BigTV English

Fiber Cable’s Damage : సముద్రాల్లోని ఫైబర్ కేబుళ్లు ధ్వంసం.. నాటో దేశాలకు ఇక చుక్కలే.. ఇవి లేకపోతే ఏమవుతుందంటే..

Fiber Cable’s Damage : సముద్రాల్లోని ఫైబర్ కేబుళ్లు ధ్వంసం.. నాటో దేశాలకు ఇక చుక్కలే.. ఇవి లేకపోతే ఏమవుతుందంటే..

Fiber Cable’s Damage : ఉక్రెయిన్ – రష్యా యుద్ధంలో తీవ్రత పెరుగుతున్న కొద్దీ.. అంతర్జాతీయంగా అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రష్యాకు వ్యతిరేకంగా.. ఉక్రెయిన్ కు మద్ధతిస్తున్న నాటో, పాశ్చాత దేశాలు.. రష్యా పైకి యుద్ధానికి కాలుదువ్వుతున్నాయి. ఈ క్రమంలోనే ఆయా దేశాల ఇంటర్నెట్ వ్యవస్థల్ని దెబ్బతీసే కుట్రలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సంప్రదాయ యుద్ధంతో పాటుగా ఇలాంటి పరోక్ష కుట్రలతో ఆయా దేశాల్ని ఇబ్బందుల పాల్జేసేందుకు కమ్యూనిస్ట్ దేశాలు ప్రయత్నిస్తున్నట్లు తీవ్ర సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.


ఇటీవల బాల్టిక్ సముద్ర జలాల్లోని అంతర్జాతీయ ఇంటర్నెట్ కేబుళ్లు అయిన ఫైబర్ ఆప్టిక్ కేబుళ్లను ఎవరో ఉద్దేశ్యపూర్వకంగా కత్తిరించడం లేదా దెబ్బతీశారు. దాంతో.. ఆయా దేశాలకు ఇంటర్నెట్ అందకుండా చేయడంతో పాటు, వారిని మిగతా ప్రపంచానికి దూరంగా ఉంచాలనే ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆయా దేశాలు.. రష్యాకు సిద్ధాంత మిత్రుడైన చైనా పైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

జర్మన్ – ఫిన్ ల్యాండ్, స్వీడన్ – లిథువేనియా దేశాల మధ్య బాల్టిక్ సముద్రంలోని అంతర్జాతీయ సముద్ర జలాల్లో ఫైబర్ ఆప్టికల్ కేబుళ్లు ఉన్నాయి. వీటి ద్వారాలో.. ఈ దేశాల్లోని ఇంటర్నెట్ సేవలు అందుతుంటాయి. అయితే.. ఇటీవల కాలంలో ఈ రెండు మార్గాల్లోని కేబుళ్లను రెండు చోట్ల ధ్వంసం చేసినట్లు అధికారులు గుర్తించారు. దాంతో.. మిగతా కేబుళ్ల రక్షణకు చర్యలు చేపట్టిన ఆయా ప్రభుత్వాలు.. మిగతా కేబుళ్లను పరిశీలిస్తున్నాయి.


ప్రస్తుతం ఆ ప్రాంతంలోని యుద్ధ పరిస్థితులే కేబుళ్ల ధ్వంసానికి కారణమని జర్మన్, స్వీడన్ అధికారులు భావిస్తున్నారు. ఉక్రెయిన రక్షణ మంత్రితో సమావేశం అనంతరం మాట్లాడిన జర్మన్ రక్షణ మంత్రి ట్రోయెల్స్ లండ్ పౌల్సెన్.. కావాలనే ఈ కుట్రలకు పాల్పడ్డారని అనుమానిస్తున్నట్లు వెల్లడించారు.

వీరి అనుమానాలకు తగ్గట్టే.. కేబుళ్లు ధ్వంసమైన రెండు రోజుల తర్వాత ఆయా ప్రాంతాల్లో చైనా నౌక సంచరించినట్లు గుర్తించామని డానిష్ మిలటరీ అధికారులు వెల్లడించారు. చైనాకు చెందిన యీ పెంగ్ – 3 నౌకను ప్రస్తుతం డెన్మార్క్, స్వీడన్ మధ్య కట్టెగాట్ జలసంధిలో నిలిపి ఉంచినట్లు మెరైన్‌ట్రాఫిక్ నౌక ట్రాకింగ్ డేటా పరిశీలిస్తే వెల్లడైంది. ప్రస్తుతం ఆ నౌక.. డానిష్ నేవీ పెట్రోలింగ్ షిప్ నకు సమీపంలో లంగరు వేసినిలిపారని డానిష్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. ఈ నౌక కార్యకలాపాలపై నిఘా వేసి ఉంచామని తెలిపారు. డేటా సర్వీసులను అందించే ఫిన్నిష్ కు చెందిన ‘సినియా’.. తెగిపోయిన కేబుళ్లు ఫిన్నిష్ రాజధాని, జర్నన్ నుంచి 1,200 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు తెలిపింది.

