ICC Trophies – Indian Team: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ విజేతగా టీమిండియా నిలిచింది. మార్చి 9వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా… నాలుగు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టడం జరిగింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, వికెట్ కీపర్ కే ఎల్ రాహుల్ అద్భుతంగా రాణించడంతో ఫైనల్ మ్యాచ్లో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీం ఇండియా. అయితే ఆదివారం రోజున… టీమిండియా గెలవడంతో… మూడోసారి ఈ ముచ్చటగా ఛాంపియన్ ట్రోఫీని గెల్చుకుంది టీం ఇండియా.
Also Read: Jio Hotstar – IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్ కు జియో అదిరిపోయే శుభవార్త.. ఇకపై రూ.100 లకే
గతంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో టీమిండియా చాంపియన్ ట్రోఫీ గెలుచుకోవడం జరిగింది. ఆ తర్వాత మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీలో… చాంపియన్ ట్రోఫీ అందుకుంది టీమిండియా. ఇక ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో మూడోసారి ఛాంపియన్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ గెలుచుకుంది టీం ఇండియా. అయితే… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ టీమిండియా గెలిచిన నేపథ్యంలో… ఇప్పటివరకు టీమిండియా ఎన్ని ఐసీసీ టోర్నమెంట్లు గెలిచింది అనే దానిపై చర్చ జరుగుతోంది.
ఇప్పటివరకు టీమిండియా ఏడు.. ఐసీసీ టోర్నమెంట్లు గెలుచుకుంది. కపిల్ దేవ్, సౌరవ్ గంగూలీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ కెప్టెన్సీలో మాత్రమే టీమిండియా కు ఐసీసీ టోర్నమెంట్లు వచ్చాయి. కపిల్ దేవ్ కెప్టెన్సీలో 1983 సంవత్సరంలో వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది టీమిండియా. దాంతో మొట్టమొదటి ఐసీసీ టోర్నమెంట్ గెలుచుకున్న జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఇక ఆ తర్వాత మళ్లీ ఐసీసీ టోర్నమెంట్ గెలవడానికి చాలా సంవత్సరాలే పట్టింది.
చివరికి 2002 సంవత్సరంలో… సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ లో టీమిండియా కు ఛాంపియన్ ట్రోఫీ 2002 వచ్చింది. ఆ తర్వాత మహేంద్రసింగ్ ధోని వచ్చిన తర్వాత ఏకంగా టీమ్ ఇండియాకు మూడు ఐసిసి టోర్నమెంట్లు రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా 2007 ఐసీసీ t20 వరల్డ్ కప్ గెలుచుకుంది టీమిండియా. అప్పుడు ధోని కొత్త కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్ గెలుచుకుంది ఈ టీం ఇండియా. ధోని కెప్టెన్సీ లోనే ఈ టోర్నమెంట్ రావడం జరిగింది.
Also Read: KL Rahul: ఏం గుండె రా అది… ఐపీఎల్ 2025 కంటే ముందు కేఎల్ రాహుల్ సంచలన నిర్ణయం ?
ఈ మ్యాచ్ లో సిక్స్ కొట్టి మరి టీమిండియా కు ట్రోఫీ తీసుకోవచ్చాడు ధోని. ఇక 2013 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీని టీమ్ ఇండియా గెలుచుకుంది. అప్పుడు కూడా మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్ గా ఉన్నాడు. ధోని రిటైర్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ ఒక్క టోర్నమెంట్ కూడా తేలేకపోయాడు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్సీలో రెండు టోర్నమెంట్లు వరుసగా వచ్చాయి. 2024 t20 వరల్డ్ కప్ టీమ్ ఇండియాకు రాగా… ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్ కూడా దక్కించుకుంది టీమిండియా. ఈ రెండు టోర్నమెంట్లు కూడా రోహిత్ శర్మ కెప్టెన్సీలో వచ్చాయి.
https://twitter.com/Gurlabh91001251/status/1899489826489115094