E-Paper
Advertisement

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు అదిరిపోయే లుక్!

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు  అదిరిపోయే లుక్!
Advertisement

Toyota Glanza, Innova Hycross Facelifts: భారత కార్ల మార్కెట్లో టయోటా తన మోడళ్లు మరింత ఆకట్టుకునేలా అప్ డేట్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రెండు కార్లకు త్వరలో ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లను తీసుకురావాలని భావిస్తోంది. ఇందులో టయోటా గ్లాంజా ఈ ఏడాదే అప్‌ డేట్ కానుండగా.. ఇన్నోవా హైక్రాస్ వచ్చే ఏడాది కొత్త లుక్ లో అలరించేందుకు రెడీ అవుతోంది. ఇవి పూర్తిగా కొత్త కార్లు కాకపోయినా, డిజైన్‌, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తోంది.

అక్టోబర్‌లో కొత్త గ్లాంజా విడుదల

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్‌ను అక్టోబర్ 14, 2026న ఆవిష్కరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మారుతి సుజుకి బాలెనోతో ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే ఈ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లో తాజా మార్పులు కనిపించనున్నాయి. ముఖ్యంగా పవర్‌ట్రెయిన్‌లో మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న నాలుగు సిలిండర్ల ఇంజిన్‌కు బదులుగా కొత్త 1.2 లీటర్, మూడు సిలిండర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా, కారు ముందు భాగంలోనూ మార్పులు ఉండనున్నాయి. కొత్త గ్రిల్‌, అప్ డేటెడ్ బంపర్‌ తో గ్లాంజా మరింత స్టైలిష్ లుక్ లో కనిపించే అవకాశం ఉంది.

ఫీచర్లలోనూ అప్‌గ్రేడ్!

Advertisement

కొత్త గ్లాంజాలో కేవలం డిజైన్‌, ఇంజిన్ మార్పులే కాకుండా అదనపు ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ADAS, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌ లెస్ ఫోన్ ఛార్జర్ లాంటి సదుపాయాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అప్‌ డేట్‌ ల కారణంగా గ్లాంజా ధరలో కూడా మార్పు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మోడల్ మారుతి బాలెనో, హ్యుందాయ్ ఐ20, టాటా ఆల్ట్రోజ్ లాంటి కార్లతో పోటీపడుతోంది. కొత్త ఫీచర్లు, ఇంజిన్‌తో ఈ పోటీ మరింత పెరగనుంది.

2027లో ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌లిఫ్ట్

గ్లాంజా తర్వాత టయోటా ఇన్నోవా హైక్రాస్‌పై దృష్టి పెట్టనుంది. ఈ MPV ఫేస్‌లిఫ్ట్ 2027 ప్రారంభంలో మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌ లో టెస్ట్ మ్యూల్స్ కనిపించడంతో ఈ అప్‌డేట్‌పై ఆసక్తి పెరిగింది. పేటెంట్ ఫైలింగ్‌ లో కనిపించిన వివరాల ప్రకారం.. హైక్రాస్ ముందు భాగంలో గణనీయమైన మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. పెద్ద గ్రిల్‌, సన్నని హెడ్‌ ల్యాంప్స్‌, కొత్త లైటింగ్ ఎలిమెంట్స్‌ తో లుక్ మారే  అవకాశం ఉంది.

క్యాబిన్‌ లోనూ కొత్త మార్పులు

Advertisement

ఇన్నోవా హైక్రాస్‌లో బయటి లుక్ తో పాటు లోపలి భాగంలోనూ అప్‌డేట్‌లు రావచ్చని సమాచారం. డ్యాష్‌ బోర్డ్‌, అప్‌హోల్స్టరీ, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, కారు ప్రస్తుత మూడు వరుసల లేఅవుట్‌, విశాలమైన క్యాబిన్‌ కొనసాగుతాయని భావిస్తున్నారు. అంటే, కుటుంబ అవసరాలకు ఉపయోగపడేలా కొనసాగనుంది.

ఇంజిన్‌లో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు!

ఇన్నోవా హైక్రాస్ ఫేస్‌ లిఫ్ట్‌ లో ప్రస్తుతం ఉన్న పెట్రోల్‌, స్ట్రాంగ్ హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లు కొనసాగే అవకాశం ఉంది. ఈసారి ప్రధానంగా డిజైన్‌, ఫీచర్లు, క్యాబిన్‌ ఎక్స్ పీరియెన్స్ అప్ డట్ మీదే టయోటా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

Read Also: చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!

Tags

Related News

చిన్న కార్లు.. పెద్ద రేంజ్.. ఇండియన్ మార్కెట్ లోకి 5 చౌకైన ఈవీలు!

టాటా ఏరిస్ లాంచ్ డేట్ ఫిక్స్.. కొత్త సెడాన్ మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

టాటా సియెర్రా డార్క్ ఎడిషన్ వచ్చేసింది.. లుక్ అదిరింది భయ్యా!

రోనిన్ vs హంటర్ 350.. ధర, పవర్, ఫీచర్లలో ఏ బైక్ ఎలా ఉందంటే?

విన్‌ఫాస్ట్ To హోండా.. ఇండియన్ మార్కెట్ లోకి 3 కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ఎంట్రీ!

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 3 బిగ్ బైక్స్.. 750 సీసీ పవర్‌తో రచ్చ రచ్చే!

రూ.10 లక్షలు తగ్గిన MG సైబర్‌స్టర్.. ఇప్పుడు ఈ స్పోర్ట్స్ కారు ధర ఎంతంటే?

Big Stories

Advertisement
×