BigTV English

Argentina football team offer : అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ ఆఫర్.. తిప్పికొట్టిన భారత్..

Argentina football team offer : అర్జెంటీనా ఫుట్‌బాల్ టీమ్ ఆఫర్.. తిప్పికొట్టిన భారత్..
Argentina football team


Argentina football team offer : మామూలుగా స్పోర్ట్స్‌ ఈవెంట్స్‌ను హోస్ట్ చేయాలంటే ఎన్నో ప్రపంచ దేశాలు ఆసక్తి చూపిస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే పోటీపడతాయి కూడా. కానీ స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను ఆర్గనైజ్ చేయడం అంత మామూలు విషయం కాదు.. చాలా ఖర్చుతో కూడుకున్న పని. అది కూడా పేరున్న టీమ్, కాస్ట్‌లీ ప్లేయర్స్‌ను తృప్తి పరచాలంటే అన్ని దేశాల వల్ల కాదు. అందుకేనేమో లియోనల్ మెస్సీని ఆహ్వానించే అవకాశం వచ్చినా.. భారత్ ఆ అవకాశాన్ని తిప్పికొట్టింది.

ఫుట్‌బాల్‌లో లియోనల్ మెస్సీకి, తన టీమ్ అర్జెంటీనాకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే వారి ఆటతో వరల్డ్ ఛాంపియన్స్‌గా కూడా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఫిఫా వరల్డ్ కప్‌ను ఖతర్ హోస్ట్ చేసింది. దానికోసం ఖతర్ చాలానే ఖర్చుపెట్టింది. అక్కడ ఆటకు ఉన్న క్రేజ్‌ను చూసి త్వరలోనే జరగనున్న రెండు మ్యాచ్‌లను హోస్ట్ చేసే అవకాశాన్ని సౌత్ ఏషియాకు ఇవ్వాలని అర్జెంటీనా నిర్ణయించుకుంది. జూన్ 12 నుండి జూన్ 20 మధ్య జరిగే మ్యాచ్‌లలో రెండు స్లాట్స్ ఖాళీగా ఉన్నాయని బయటపెట్టింది. కానీ వారు ఊహించని విధంగా ఇండియా స్పందన వేరేలా ఉంది.


‘అర్జెంటీనా ఎఫ్ఏ స్నేహపూర్వకంగా మమల్ని కలిశారు. కానీ అంత భారీ మొత్తాన్ని అరేంజ్ చేయడం మాకు చాలా కష్టం. అలాంటి ఒక మ్యాచ్ ఇక్కడ జరగాలంటే మాకు ఒక స్ట్రాంగ్ పార్ట్‌నర్ కావాలి. అర్జెంటీనా కమాండ్ చేస్తున్న మొత్తం చాలా ఎక్కువ. కానీ ఫుట్‌బాల్‌లో మా ఆర్థిక పరిస్థితి వల్ల మాకు కొన్ని లిమిట్స్ ఉన్నాయి’ అంటూ ఏఐఎఫ్ఎఫ్ సెక్రటరీ జెనరల్.. ఫుట్‌బాల్‌ను ఇండియా హెస్ట్ చేయకపోవడానికి కారణాన్ని బయటపెట్టారు.

సౌత్ ఏషియాలో ఆటలు నిర్వహించాలని అర్జెంటీనా నిర్ణయించుకున్నప్పుడు వారు ముందుగా అనుకున్న ఆప్షన్స్.. బంగ్లాదేశ్, ఇండియా. కానీ వారు ఇచ్చిన తక్కువ సమయంలో అంత భారీ మొత్తాన్ని అరేంజ్ చేయడం ఈ రెండు దేశాలకు సాధ్యమయ్యే పని కాదు. ఇండియా తమ ఆఫర్‌ను అంగీకరించకపోవడంతో.. ఈ అవకాశాన్ని అమెరికా చేతికి ఇచ్చింది అర్జెంటీనా.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×