BigTV English

World Wide Elections List : 2024.. ఎన్నికల నామ సంవత్సరం..!

World Wide Elections List :  2024.. ఎన్నికల నామ సంవత్సరం..!

World Wide Elections List : మరి కాసేపట్లో మనం 2024లోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రతి ఏడాదికీ ఏదో ఒక ప్రత్యేకత ఉన్నట్లే.. 2024కీ ఓ ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరంలో ప్రపంచ వ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రపంచ జనాభాలో ఏకంగా 40 శాతం మంది ఈ ఎన్నికల ప్రక్రియల్లో పాల్గొనబోతున్నారు.


అగ్ర రాజ్యంగా పేరున్న అమెరికా, చరిత్ర పరంగా మరో అగ్రరాజ్యమైన రష్యా, ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన భారత్‌తో బాటు బ్రిటన్‌, మెక్సికో, దక్షిణాఫ్రికా, ఇరాన్‌, దక్షిణ సూడాన్‌, తైవాన్‌, భూటాన్‌తో పాటు పలు యూరోపియన్‌ యూనియన్‌ దేశాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 2024లో ఆయా దేశాల్లో ఎన్నికయ్యే నూతన నాయకత్వం మూలంగా వచ్చే దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిణామాల్లో ఊహించని మార్పులు రావచ్చని, అవి ఎటైనా దారి తీసే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అత్యధిక జీడీపీ ఉన్న దేశాల్లో ఈసారి ఎన్నికలు జరగటం విశేషం.

మొత్తంగా 15 ఆఫ్రికన్ దేశాలు, 9 అమెరికన్ దేశాలు, 11 ఆసియా దేశాలు, 22 యూరోపియన్ దేశాలు ఎన్నికలకు వెళ్లనుండగా, అక్కడ ఏర్పడే ప్రభుత్వాలు 2028 -2030ల మధ్య వరకు కొనసాగుతాయి. అమెరికాలో 2028 వరకు, రష్యాలో 2030 వరకు, మనదేశంలో 2029 వరకు కొత్త ప్రభుత్వాలు కొనసాగనుండగా, మిగిలిన దేశాల్లోనూ కాస్త అటు ఇటుగా ఇదే పరిస్థితి ఉంది.


2024 నవంబరులో అమెరికాలో జరగనున్న ఎన్నికల్లో నెగ్గే పార్టీని బట్టి భారతీయులకు గ్రీన్ కార్డుల మంజూరు, వీసాల పెంపు తదితర అంశాలపై నిర్ణయాలుంటాయని, ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రతికూల నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం అక్కడ వస్తే.. భారతీయ నిపుణులకు గడ్డుకాలమేనని నిపుణులు చెబుతున్నారు. ఈసారి డెమొక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మరోసారి బరిలో నిలుస్తారని చెబుతున్నా.. ఆయన వయసు రీత్యా అవకాశం దక్కకపోవచ్చనే మాటా వినిపిస్తోంది. ఇక.. రిపబ్లికన్ల తరపున బరిలో నిలిచేందుకు 77 ఏళ్ల ట్రంప్, వివేక్ రామస్వామి రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్‌కు మితిమీరి సైనిక సాయం చేయటం ఎందుకని ఇప్పటికే మండిపడుతున్న ట్రంప్ మళ్లీ గెలిస్తే రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంతో బాటు ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం కొత్త మలుపు తిరగొచ్చని నిపుణుల అంచనా.

మరోవైపు ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యాలోనూ కొత్త ఏడాది మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. మరోమారు తాను బరిలో నిలుస్తానని వ్లాదిమిర్‌ పుతిన్‌ ఇప్పటికే ప్రకటించారు. ఉక్రెయిన్‌ యుద్ధం పేరుతో రాజకీయ ప్రత్యర్థులపై ఉక్కుపాదం మోపిన 71 ఏళ్ల పుతిన్.. 2036 వరకు అధికారంలో ఉండేందుకు వీలుగా గతంలోనే రాజ్యాంగ సవరణ చేశారు. పుతిన్ చిరకాల ప్రత్యర్థి నావెల్నీ ప్రస్తుతం జైలులో ఉండటంతో పుతిన్‌ను ఢీకొట్టే సరైన నాయకుడు లేడనే చెప్పాలి.

మనదేశంలోనూ వచ్చే వేసవిలో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. 80 కోట్లకు పైగా ఓటర్లున్న ప్రపంచపు అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్డీయే- ఇండియా కూటముల మధ్య రసవత్తరమైన ఎన్నికల పోరు జరగనుంది. దక్షిణాదిన ఏ ప్రాభవమూ లేని బీజేపీ, తగిన మిత్రులనూ కూడగట్టకోలేవటం, ఉత్తరాదిన మిత్రులతో కలిసి పోటీకి కాంగ్రెస్ వ్యూహాలు రచించటంతో ఈసారి ఎన్నికల పోరు గట్టిగానే జరిగేలా కనిపిస్తోంది. ఇక.. 2024 వేసవిలోనే ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిసా, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, 2024 అక్టోబరులో మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కుదిరితే.. ఈ ఏడాది సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌లోనూ ఎన్నికలు జరిపించాలని కేంద్రం ప్రయత్నిస్తోంది.

మెక్సికోలో జూన్‌లో జరగనున్న ఎన్నికల్లో ఆ దేశానికి మొదటి మహిళా అధ్యక్షురాలి ఎంపిక జరిగే అవకాశం ఉంది.ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ మోరెనా పదవీ కాలం ముగియడంతో మెక్సికో సిటీ మాజీ మేయర్‌ క్లౌడియా షెన్‌బౌమ్‌, గాల్వేజ్‌లలో ఒకరు తొలి అధ్యక్షురాలు కావచ్చనేది అంచనా.

వచ్చే ఏడాది జూన్‌లో యూరోపియన్‌ యూనియన్‌ ఎన్నికలకు తెరలేవనున్నది. 20కి పైగా దేశాలకు ఈయూ ప్రాతినిధ్యం వహిస్తుండటం గమనించదగ్గ విషయం. చైనాను లెక్కచేయకుండా, స్వతంత్ర తైవాన్ వాదన వినిపిస్తున్న డీపీపీ అభ్యర్థి లి చింగ్‌ తే.. తైవాన్‌ ఎన్నికల్లో గెలిచే సూచనలు కనిపిస్తుండటం చైనాకు మింగుడు పడని అంశం.

హిమాలయ దేశం భూటాన్‌లో ఇప్పటికే మొదటి విడత ఎన్నికలు ముగిశాయి. వచ్చే జనవరి 9న రెండో విడత జరుగనున్నది. వ్యూహాత్మకంగా, రక్షణ పరంగా మనకు మిత్రదేశమైన భూటాన్ తొలి దశ ఎన్నికల్లో భారత అనుకూల పీడీపీ ముందంజలో ఉండగా, రెండో దశ ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

Tags

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×