BEL Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. మచిలీపట్నం, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పలు రకాల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగంలో మీరు కనుక సెలెక్ట్ అయితే మంచి వేతనం కల్పించనున్నారు. ఉద్యోగం ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వేతనం ఉండనుంది.
భారత ప్రభుత్వరంగ సంస్థ నవరత్న కంపెనీ మచిలిపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL).. ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన పోస్టులను భర్తీచేసేందుకు అధికారులు నోటిపికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL)..లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్), డిప్యూటీ ఇంజినీర్ (మెకానికల్) విభాగాల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
వెకెన్సీ వారీగా పోస్టులు చూసినట్లయితే..
డిప్యూటీ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్): 8 పోస్టులు
డిప్యూటీ ఇంజినీర్ (మెకానికల్): 12 పోస్టులు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 31
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ బీఎస్సీ ఇంజినీరింగ్/ ఏఎంఐఈ/ జీఐఈటీఈ పాసై ఉంటే సరిపోతుంది.
వయస్సు: 2025 ఫిబ్రవరి 1 నాటికి అభ్యర్థులకు 28 ఏళ్ల వయస్సు మించరాదు. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు పెట్టుకోవాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.472. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులు వారికి ఫీజులో మినహాయింపు ఉంటుంది
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చెస్తారు.
వేతనం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పిస్తారు. నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనం కల్పిస్తారు.
నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి సమాచారం అఫీషియల్ వెబ్ సైట్ లో చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://bel-india.in/
అర్హత కలిగి ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.40 వేల నుంచి రూ.1,40,000 వరకు వేతనం కల్పిస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 20
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 31