BigTV English

HCA – SRH: HCA, SRH మధ్య సద్దుమణిగిన పంచాయితీ…ఫ్యాన్స్ కు రిలీఫ్ !

HCA – SRH:  HCA, SRH మధ్య సద్దుమణిగిన పంచాయితీ…ఫ్యాన్స్ కు రిలీఫ్ !

HCA – SRH: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో.. కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ( Sunrisers Hyderabad vs Hyderabad Cricket Association ) మధ్య గత నాలుగు రోజులుగా వివాదం కొనసాగుతోంది. కాంప్లిమెంటరీ పాసుల కేటాయింపు విషయంలో… హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ( Sunrisers Hyderabad  ) మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయి. దీంతో ఒకరిపై మరొకరు దాదాపు రెండు రోజుల నుంచి వాదోపవాదములు చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో… పోస్టులు పెడుతూ వివాదానికి మరింత… ఆజ్యం పోశారు.


Also Read: Kohli On World Cup 2027: 2027 వరల్డ్ కప్ లో ఆడటంపై కోహ్లీ సంచలన ప్రకటన..రిటైర్మెంట్ అప్పుడే ?

అయితే ఇలాంటి నేపథ్యంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Telangana Chief Minister Revanth Reddy )… ఈ విషయంలో జోక్యం చేసుకొని.. సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇవాళ.. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య చర్చలు జరిగాయి. అయితే కాసేపటి క్రితమే ఈ చర్చలు.. సఫలమయ్యాయి. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మధ్య ఉన్న వివాదం సమసి పోయింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి ( Board of Control for Cricket in India ), సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం, అలాగే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ట్రైపార్టీ ఒప్పందం మేరకు పని చేసేందుకు ఇరు వర్గాలు అంగీకారం తెలిపాయి. పాత ఒప్పందం ప్రకారమే ఉప్పల్ స్టేడియం ( Uppal Stadium) సామర్థ్యం లోని 10% కాంప్లిమెంటరీ పాసులు కేటాయించనున్నారు.


Also Read: John Cena: కాన్సర్ బారిన పడ్డ WWE సూపర్ స్టార్ జాన్ సీనా !

ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్లను విజయవంతంగా నిర్వహించేందుకు సన్రైజర్స్ హైదరాబాద్ కు పూర్తిగా సహకరిస్తామని అటు తాజాగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హామీ కూడా ఇచ్చింది. వివాదాన్ని ముగిశాయని సంయుక్తంగా ప్రకటించాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అలాగే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం. హెచ్ సి ఏ కార్యదర్శి ఆర్ దేవరాజ్ నేతృత్వంలో… జరిగిన చర్చల్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం ప్రతినిధులు కిరణ్ అలాగే శరవనన్, రోహిత్ పాల్గొన్నారు. ఈ చర్చలు సఫలం కావడంతో… వివాదం సద్దుమణిగిందని రెండు వర్గాలు ఒకేసారి ప్రకటన చేశాయి. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇది ఇలా ఉండగా… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి మ్యాచ్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆ తర్వాత ఆడిన రెండు మ్యాచ్ లలోను ఓడిపోయింది. లక్నో సూపర్ జెంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో దారుణంగా ఓడిపోయింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఇకనైనా మళ్లీ గెలిచి గాడిలో పడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

 

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×