Harris leads Trump: అమెరికా అధ్యక్ష ఎన్నికలను ప్రపంచ దేశాలు ఎంతో ఆసక్తిగా పరిశీలిస్తున్నాయి. ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో అంటూ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న పోల్ సర్వేల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ ఆధిక్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా న్యూయార్క్ టైమ్స్, సియానా కాలేజ్ సంయుక్తంగా స్వింగ్ స్టేట్స్ లో పోల్ సర్వేని నిర్వహించాయి. ఆ సర్వేలో కమలా హారిస్ దూకుడుగా ఉంది. నాలుగు పాయింట్ల ఆధిక్యంతో మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై ముందంజలో ఉన్నట్లుగా సర్వే పేర్కొన్నది. ఆగస్టు 5 నుంచి 9 మధ్య మూడు రాష్ట్రాలు.. విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిచిగాన్ లో పోల్ నిర్వహించగా, ట్రంప్ నకు 46 శాతం లభించింది. కమలా హారిస్ కు 50 శాతం మద్దతు ఉన్నట్లు తేలింది. అయితే, డెమోక్రటిక్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా మిన్నెసొటా గవర్నర్ టిమ్ వాల్జ్స్ ఎంపిక తరువాత ఈ సర్వేను నిర్వహించారు.
Also Read: బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా.. ఎందుకంటే ?
అంతేకాదు.. ఇటీవల ప్రముఖ వార్తా సంస్థ కూడా పోల్ సర్వే నిర్వహించింది. అందులోనూ ట్రంప్ కంటే కమలా హారిస్ ఆధిక్యంలో కొనసాగినట్లు ఆ సంస్థ పేర్కొన్నది. ఈ క్రమంలో ఆమెకు భారీగా విరాళాలు వచ్చాయి. నవంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ప్రచారాలు ఊపందుకున్నాయి. ఇటీవలే కమలాతో డిబేట్ కు సిద్ధమేనంటూ ట్రంప్ ప్రకటించగా, ఈ డిబేట్ వచ్చే నెల 10న జరగనున్నదంటూ ఓ వార్తా సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.