BigTV English

World Population : న్యూ ఇయర్ రికార్డ్.. 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా..!

World Population : న్యూ ఇయర్ రికార్డ్.. 800 కోట్లకు చేరనున్న ప్రపంచ జనాభా..!

World Population : నూతన సంవత్సరంలో అడుగుపెట్టే సమయానికి మన ప్రపంచ జనాభా మరో మైలురాయిని దాటనుంది. కొత్త ఏడాది నాటికి ఇది 800 కోట్లను దాటనుందని అమెరికా జనాభా లెక్కల సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ వెల్లడించిన లెక్కల ప్రకారం.. 2023లో ప్రపంచ జనాభా 7.5 కోట్ల మేర పెరిగింది. ఈ సంఖ్య.. 2024 జనవరి 1 నాటికి 800 కోట్ల మార్కుని అధిగమిస్తుందని సంస్థ తెలిపింది.


2023లో ప్రపంచవ్యాప్తంగా జనాభా వృద్ధిరేటు 1 శాతంలోపే ఉందని తెలిపింది. 2024 ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతి సెకనుకు సగటున 4.3 జననాలు, రెండు మరణాలు సంభవిస్తాయని అమెరికా సెన్సస్‌ బ్యూరో అంచనా వేసింది. 2023లో అమెరికా జనాభా వృద్ధిరేటు 0.53 శాతంగా ఉందని, ప్రపంచ వృద్ధిరేటుతో పోలిస్తే ఇది సగమేనని పేర్కొంది.

ఈ ఏడాది అమెరికాలో 17.5 లక్షల జననాలు నమోదయ్యాయని తెలిపింది. 2024 జనవరి 1 నాటికి ఈ దేశ జనాభా 33.58 కోట్లకు చేరుకుంటుందని సెన్సస్‌ బ్యూరో అంచనా వేసింది. ప్రస్తుత వేగమే ఈ దశాబ్దం చివరి వరకూ కొనసాగితే.. అమెరికా చరిత్రలో అత్యంత నెమ్మదిగా పెరిగిన జనాభా దశాబ్దంగా నిలవనుందని పేర్కొంది.


2024 ప్రారంభంలో అమెరికాలో ప్రతి 9 సెకన్లకు ఒక జననం, ప్రతి 9.5 సెకన్లకు ఒక మరణం సంభవించే అవకాశం ఉందని, వలసల కారణంగానే అమెరికా జనాభా తగ్గకుండా, నిలకడగా ఉంటోందని తెలిపింది. వలసల వల్ల ప్రతి 28.3 సెకన్లకు ఒక వ్యక్తి జనాభాకు జత కలుస్తున్నారని ఈ సంస్థ గణాంకాలు చెబుతున్నాయి.

Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×