ఫిన్లాండ్ – జర్మన్ మధ్య కేబుళ్ల ధ్వంసం ఘటన తర్వాత సరిగా అలానే.. లిథువేనియా – స్వీడన్ మధ్య కమ్యూనికేషన్ కేబుళ్లు సైతం దెబ్బతిన్నట్లు గుర్తించారు. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ సంస్థ టెలియా లిథువేనియా వెల్లడించింది. ఇవి.. జర్మనీ – ఫిన్లాండ్ నుంచి కేవలం 95-105 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం అనుమానాలకు తావిస్తోంది. దీంతో.. ఫిన్లాండ్, జర్మనీ విదేశాంగ శాఖలు ఈ విషయంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ప్రకటనలు విడుదల చేశాయి. వీటితో పాటే లిథువేనియా – స్వీడిష్ ద్వీపం గాట్‌లాండ్ మధ్య ఉన్న 218 కిలోమీటర్ల ఇంటర్నెట్ లింక్ కూడా దెబ్బతిన్నట్లు స్వీడిష్ టెలికమ్యూనికేషన్స్ కంపెనీ తెలిపింది.

ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమతో పాటు ఇలాంటి హైబ్రిడ్ యుద్ధ విధానాలు సైతం యూరోపియన్ యూనియన్ దేశాలకు ప్రమాదకరంగా మారిందని ఉమ్మడి ప్రకటనలో ప్రకటించాయి. బాల్టిక్ సముద్రంలో నీటి అడుగున మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించడంలో ఇది మొదటి సంఘటన కాదు.

2022లో, బాల్టిక్ సముద్రంలోని నార్డ్ స్ట్రీమ్ గ్యాస్ పైప్‌లైన్‌లు పేలాయి. శీతాకాలంలో గట్టకట్టించే చలి నుంచి రక్షణ కోసం రష్యా నుంచి ఐరోపా దేశాలకు గ్యాస్ సరఫరా అవుతుంటుంది. ఈ వ్యవస్థపై దాడితో.. అప్పట్లో ఆయా దేశాల్లో తీవ్ర ఉద్రిక్తలు ఏర్పడ్డాయి. ఈ విషయంపై అనేక కుట్ర సిద్ధాంతాలు వెలుగులోకి వచ్చాయి. కొందరు.. యూఎస్ ఈ పని చేసినట్లు అనుమానించగా, మరికొందరు ఉక్రెయిన్, రష్యా దేశాలే ఈ పని చేసినట్లు తెలిపారు. ఆ ఘటన తర్వాతి.. ఇప్పుడు మరోమారు బాల్టిక్ సముద్రంలో ఫైబర్ ఆప్టికల్ కేబుళ్ల విధ్వంసం చర్చల్లో నిలుస్తోంది.

Also Read : ట్రంప్ విజయంతో భారీగా పెరిగిన ఎలన్ మస్క్ ఆస్తులు.. ఎన్నికల తరువాత ఏకంగా 70 బిలియన్ డాలర్ల వృద్ధి

ప్రస్తుత డిజిటల్ యుగంలో క్షణకాలం పాటు ఇంటర్నెట్ నిలిచిపోయినా.. చాలా వ్యవస్థలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతర్జాతీయంగా మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. అంతే కాదు.. వేల కోట్ల నష్టాలొస్తాయి. పైగా.. యుద్ధాలు, విమానాలు, నౌకలు సహా.. ఆయా దేశాల్లోని ఎలక్ట్రికల్ పరికరాలు అన్నింటినీ ఇంటర్నెట్ అవసరం అవుతుంది. ఈ కారణంగానే.. ఆయా దేశాలను నష్టపరచాలని చైనా ఈ కుట్ర చేసిందని అనుమానిస్తున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×