BigTV English

Russia Ukrain War : ఉత్తర కొరియా సైనికుల ముఖాలు కాల్చేస్తున్నారు.. కారణం ఏంటో తెలుసా..

Russia Ukrain War : ఉత్తర కొరియా సైనికుల ముఖాలు కాల్చేస్తున్నారు.. కారణం ఏంటో తెలుసా..

Russia Ukrain War : తమతో యుద్ధ క్షేత్రంలో తలపడుతున్న రష్యా, ఉత్తర కొరియా సేనలకు భారీ ఎదురుదెబ్బ తగులుతోందని ఉక్రెయిన్  అధ్యక్షుడు జెలెన్ స్కీ అన్నారు. విదేశీ సైనికుల మరణాల్ని దాచిపెట్టేందుకు వారి గుర్తింపుల్ని మార్చేస్తోందంటూ ఆరోపించారు. తాము స్వాధీనం చేసుకున్న ఉత్తర కొరియ సైనికుల దగ్గర లభించిన పత్రాలే అందుకు సాక్ష్యమంటున్నారు. రష్యాకు మద్ధతుగా ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్.. 10 వేల మంది సైనికుల్ని యుద్ధంలోకి దింపారన్న విషయం తెలిసిందే. అయితే.. ఈ యుద్ధంలో సరైన అనుభవం, స్థానిక పరిస్థితులపై అవగాహన లేకపోవడంతో ఉత్తర కొరియా సైన్యం తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. ఈ విషయం ఇప్పటికే అనేక సార్లు నిరూపితం కాగా.. అనేక నిఘా సంస్థలు సైతం ఉత్తర కొరియా సైనికుల అవస్థల్ని వెల్లడించాయి.


తమ దేశాన్ని ఆక్రమించేందుకు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్న రష్యా, దానికి మద్ధతుగా నిలిచిన ఉత్తర కొరియా సైనికులు తమ సైన్యం చేతుల్లో ఓటమిని చవిచూస్తున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తెలిపారు. సరిహద్దుల్లోని అనేక ప్రాంతాల్లో తమ సైన్యం దైర్య సాహసాల ముందు వారు నిలువలేకపోతున్నారని వెల్లడించారు. ముఖ్యంగా రష్యాలోని దక్షిణ కుర్స్క్ ప్రాంతంలో గత రెండు రోజులుగా ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో.. రష్యా సైన్యానికి భారీ ప్రాణ నష్టం జరిగిందని, ఉక్రెయిన్ సైన్యం భారీగా విరుచుకుపడి.. ప్రత్యర్థుల్ని ఒడిస్తుందని జెలెన్ స్కీ వెల్లడించారు.

రష్యా సైన్యం యుద్ధంలో మరణిస్తున్న సైనికులు పేర్లు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని జెలెన్ స్కీ ఆరోపించారు. ముఖ్యంగా  విదేశీ సైనికుల గుర్తింపు తెలియకుండా అనేక కుట్రలు చేస్తోందంటూ వ్యాఖ్యానించారు. కుర్స్క్ ప్రాంతంలో ఉక్రెయిన్ బలగాల చేతిలో మరణించిన  ముగ్గురు ఉత్తర కొరియా సైనికులను ఉక్రెయిన్ బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. కాగా.. వారి గుర్తింపు పత్రాలను రష్యా మార్చేసినట్లు అధికారులు గుర్తించారు. సైనికుల పేర్లు, ఇతర వివరాల్ని మార్చేసి రష్యాకు చెందిన సైనికులుగా తప్పుడు పత్రాలు సృష్టించినట్లు కనుక్కున్నట్లు తెలిపారు.


రెండేళ్లుగా తీవ్రంగా సాగుతున్న యుద్ధంలో.. గత రెండు రోజుల నుంచి ఇరు దేశాల సైనికులు కుర్స్క్ ప్రాంతంలోని మఖ్నోవ్కా గ్రామ సమీపంలో తలపడుతున్నట్లు వెల్లడించారు. ఇక్కడ ఉక్రెయిన్ బలగాల దాడుల్ని ఎదుర్కోవడంలో రష్యా, ఉత్తర కొరియా సైనికులు చేతులెత్తేశారని తెలిపారు. ఇది యుద్ధంలో తమకు మరో ముఖ్యమైన ముందడుగు అంటూ జెలెన్ స్కీ ప్రకటించారు. కాగా.. మరోవైపు.. దీర్ఘ శ్రేణి క్షిపణులు, సూపర్ సోనిక్ మిస్సైళ్లతో దాడులు చేస్తున్న రష్యా.. స్వేసా పట్టణంలోని పలు నివాసాల్ని దెబ్బతీసిందని ఉక్రెయిన్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తమ పౌరుల్ని రక్షించుకునేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వెల్లడించింది.

Also Read : జార్జి సొరోస్‌కు అమెరికా అత్యున్నత పురస్కారం.. బైడెన్‌ పై మండిపడిన మస్క్

రష్యాతో ఉన్న మిత్రుత్వం కారణంగా ఉక్రెయిన్ తో యుద్ధానికి 10 వేల మంది సైనికుల్ని ఉత్తర కొరియా పంపించింది. కానీ.. వారు రష్యాకు చేరుకున్న తర్వాత ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో రావడం, స్వేచ్ఛగా బయటకు రావడంతో..  వారి మానసిక ప్రవర్తన వేరుగా ఉందని అంటున్నారు. అలాగే.. రష్యా అధికారులతో కమ్యూనికేషన్ సమస్య కారణంగా.. సరిగా యుద్ధరంగంలో ముందుకు కదలలేకపోతున్నారని అంటున్నారు. యుద్ధంలో పోరాడే నైపుణ్యాలు, శక్తి సామర్థ్యాలు లేకపోవడంతో ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నారని అమెరికా సైతం అభిప్రాయపడింది.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×