ రూ.75వేలతో కలిపి రూ.12 లక్షల 75 వేల ఆదాయం ఉన్నవారికి ఎలాంటి ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఒక శుభవార్తగా చెప్పవచ్చు. గత 25 ఏళ్లుగా మారని ఆదాయపు పన్ను నిబంధనలను ఈ సారి మార్చింది. దీంతో కొత్త పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉంచనుంది.
Also Read: Project Manager Jobs: NHAIలో ప్రాజెక్ట్ మేనేజర్ ఉద్యోగాలు.. ఏడాదికి రూ.17,00,000 జీతం..
మారిన ట్యాక్స్ నిబంధనలు మొత్తం ఆదాయంపై లెక్కించనున్నారు. దీని వల్ల పొదుపుల పట్ల నిరాధారణ పెరిగే అవకాశం ఉంది. సొంత ఇల్లు కట్టుకోవడానికి ప్రోత్సహించే రుణాల పట్ల నిరాసక్తి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పట్లో సీపీఎస్ రద్దయ్యే అవకాశం లేనందున ఆ స్కీంకు చెల్లించే మొత్తాలకు ట్యాక్స్ మినహాయింపు ఉండదు. కావున కేంద్రం మరోసారి ఆలోచించి సేవింగ్‌కు సీపీఎస్ మొత్తాలకు ఇంటికి సంబంధించిన వడ్డీ, అసలు పన్ను నుంచి మినహాయింపు ఇస్తే మరింతగా ట్యాక్స్ చెల్లింపుదారుల శాతం పెరుగుతోంది.