BigTV English

Trump Warning Iran: నన్ను చంపాలనుకుంటే సర్వనాశనం అయిపోతారు.. ఇరాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్

Trump Warning Iran: నన్ను చంపాలనుకుంటే సర్వనాశనం అయిపోతారు.. ఇరాన్‌ను టార్గెట్ చేసిన ట్రంప్

Trump Warning Iran| అణ్వాయుధాలను అభివృద్ధి చేయడానికి ఇరాన్ ప్రయత్నిస్తోందన్న వార్తల నేపథ్యంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై గరిష్ఠ ఒత్తిడి తెచ్చే విధానాన్ని తిరిగి అమలు చేయాలని ఆయన బుధవారం ప్రకటించారు. ఈ విషయంలో ప్రతిపాదనపై ఆయన సంతకం కూడా చేశారు. అదే సమయంలో, ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో కూడా ఆయన హెచ్చరించారు.


గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాన్‌పై ట్రంప్ గరిష్ఠ ఆంక్షలు విధించారు. ఇప్పుడు రెండోసారి అధ్యక్షుడు అయ్యాక, ఇరాన్ మళ్లీ అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తోందని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూతో భేటీకి ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తన తొలి పదవీకాలంలో ఇరాన్‌పై అమెరికా అమలు చేసిన కఠిన విధానాన్ని తిరిగి అమలు చేయాలని ప్రతిపాదించిన అధ్యక్ష మెమోరాండమ్‌పై ఆయన సంతకం చేశారు.

ఇరాన్‌పై కఠిన చర్యలు
ఇరాన్ చమురు ఎగుమతులను పూర్తిగా నిషేధించాలని ట్రంప్ ప్రతిపాదించారు. ‘‘ఇరాన్ (Iran) అణ్వాయుధ తయారీ ప్రయత్నాలను అడ్డుకోవడమే మా లక్ష్యం. ఇరాన్‌తో డీల్‌కు నేను సానుకూలంగానే ఉన్నా, కానీ న్యూక్లియర్ ఒప్పందానికి మాత్రం కాదు. ఆ దేశ నాయకుడితో చర్చలు జరపడానికి సుముఖంగా ఉన్నాను. అయితే అణ్వాయుధాలను అభివృద్ధి చేయడంలో టెహ్రాన్ చాలా దగ్గరగా ఉంది. దాన్ని అడ్డుకోవాలి. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు ఉండకూడదు అని అన్ని దేశాలు కోరుకుంటున్నాయి. అందుకే ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించాలని అందరూ కోరుకుంటున్నారు. కానీ నాకు అలా చేయడం ఇష్టం లేదు. అయితే అణ్వాయుధాల విషయంలో నేను సంతకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్ విషయంలో ఇది మరింత కఠినంగా ఉండబోతోంది’’ అని ట్రంప్ తెలిపారు.


ఇరాన్ చమురు ఎగుమతుల (Iran Oil Exports) పై కఠిన ఆంక్షలు అమలు చేయడంలో గత బైడెన్ సర్కారు విఫలమైందని ట్రంప్ విమర్శించారు. బైడెన్ చర్యల వల్ల.. ఇరాన్ చమురు విక్రయించి ఆ సొమ్ముతో అణ్వాయుధ తయారీ (Nuclear Weapons)కి నిధులు సమకూర్చుకునేలా అనుమతులు లభించాయని ఆయన మండిపడ్డారు. అయితే, ట్రంప్ ప్రతిపాదించిన మెమోలో ఇరాన్‌పై ఎలాంటి ఆంక్షలు ఉండబోతున్నాయన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.

Also Read: అమెరికా చైనా మధ్య సీరియస్ ట్రేడ్‌ వార్‌.. ఇండియాకు జాక్‌పాట్!

గతంలో ఇరాన్‌తో ఘర్షణ
ట్రంప్ గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడు.. ఇరాన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని నిఘా వ్యవస్థలు హెచ్చరిస్తున్నాయి. 2020లో, ట్రంప్ ఆదేశాల మేరకు అమెరికా దళాలు ఇరాన్ మేజర్ జనరల్ ఖాసీం సులేమానీని హతమార్చాయి. ఈ ఘటనకు ప్రతీకారంగా, ఇరాన్ ట్రంప్‌పై దాడులు చేయడానికి కుట్రలు పన్నుతోందని ఇటీవలి కథనాలు వచ్చాయి. గత ఏడాది నవంబర్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌పై జరిగిన హత్యాయత్నం వెనక ఇరాన్ పాత్ర ఉందని అమెరికా న్యాయవిభాగం అనుమానాలు వ్యక్తం చేసింది. అయితే, ఇరాన్ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
ఈ క్రమంలో ఇరాన్ తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తే, ఆ దేశం పూర్తిగా నాశనమవుతుందని ట్రంప్ హెచ్చరించారు. ‘‘నన్ను చంపాలని ప్రయత్నిస్తే, మీ నాశనాన్ని మీరు కోరుకున్నట్లే! నన్ను హత్య చేస్తే, ఇరాన్‌ను సమూలంగా నాశనం చేయాలని నా సలహాదారులకు ఆదేశాలు ఇచ్చాను’’ అని ఆయన తెలిపారు.

ఇరాన్ కరెన్సీ పతనం
ట్రంప్ చర్యల వల్ల, ఇరాన్ కరెన్సీ చరిత్రలో అత్యల్ప స్థాయికి పతనమైంది. ఒక అమెరికన్ డాలరుకు 8,50,000 రియాల్స్‌కు పతనమైంది. అణ్వాయుధ తయారీకి సిద్ధమవుతున్న ఇరాన్‌కు ట్రంప్ గరిష్ఠ ఒత్తిడి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×