BigTV English

Apple Watch : మీకు హార్ట్ ఎటాక్ రాబోతుంది వెంటనే జాగ్రత్త పడండి.. స్మార్ట్ వాచ్ హెచ్చరిక !

Apple Watch : మీకు హార్ట్ ఎటాక్ రాబోతుంది వెంటనే జాగ్రత్త పడండి.. స్మార్ట్ వాచ్ హెచ్చరిక !

Apple Watch : హార్ట్ ఎటాక్స్ భయం పెరిగిపోయింది. అది సైలెంట్ గా మనిషి ప్రాణం తీస్తుంది. అయితే అది రావడానికి ముందు సిగ్నల్స్ ఇస్తుంది. దీన్ని పసిగట్టి జాగ్రత్త పడితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. అందుకు స్మార్ట్ వాచ్ టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతోంది. వీటిలోనూ అత్యధికంగా సేల్ అవుతున్న స్మార్ట్ వాచ్ లుగా యాపిల్ బ్రాండ్ రికార్డు సాధించింది. స్మార్ట్ వాచ్ లు ప్రజల ప్రాణాలను కాపాడుతున్నాయనడానికి ఇటీవల చాలా ఘటనలే ఉదాహరణగా నిలిచాయి. ఓపాప హార్ట్ బీట్ లో తేడా రావడాన్ని స్మార్ట్ వాచ్ పసిగట్టింది. దాన్ని గమనించిన ఆమె తల్లి వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే… ప్రమాదకరమైన కణితి విషయం బయటపడింది. ఇక ఈ స్మార్ట్ వాచ్ ల పనితీరుపై
మయో క్లినిక్ రీసెర్చ్ ఓ అధ్యయనం చేపట్టింది. అందులో చాలా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. అమెరికాతోసహా 11 దేశాల్లో ఈ అధ్యయనం చేపట్టింది. ఇందులో 2,454 మంది గుండె వ్యాధులున్నవారిపై 2021 ఆగస్టు నుంచి 2022 ఫిబ్రవరి వరకు పరిశోధనలు నిర్వహించారు. ఇందులో భాగంగా సైంటిస్టులు అభివ్రుద్ధి చేసిన ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) అల్గారితం ఆధారంగా యాపిల్ స్మార్ట్ వాచ్ ద్వారా 1,25,000 ఈసీజీ టెస్ట్ లను చేశారు. వీటి ద్వారా చేపట్టిన ఈసీజీ టెస్టులలో సత్ఫలితాలు వచ్చినట్లు పరిశోధకులు తెలిపారు.
ఇంతకీ గుండె పోటు రావడానికి ముందు అసలు ఏం జరుగుతుంది?
సాధారణంగా గుండె(గుండెలో జఠరికలు, కర్ణికలు ఉంటాయి) ఎడమ జఠరిక పనిచేయకపోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే వీటిని వెంటనే గుర్తించకపోవడం వల్ల చివరికి ప్రాణం మీదికి వస్తుంది. చికిత్స అందించడంలో ఆలస్యం జరిగితే కొన్నిసార్లు గుండెపోటుకు దారితీసి ప్రాణాలే పోవచ్చు. ఇలాంటి సమస్యలను ముందుగానే గుర్తించడానికి యాపిల్ స్మార్ట్ ఫోన్లు ఉపయోగపడుతున్నట్లు అధ్యయనంలో తేలిందని పరిశోధకులు చెబుతున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేని చోట్ల ఈసీజీ టెస్ట్ లతో యాపిల్ వాచ్ గుండె సంబంధిత బాధుతలని గుర్తిస్తాయని వైద్యులు తెలిపారు.


    Related News

    Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

    Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

    Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

    James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

    Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

    Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

    Big Stories

    ×