BigTV English
Advertisement

OTT Movie : ఈ సినిమాను చూస్తే హార్రర్ మూవీ లవర్స్ కు ఎంజాయ్ పండగో… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie : ఈ సినిమాను చూస్తే హార్రర్ మూవీ లవర్స్ కు ఎంజాయ్ పండగో… హార్ట్ వీక్ గా ఉన్నవాళ్ళు చూడకూడని మూవీ

OTT Movie  : భయంకరమైన హారర్ సినిమాలను చూడాలనుకుంటే, ఇండోనేషియన్ హారర్ సినిమాలపై ఓ లుక్ వేయండి. ఎందుకంటే ఈ సినిమాలలో హారర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఒళ్లు జలదరించే సన్నివేశాలతో సీన్స్ ఉన్న అలాంటి ఓ మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. ఇప్పుడు మనం చెప్పుకోబోయే మూవీలో, ఒక గ్రామంలో అమ్మాయిలు వరుసగా చనిపోతుంటారు. ఒక యువతి ఈ రహస్యాన్ని కనుక్కోడానికి ప్రయత్నిస్తుంది. గుండె ధైర్యం ఉంటేనే ఈ మూవీని చూడండి. ఈ మూవీ పేరు ఏమిటి? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో

ఈ ఇండోనేషియన్ మిస్టరీ హారర్ థ్రిల్లర్ మూవీ పేరు ‘ది కార్పస్ వాషర్’ (The Corpse Washer). 2024 లో వచ్చిన ఈ మూవీకి హద్రా డేంగ్ రాటు దర్శకత్వం వహించారు. ఈ మూవీ మార్చురీలో పని చేసే లేలా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ ఇండోనేషియన్‌ మూవీని ఓటీటీలో తెలుగు సబ్‌టైటిల్స్‌తో చూడవచ్చు.


స్టోరీలోకి వెళితే

లేలా అనే యువతి మేకప్ ఆర్టిస్ట్ కావాలని కలలు కంటుంది. ఆమె తల్లి శవాలకు స్నానం చేయించి, వాటిని అంత్యక్రియలకు సిద్ధం చేసే వృత్తిలో ఉంటుంది. ఈ పని చేయడం లేలాకి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఆమె చావులు, ఆత్మలు అంటే భయపడుతూ ఉంటుంది. అయితే ఆమె స్నేహితురాలు ఒక రోజు అనుమానస్పదంగా మరణిస్తుంది. ఆ తరువాత ఆమె స్నేహితులలో ఒక్కొక్కరుగా మరణిస్తారు. ఈ వరుస మరణాలు లేలాను కలవరపరుస్తాయి. ఆమె వీళ్ళను ఎవరో హత్య చేస్తున్నట్లు అనుమానిస్తుంది. లేలా ఈ మరణాల వెనుక ఉన్న నిజాన్ని కనిపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో ఆమె శవాలకు స్నానం చేయిస్తున్నప్పుడు, వాళ్ళను ఎవరో చంపినట్లు గుర్తులు కనిపెడుతుంది. ఇందులో భాగంగా, ఆత్మలు ఆమె వెంటపడుతుంటాయి.

Read Also : విహారయాత్రకి వెళితే నరబలికి సిద్ధం చేశారు… ఊహించని ట్విస్ట్ లతో దడ పుట్టించే సినిమా

లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తే నూర్ అనే మహిళ గురించి తెలుస్తుంది. ఆమె ఒకప్పుడు చనిపోయిన అమ్మాయిలతో కలసి ఉండేది. కానీ గ్రామస్తులు ఆమెపై తప్పుడు ఆరోపణలు మోపి అకారణంగా చంపుతారు. అందువల్ల నూర్ కుమార్తె రికా, ఈ హత్యల వెనుక ఉండవచ్చని గ్రామస్తులు అనుమానిస్తారు. గ్రామస్తులు ఆమెపై దాడి చేయడానికి వస్తారు. లేలా వారి నుంచి రికాను రక్షించడానికి ప్రయత్నిస్తుంది. ఈ సంఘటనలో ఆమె సోదరుడు ఆరిఫ్ మరణిస్తాడు. ఇప్పుడు లేలా మేకప్ ఆర్టిస్ట్ కాకుండా, తన కుటుంబ వృత్తిని కొనసాగిస్తూ ఉంటుంది. చివరికి ఈ హత్యల వెనక ఎవరున్నారో లేలా కనిపెడుతుందా ? అమ్మాయిలే ఎందుకు చనిపోతున్నారు ? ఆత్మలు లేలా వెంట ఎందుకు పడుతున్నాయి ? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.

Related News

The Great Pre Wedding Show OTT : చిన్న సినిమాగా వచ్చి చితగ్గొడుతున్న ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’… క్రేజీ ఓటీటీ డీల్

OTT Movie : 20 ఏళ్ల అబ్బాయితో 40 ఏళ్ల ఆంటీ… పాటలతో వలపు వల… ఆ సీన్లైతే అరాచకం భయ్యా

OTT Movies : ఓటీటీలోకి వచ్చేస్తున్న సూపర్ హిట్ సినిమాలు.. ఆ నాల్గింటిని మిస్ అవ్వకండి..

OTT Movie : పూలమ్మే పిల్ల జీవితంలోకి మాజీ ప్రియుడు… ఖతర్నాక్ క్లైమాక్స్ మావా

OTT Movie : కుర్రాడి నుంచి పండు ముసలిదాకా ఎవ్వర్నీ వదలని అమ్మాయి… ఇదెక్కడి తేడా యవ్వారంరా సామీ ?

OTT Movie : ప్రియుడిని వదిలేసి మరొకడితో… కళ్ళు తెరిచినా మూసినా అవే సీన్లు… క్లైమాక్స్ కెవ్వు కేక

OTT Movie : చేతబడులతో చచ్చి బతికే కుటుంబం… ‘విరూపాక్ష’ను మించిన బ్లాక్ మ్యాజిక్ మరాఠీ మూవీ తెలుగులో

OTT Movie : తాత వల్ల నలిగిపోయే కూతురు, మనవడు… గుండెను పిండేసే రాశి ఫ్యామిలీ ఎంటర్టైనర్

Big Stories

×