BigTV English

Indian Navy Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే గిట్ల రూ.1,10,000 జీతం

Indian Navy Jobs: గోల్డెన్ ఛాన్స్.. ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే గిట్ల రూ.1,10,000 జీతం

Indian Navy Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. భారతీయ నౌకాదళం షార్ట్ సర్వీస్ కమిషన్ విధానంలో పలు ఉద్యోగాల భర్తీ నోటిఫికేష్ రిలీజ్ చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అవివాహిత పురుషులు, మహిళలు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.


మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 270

వివిధ బ్రాంచ్ ల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, ఎడ్యుకేషన్ బ్రాంచ్, టెక్నికల్ బ్రాంచ్ ల్లో ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.


-ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ లో జనరల్ సర్వీస్ లో 60 వెకెన్సీలు ఉన్నాయి. ఏదైనా బ్రాంచీలో బీఈ, బీటెక్ లో 60 శాతం మార్కులతో పాసైన వారు దీనికి అర్హులు. ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌ 18, నావల్‌ ఎయిర్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ 22, పైలట్‌ 26 ఖాళీలకు బీఈ/బీటెక్‌లో 60, పది, ఇంటర్‌లోనూ 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. లాజిస్టిక్స్‌ 28 ఖాళీలకు ఎందులోనైనా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ లేదా ఎంబీఏ లేదా ఎమ్మెస్సీ(ఐటీ)/ఎంసీఏ లేదా బీఎస్సీ/బీకాంతోపాటు లాజిస్టిక్స్‌/సప్లై చెయిన్‌లో పీజీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు అవుతారు.

-ఎడ్యుకేషన్ బ్రాంచ్ కి సంబంధించి అన్ని విభాగాల్లోనూ కలిపి 15 ఖాళీలు ఉన్నాయి. వీటికి ఆ పోస్టుల ప్రకారం బీఈ/బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎమ్మెస్సీ చదివినవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

-టెక్నికల్ బ్రాంచ్ కి సంబంధించి ఇంజినీరింగ్‌ బ్రాంచ్‌ 38, ఎలక్ట్రికల్‌ బ్రాంచ్‌ 45, నేవల్‌ కన్‌స్ట్రక్టర్‌ 18 ఖాళీలు ఉన్నాయి. సంబంధిత విభాగాల్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇందులో లెవెల్-10 హోదా కలిగిన ఉద్యోగాలే ఉన్నాయి.

ఉద్యోగ ఎంపిక విధానం: ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు. అకాడమిక్ స్కోర్ తో షార్ట్ లిస్ట్ చేస్తారు. యూజీ/పీజీలో ఎక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తే అవకాశం ఉంటుంది. ఒక్కో ఉద్యోగానికి నిర్ణీత సంఖ్యలో ఇంటర్వ్యూకి పిలుస్తారు. సర్వీస్ సెలక్షన్ బోర్డు పరిధిలో ఇదంతా జరుగుతోంది.

షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం ఫైనల్ లిస్ట్ లో ఉన్న వారు ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

శిక్షణ: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నేవల్ అకాడమీ, ఎజిమాళలో 2026 జనవరి నుంచి 22 వారాల పాటు సంబంధిత విభాగంలో శిక్షణ ఇస్తారు. అనంతరం మరో 22 వారాలు సంబంధిత విభాగానికి చెందిన కేంద్రంలో మరొక శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత సబ్ లెఫ్టినెంట్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు.

జీతం: ప్రారంభ జీతం రూ.56,100 ఉంటుంది. కానీ డీఏ, హెచ్ఆర్ఏ, ఇతర ప్రోత్సాహాకాలు అన్ని కలుపుకొని మొదటి నెల నుంచే రూ.1,10,000 జీతం లభిస్తుంది. ప్రోబిషనరీ పీరియడ్ ఉద్యోగాన్ని బట్టి రెండు నుంచి మూడేళ్లు ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి

దరఖాస్తుకు చివరి తేది: 2025 ఫిబ్రవరి 25

ఈ ఉద్యోగాలు పరిమిత కాల ప్రాతిపదకనమాత్రమే ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు 12 ఏళ్ల పాలు డ్యూటీలో కొనసాగుతారు. అనంతరం మరో రెండేళ్లు సర్వీసు పొడగిస్తారు. దీంతో గరిష్టంగా 14 ఏళ్ల పాటు ఉద్యోగం చేయవచ్చు. అనంతరం విధుల నుంచి వైదొలుగుతారు. నేవీలో పని అనుభవంతో వీరు సులువుగానే సివిల్‌ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది.

వయోపరిమితి: ఉద్యోగాన్ని బట్టి వయస్సు ఉంటుంది. 2001/2002 జనవరి 2 నుంచి 2005/2006/2007 జనవరి 1 మధ్య జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ ఉద్యోగాలన్నింటికి ప్రస్తుతం చివరి ఏడాది కోర్సులు చదువుతున్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు. NCC-C సర్టిఫికెట్‌ ఉంటే అకడమిక్‌ మార్కుల్లో 5 శాతం సడలింపు వర్తిస్తుంది. అభ్యర్థులు దరఖాస్తులో పోస్టులవారీ ప్రాధాన్యం తెలపాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూ కేంద్రాలు: బెంగళూరు, కోల్ కత్తా, భోపాల్, వైజాగ్

Also Read: AIIMS Bibinagar: ఏయిమ్స్, బీబీనగర్‌లో సీనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు.. ఈ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు..

ముఖ్యమైనవి:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 270

దరఖాస్తుకు చివరి తేది: 2025  ఫిబ్రవరి 25

 

Related News

RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు

DDA Recruitment: ఇంటర్, డిగ్రీ అర్హతలతో 1732 ఉద్యోగాలు.. ఇలాంటి ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ బ్రదర్, రేపటి నుంచే దరఖాస్తు ప్రక్రియ

Scholarship Scheme: ఇంటర్ సర్టిఫికెట్ ఉందా..? ఛలో ఈజీగా రూ.20,000 పొందండి, ఇదిగో సింపుల్ ప్రాసెస్

BEL Notification: బెల్ నుంచి భారీ నోటిఫికేషన్.. జీతం అక్షరాల రూ.40వేలు, దరఖాస్తుకు 2 రోజులే గడువు

CDAC Recruitment: బీటెక్ అర్హతతో సీడ్యాక్‌లో భారీగా ఉద్యోగాలు.. నో అప్లికేషన్ ఫీజు, దరఖాస్తుకు చివరి తేది ఇదే..

Delhi DSSSB TGT Posts: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 5,346 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇలా!

PG Medical Admissions: మెడికల్ స్టూడెంట్స్‌కు అలర్ట్.. పీజీ సీట్ల భర్తీకి నోటిఫికేషన్

UoH Jobs 2025: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 52 ఉద్యోగాలు.. రూ.1,82,400 వరకు జీతం

Big Stories

×