BigTV English

Metaverse in Climate Change : వాతావరణ మార్పులకు సాయం చేసే మెటావర్స్..

Metaverse in  Climate Change :  వాతావరణ మార్పులకు సాయం చేసే మెటావర్స్..
Metaverse in  Climate Change


Metaverse in Climate Change : పర్యావరణం ఎక్కువగా ఇష్టపడే వారు, తరాల మార్పులకు ఎక్కువగా అలవాటు పడనివారు టెక్నాలజీని ఎప్పుడూ నెగిటివ్‌గానే చూస్తారు. టెక్నాలజీ అనేది ఎన్నో విధాలుగా మనుషులకు ఉపయోగపడుతున్నా.. ఆ విషయాన్ని ఒప్పుకోవడానికి మాత్రం వారు ఇష్టపడరు. అలాంటి వారి దృష్టిలో టెక్నాలజీ అనేది ఎప్పుడూ మానవాళికి హాని చేసే ఒక శత్రువు మాత్రమే. అయినా కూడా అలాంటి వారి ఆలోచనలు తప్పు అని టెక్నాలజీ ఎప్పటికప్పుడు ప్రూవ్ చేస్తూనే ఉంది. తాజాగా మళ్లీ ప్రూవ్ అయ్యింది.

మెటావర్స్ అనేది బయట ప్రపంచంతో సంబంధం లేని ఒక ప్రత్యేకమైన రంగుల ప్రపంచం. ఇందులో మనుషులు గేమ్స్ ఆడుకోవచ్చు, కొత్తవారిని కలవచ్చు, కొత్త కొత్త ప్రాంతాలను చూడవచ్చు.. అంతే కాకుండా నేరుగా ఇవన్నీ చేసిన అనుభూతిని పొందవచ్చు. తాజాగా మెటావర్స్‌లో పూర్తిగా లీనమయిపోతే.. ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు వస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. కానీ మెటావర్స్ వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కూడా తెలుసుకున్నారు. మెటావర్స్‌ను అడాప్ట్ చేసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయన్నారు.


మెటావర్స్, లేదా ఇదే సామర్థ్యంతో ఉన్న మరికొన్ని టెక్నాలజీలు మనుషులు సృష్టిస్తున్న వాతావరణ మార్పులను తగ్గించడానికి ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. మనుషులు ఇప్పటికే వాతావరణానికి ఎన్నో విధాలుగా హాని కలిగించారు. ఇప్పటికీ మనుషుల ప్రవర్తన వల్ల ఈ హాని పెరుగుతుందే తప్పా తగ్గడం లేదు. కానీ మెటావర్స్ అనేది ఆ హానిని కొంతవరకు తగ్గించగలదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 2030 వరకు మెటావర్స్ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల యూజర్లను సంపాదించుకుంది. ఆ సమయంలో భూమి ఉష్ణోగ్రతను 0.2°C తగ్గించగలదని వారు తెలిపారు.

0.2°C అంటే దాదాపు 10 గిగాటర్స్ కార్బన్ డయాక్సైడ్‌ను మెటావర్స్ టెక్నాలజీ గాలి నుండి తొలగించగలదని శాస్త్రవేత్తలు తెలిపారు. అంతే కాకుండా అమెరికాలో ఎనర్జీ వినియోగాన్ని దాదాపు 10 శాతం తగ్గించగలదని అంటున్నారు. దీని కారణంగా గ్రీన్‌హౌస్ గ్యాసులు కూడా 10 నుండి 23 శాతం తగ్గే అవకాశం ఉందన్నారు. మెటావర్స్ అనేది వాతావరణ మార్పులకు ఉపయోగపడుతుంది అని కనిపెట్టారు కానీ ఏ విధంగా ఉపయోగపడుతుంది అని శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిస్థాయిలో కనిపెట్టలేకపోయారు. ప్రస్తుతం వారు ఈ పనిలో నిమగ్నమయి ఉన్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×