Civils Rankers: సివిల్స్- 2024 ఫలితాలు నిన్న విడుదలైన విషయం తెలిసిందే. యూపీకి చెందిన శక్తి దూబె ఫస్ట్ ర్యాంక్ సాధించింది. అయితే, ఈ సారి సివిల్స్ ఫలితాల్లో తెలుగు అభ్యర్థులు మెరిశారు. 100 లోపు ఐదు ర్యాంకులు సాధించి తెలుగు అభ్యర్థులు సత్తా చాటారు. అలాగే మొత్తంగా చూసుకుంటే 50 మందికి పైగా అభ్యర్థులు వివిధ కేంద్ర సర్వీసులకు సెలెక్ట్ అయ్యారు. తెలుగు రాష్ట్రాల నుంచి అమ్మాయిలు పది మంది మాత్రమే ఉన్నారు. ఈసారి 200 లోపు ర్యాంకు సాధించిన వారిలో పలువురు గతంలోనూ ఏపీఎస్, ఇతర ఉద్యోగాలకు ఎంపికైన వారే ఉన్నారు. అయితే ఐఏఎస్, ఐపీఎస్ సర్వీస్‌ల కోసం మరో ప్రయత్నం చేసి పలువురు తమ లక్ష్యాన్ని సాధించారు.
Also Read: NTPC Recruitment: డిగ్రీ అర్మతతో ఎన్టీపీసీలో ఉద్యోగాలు, ఇంకా 2 రోజులే ఛాన్స్ భయ్యా, జీతం రూ.71,000
డైలీ 12 గంటలు చదివాను..
రెండు తెలుగు రాష్ట్రాల్లో 11వ ర్యాంక్ సాధించిన ఇట్టబోయిన సాయి శివానిది ఉత్తమ్ ర్యాంక్. వరంగల్ జిల్లాకు చెందిన సాయి శివాని.. రెండో ప్రయత్నంలో సివిల్స్ విజేతగా నిలిచారు. ఖిలా వరంగల్ ప్రాంతానికి చెందిన సాయి శివాని ఓ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి ఎంతో కష్టపడి సివిల్స్ క్రాక్ చేశారు. కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ పూర్తి చేశారు. ఇటీవల విడుదలైన గ్రూప్-1 ఫలితాల్లో సైతం మంచి ర్యాంక్ సాధించారు. రాష్ట్ర స్థాయిలో 21వ ర్యాంక్, జోన్ స్థాయిలో 11 వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా సాయి శివాని మాట్లాడుతూ.. ‘డైలీ 12 గంటలు చదివాను. ఒక ప్రణాళికతో చదివితే సివిల్స్ క్రాక్ చేయడం పెద్ద కష్టం కాదు. సొంతంగా నోట్స్ ప్రిపరేషన్‌తో పాటు చిత్తశుద్ధితోనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు’ అని ఆమె చెప్పారు.
Also Read: AP Tenth Results: పదో తరగతి ఫలితాల్లో అరుదైన రికార్డ్.. 600/600 సాధించింది.. రియల్లీ ఆమె గ్రేట్
గ్రేట్.. సివిల్స్ కు ఎంపికైనా మరోసారి..
సాయి శివాని తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన బన్నా వెంకటేశ్ ఉత్తమ ర్యాంక్ సాధించారు. ఆయన ఇప్పటికే సివిల్ సర్వీసెస్ లో ఉన్నారు. మళ్లీ ఎగ్జామ్స్ రాసి ఈ సారి 15 వ ర్యాంక్ సాధించారు. వెంకటేశ్ 2023 సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో 467వ ర్యాంక్ సాధించారు. కష్టపడితే విజయం సాధించడం సులభమేనని వెంకటేశ్ చెప్పారు. ప్రస్తుతం వెంకటేష్ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతూనే సివిల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఉత్తమ ర్యాంక్ సాధించారు. వెంకటేశ్ తమిళనాడు తిరుచిరాపల్లి ఎన్‌ఐటీలో ఇంజినీరింగ్ చేశారు. రెండేళ్ల పాటు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేసి ఉద్యోగాన్ని వదిలిపెట్టి సివిల్స్ కు సిద్ధమయ్యారు. కష్టపడితే విజయం సాధించడం సులభమేనని వెంకటేశ్ చెప్పారు.
మళ్లీ రాశారు.. ర్యాంక్ కొట్టారు..
ఇక గత ఫలితాల్లో 104వ ర్యాంకు సాధించిన రావుల జయసింహారెడ్డి ఈసారి 46వ ర్యాంకు సాధించారు. అలాగే చింతకింది శ్రవణ్ కుమార్ రెడ్డి గతంలో 426 వ ర్యాంక్ సాధించగా.. ఈసారి 62వ ర్యాంక్ సాధించాడు. ఎన్. చేతన్ రెడ్డి సివిల్స్ – 2022 ఫలితాల్లో 346వ ర్యాంక్ రాగా.. ఈసారి ఫలితాల్లో 110 ర్యాంక్ సాధించారు. పవన్ కల్యాణ్ అనే అభ్యర్థుి 146 వ ర్యాంక్ సాధించారు. సాయితేజ్ అనే అభ్యర్థి గత ఫలితాల్లో 558… ఈసారి 154వ ర్యాంకు పొందారు.
Also Read: UOH Recruitment: హైదరాబాద్‌లో జాబ్ చేసే అవకాశం.. ఈ అర్హతలు ఉండాలి.. ఇంకా 5 రోజులే మిత్రమా..