E-Paper
Advertisement

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి..చిరు శ్రీకాంత్ సినిమా నాని పై అప్డేట్!
Advertisement

Actor Nani: నాచురల్ స్టార్ నాని ఒక వైపు సినిమాలలో హీరోగా నటిస్తూనే మరోవైపు నిర్మాతగా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. నాని నిర్మాతగా వ్యవహరించి ఈ సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే నాని ఈసారి ఏకంగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)తోనే సినిమా చేయబోతున్నారు. నాని (Nani)నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా శ్రీకాంత్ ఓదెల (Sreekanth Odela)దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి అధికారక ప్రకటన కూడా వెలువడింది.

శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో మెగాస్టార్..

ఈ సినిమా గురించి గత ఏడాది చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా అధికారకంగా ప్రకటించారు కానీ ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్ రాలేదు ప్రస్తుతం శ్రీకాంత్ ది ప్యారడైజ్(The Paradise) సినిమా పనులలో బిజీగా ఉన్నారు అదే విధంగా చిరంజీవి సైతం ఇదివరకు కమిట్ అయిన సినిమాల పనులలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ ఏ విధమైనటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ఇక ప్రస్తుతం నాని, శ్రీకాంత్ ఓదెల కూడా ది ప్యారడైజ్ విడుదలతో ఫ్రీ అయ్యారు మరి కొద్ది రోజులలో మెగాస్టార్ చిరంజీవి కూడా తన కాకా (Kaaka) సినిమా పనులను పూర్తి చేసుకోబోతున్నారు.

సినిమాకు నెగిటివ్ టాక్..

Advertisement

కాకా షూటింగ్ పూర్తి అవ్వగానే చిరంజీవి శ్రీకాంత్ ఓదెలా డైరెక్షన్ లో బిజీ కాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే నాని ఈ సినిమా గురించి పరోక్షంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ది ప్యారడైజ్ విడుదలైన నేపథ్యంలో డైరెక్టర్ శ్రీకాంత్ తో కలిసి నాని ఒక చిట్ చాట్ చేశారు. ఇందులో భాగంగా నాని శ్రీకాంత్ తో మాట్లాడుతూ.. నేను తర్వాత చేసే సినిమా కానీ, లేదా నువ్వు తర్వాత డైరెక్షన్ చేసే సినిమా కానీ, లేదా మనిద్దరం కలిసి చేయబోయే సినిమా గురించి ఎవరైతే సినిమా బాగాలేదని, నెగిటివ్ గా మాట్లాడుతూ ట్రోల్ చేస్తూ ఉంటారో అలాంటి వారందరూ కూడా మన సినిమాని సెలెబ్రేట్ చేసుకునే విధంగా ఉండాలని తెలిపారు.

ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకోవాలి…

ఇలా ట్రోలర్స్ కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా మన సినిమా ప్రేక్షకుల ముందుకు రావాలి అంటూ నాని కామెంట్ చేయడంతో కచ్చితంగా ఈయన తమ తదుపరి చిరంజీవితో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతున్నారని స్పష్టం అవుతుంది. నాని నిర్మాణంలో శ్రీకాంత్ డైరెక్షన్లో చిరంజీవి హీరోగా ఈ సినిమా షూటింగ్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా గురించే నాని మాట్లాడాలని స్పష్టమవుతుంది. తాజాగా విడుదలైన ది ప్యారడైజ్ సినిమా గురించి చాలామంది నెగిటివ్గా మాట్లాడటంతో నాని ఇలాంటి వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. మరి చిరంజీవితో చేయబోయే సినిమా ఏ జానర్ లో ఉంటుందనే వివరాలను త్వరలోనే తెలియ చేయనున్నారు.

Advertisement

Also Read :‘ది ప్యారడైజ్’ పై కేటీఆర్ ట్వీట్…ప్రియదర్శి రియాక్షన్ ఇదే!

Related News

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

కొడుకు బతకాలంటే రూ. 26 కోట్లు కావాలి.. దాతలు ముందడుగు వేస్తే, కాటేసిన సైబర్ రాక్షసులు!

Intinti Ramayanam Today Episode: బాబు కిడ్నాప్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్.. అవని ప్లాన్ సూపర్..

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమను ఇరికించిన భద్ర.. వల్లికి దిమ్మతిరిగే షాక్.. ఇది కదా ఫ్యాన్స్ కోరుకొనేది..

Karthika Deepam 2 Serial Today Episode September 18th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: శివనారాయణను దొంగగా బావించిన ఆలయ ధర్మకర్త          

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. ఇదేం ట్విస్ట్ రా అయ్యా..

ఆయనో భూస్వామి..నువ్వో పెయింటర్‌.. రా భూముల లెక్కలు తేల్చుకుందాం..! కేటీఆర్‌ వీరావేశం..

Big Stories

Advertisement
×