Anasuya Bharadwaj: చాలావరకు సినీ సెలబ్రిటీలు తమపై వచ్చే నెగిటివ్ కామెంట్స్‌ను పట్టించుకోరు. కానీ కొందరు మాత్రం అలాంటి వాటికి సైలెంట్‌గా ఉంటే ఆకతాయిలు ఇలాగే రెచ్చిపోతారని ఎప్పటికప్పుడు వారికి వార్నింగ్స్ ఇస్తూ ఉంటారు. కానీ అలా వార్నింగ్ ఇచ్చినా కూడా కొందరు ప్రేక్షకులు తమ పద్ధతి మార్చుకోరు. అలాంటి వారి వల్ల ఎన్నోసార్లు ట్రోలింగ్ ఎదుర్కుంటూ ఇబ్బందులు పడిన బుల్లితెర సెలబ్రిటీ అనసూయ భరద్వాజ్. సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తన కెరీర్‌ను ముందుకు నడిపించాలని అనుకున్న అనసూయ యాంకర్‌గా ఫేమస్ అయ్యింది. తాజాగా మరోసారి స్టేజ్‌పైనే ఫ్యాన్‌కు వార్నింగ్ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
స్టేజ్‌పైనే వార్నింగ్
అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj)కు బుల్లితెర యాంకర్‌గా కంటే సోషల్ మీడియాలోనే ఎక్కువగా క్రేజ్ ఉంది. తనకు నచ్చని విషయాన్ని ఎదిరిస్తూ చాలా బోల్డ్‌గా మాట్లాడేస్తుంది అనసూయ. అది కొంతవరకు ఓకే అయినా కూడా తనకు సంబంధం లేని విషయాల్లో కూడా జోక్యం చేసుకొని మరీ హైలెట్ అవ్వాలని ప్రయత్నిస్తుంది అంటూ నెటిజన్లు తనపై కౌంటర్లు వేస్తుంటారు. అలాంటి కౌంటర్లకు కూడా అనసూయ రియాక్ట్ అవుతుంది. చాలావరకు నెటిజన్ల యాక్షన్స్, దానికి తన రియాక్షన్స్.. ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. తాజాగా ఒక ఈవెంట్‌లో పాల్గొన్న అనసూయ.. స్టేజ్‌పైనే ఒక ఫ్యాన్‌కు సింగిల్ ఫింగర్ చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వీడియో తాజాగా వైరల్ అవుతోంది.
చీఫ్ గెస్ట్‌గా అనసూయ
అనసూయకు ఆంటీ అనే పదం నచ్చదు. చాలాకాలం క్రితం అలా ఒకరు పిలిచినందుకే వారిపై ఫైర్ అయ్యింది. అప్పటినుండి చాలామంది నెటిజన్లు కావాలనే అనసూయను ఆంటీ అని పిలుస్తూ తనను రెచ్చగొడుతూ ఉంటారు. తాజాగా ఒక హోళీ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యింది ఈ బుల్లితెర బ్యూటీ. అక్కడ స్టేజ్‌పైన పాటలు పాడుతూ, డ్యాన్సులు చేస్తూ అందరినీ ఎంటర్‌టైన్ చేసింది. అదే సమయంలో గుంపులో నుండి ఒకడు తనను ఆంటీ అని పిలిచాడు. అంతే స్టేజ్‌పై నుండే వారిని టార్గెట్ చేస్తూ అందరి ముందు వార్నింగ్ ఇచ్చింది. వాడి అంతు చూస్తానంటూ బెదిరించింది. దీంతో ఈ వీడియోను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు.
Also Read: మళ్లీ సెలైన్ బాటిల్‌తో బెడ్‌పై సమంత.. ఆందోళనలో ఫ్యాన్స్.!
దమ్ముంటే రా..
‘నేను నీ మొహాన్ని అస్సలు మర్చిపోను. ఇక్కడికి రా. అతడిని స్టేజ్‌పైకి పంపించండి. నన్ను గెలికితే ఏం జరుగుతుందో నీకు తెలియాలి. పైకి రా. అతడికి పైకి పంపండి. దమ్ముంటే పైకి రా’ అంటూ అతడిని స్టేజ్‌పైకి పిలిచింది అనసూయ భరద్వాజ్. ఎన్నిసార్లు పిలిచినా అతడు రాకపోవడంతో ఉ*చ్చ పోయిస్తా అన్నట్టుగా తనకు సింగిల్ ఫింగర్ చూపించింది. ప్రస్తుతం స్టేజ్‌పైనే అనసూయ చేసిన ఈ అల్లరి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ రచ్చ చేస్తోంది. ఎప్పటిలాగానే తనను ఎవరైనా ఏమైనా అంటే అనసూయ ఇచ్చిపడేస్తుందని ఫ్యాన్స్ అంటుంటే.. అనవసరంగా యాటిట్యూడ్ చూపిస్తుంది అంటూ తన హేటర్స్ కామెంట్స్ చేస్తున్నారు.