Yuvraj Singh: ఓవైపు ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీతో భారత ఆటగాళ్లు క్రీడాభిమానులను అలరిస్తుంటే.. క్రికెట్ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మరో టోర్నీ సిద్ధమైన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ శనివారం నుండి ప్రారంభమైంది. ఈ టోర్నీలో ఓపెనింగ్ మ్యాచ్ భారత్ – శ్రీలంక జట్ల మధ్య జరిగింది. శనివారం రోజు ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన భారత్ మాస్టర్స్ టీమ్.. నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 222 పరుగుల భారీ స్కోర్ చేసింది.
భారత మాస్టర్స్ టీమ్ లో సచిన్ టెండుల్కర్ {10}, వికెట్ కీపర్ అంబటి రాయుడు {5}, గురుకీరత్ సింగ్ {44}, స్టువర్ట్ బిన్నీ {68}, యువరాజ్ సింగ్ {Yuvraj Singh} {31*}, యూసఫ్ పటాన్ {56*} పరుగులు చేశారు. దీంతో భారత్ మాస్టర్స్ 222 పరుగులు చేసింది. ఇక శ్రీలంక బౌలర్లలో సురంగ లక్మాల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఉదనా, చతురంగా చెరో వికెట్ తీశారు. అనంతరం 223 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక మాస్టర్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. కుమార సంగర్కరా {51}, జీవన్ మెండీస్ {42} పరుగులతో రాణించారు.
ఇక గుణరత్నే {37}, ఉపల్ తరంగా {10}, ప్రియంజన్ {17}, ఉదాన {23} పరుగులు చేశారు. ఇక మిగతా బ్యాటర్లు ముగ్గురు సింగిల్ డిజిట్ కే పరిమితం కాగా.. మరొక బ్యాటర్ డక్ అవుట్ అయ్యాడు. దీంతో ఇండియా మాస్టర్స్ నాలుగు పరుగుల తేడాతో గెలుపొందింది. భారత బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. ధవల్ కులకర్ణి 2, మిథున్ 2, విజయ్ కుమార్ 2 వికెట్లు తీశారు. అయితే ఈ మ్యాచ్ లో మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ {Yuvraj Singh} స్టన్నింగ్ క్యాచ్ తో అలరించాడు.
ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్ లో శ్రీలంక మాస్టర్స్ జట్టు ఆటగాడు లాహిర్ తిరుమన్నే కొట్టిన బంతిని.. బౌండరీ లైన్ వద్ద గాల్లోకి ఎగిరి ఒడిసి పట్టుకున్నాడు. 43 ఏళ్ల వయసులోనూ అప్పటి యువరాజ {Yuvraj Singh} నీ గుర్తు చేశాడు. దీంతో యువరాజ్ సింగ్ క్యాచ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2000 సంవత్సరంలో మొహమ్మద్ కైఫ్ నాయకత్వంలో అండర్ 19 జట్టులో అవకాశం దక్కించుకున్న యువరాజ్ సింగ్.. ఆ సంవత్సరం టీమ్ ఇండియా అండర్ 19 టీం వరల్డ్ కప్ దక్కించుకోవడంలో {Yuvraj Singh} ముఖ్యపాత్ర పోషించాడు.
ఇక అదే సంవత్సరము జాతీయ జట్టులోకి ప్రవేశించాడు. 2000 అక్టోబర్ 3 న కెన్యాతో జరిగిన వన్డే మ్యాచ్ లో అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన స్పిన్ బౌలింగ్ తోనే కాకుండా.. బ్యాట్ తోను ఎన్నోసార్లు {Yuvraj Singh} భారత జట్టుకు విజయాలను అందించాడు. 2011 వన్డే ప్రపంచ కప్ లో క్యాన్సర్ తో పోరాడుతూ అతడు ఆడిన ఇన్నింగ్స్ ని ఎవరూ మరిచిపోలేరు. దాదాపు రెండు దశాబ్దాల పాటు భారత క్రికెట్ కి సేవలందించిన యువరాజ్ సింగ్.. 2019లో అంతర్జాతీయ క్రికెట్ కి గుడ్ బై చెప్పాడు.
𝗛𝗶𝗴𝗵-𝗳𝗹𝘆𝗶𝗻𝗴 ✈️ action ft. 𝗬𝘂𝘃𝗿𝗮𝗷 𝗦𝗶𝗻𝗴𝗵! 🔥
Catch all the action LIVE, only on @JioHotstar, @Colors_Cineplex & @CCSuperhits 📲 📺#IMLT20 #TheBaapsOfCricket #IMLonJioHotstar #IMLonCineplex pic.twitter.com/mN2xBvotF2
— INTERNATIONAL MASTERS LEAGUE (@imlt20official) February 22, 2025