BigTV English

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Fact Check: క్యాబ్ డ్రైవర్ అమ్మాయిని బలవంతంగా కారులోకి లాక్కెళ్లాడా? ఆ వైరల్ వీడియో వెనుక అసలు నిజం ఇదే!

Tamil Nadu Cab Driver: తాజాగా తమిళనాడు విమానాశ్రయంలో క్యాబ్ డ్రైవర్లు ఓ యువతి పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసింది. “ఇది DMK పాలనలో ఉన్న తమిళ క్యాబ్ మాఫియాలు ప్రయాణికులను కార్లలోకి ఎలా బలవంతంగా ఎక్కిస్తున్నారో చూడండి. విమానాశ్రయాలలో పోలీసులు క్యాబ్ డ్రైవర్లకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారు. క్యాబ్ డ్రైవర్లు మహిళలను బలవంతంగా పట్టుకుని క్యాబ్‌లలోకి ఎలా లాగుతున్నారో చూడండి. మహిళలకు భద్రత ‘0’. మహిళల పట్ల గౌరవం ‘0’. ఇదేనా పెరియార్ మోడల్?” అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.


వైరల్ వీడియోలో ఏం ఉందంటే?

తాజాగా వైరల్ అయిన 56 సెకన్ల వైరల్ వీడియో ఒక యువతి.. మరో యువతి చేయి పట్టుకున్న వ్యక్తిపై కోపంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉంది. ఈ వీడియోలో నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తి వారిపై దాడి చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. ఆ సదరు యువతి తనను ఆపినందుకు నీలిరంగు చొక్కా ధరించిన వ్యక్తి చెంప మీద కొడుతుంది. ఇక ఈ వీడియో తమిళనాడు క్యాబ్ డ్రైవర్ ఒక మహిళ చేయి పట్టుకుని క్యాబ్‌ లోకి బలవంతంగా లాగాడని ఈ వీడియో బాగా ప్రచారం జరిగింది. తమిళనాడులో మహిళల భద్రత రోజురోజుకూ దిగజారిపోతోందని నెటిజన్లు రియాక్ట్ అయ్యారు.


ఇంతకీ అసలు నిజం ఏంటంటే?

ఈ ఘటన మార్చి 27 2025 నాడు జరిగింది. కోయంబత్తూర్ విమానాశ్రయంలో జరిగిన ఈ ఘటన అప్పట్లో పలు వార్తా పత్రికలు కవర్ చేశాయి కూడా. కొత్తగా పెళ్లైన ఓ జంట హనీమూన్ కు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఆ పెళ్లి కొడుకు ఇంతకు ముందు ఓ యువతితో సహజీవనం చేశాడు. ఆమెను కాదని మరో యుతిని పెళ్లి చేసుకుని హనీమూన్ కు వెళ్లాడు. అతడు తిరిగి వస్తున్నాడని తెలుసుకున్న పెళ్లికొడుకు మాజీ లవర్ విమానాశ్రయం దగ్గరికి వచ్చి హల్ చల్ చేసింది. “నాతో సహజీవనం చేసి వేరొక అమ్మాయితో హనీమూన్ కు ఎలా వెళ్తావ్?” నానా రచ్చ చేసింది. అతడు తనను మోసం చేశాడంటూ గట్టిగా అరిచింది. తనను వారించేందుకు ప్రయత్నించిన తన బంధువు పైనా ఆమె చేయి చేసుకుంది. ఈ వార్తను ఇండియన్ ఎక్స్ ప్రెస్ తో పాటు తంతి టీవీ, ఎబిపి నాడు, వికటన్, ది కోవై హెరాల్డ్,  ఆసియా నెట్ న్యూస్ తమిళ్ లాంటి పలు వార్తా సంస్థలు ఈ న్యూస్ ను ప్రెజెంట్ చేశాయి. యువతి సదరు జంటను అడ్డుకోవడం పెద్ద వివాదానికి కారణం అయినట్లు వెల్లడించాయి. ఎయిర్ పోర్టు పోలీసులు కూడా వారికి సర్ది చెప్పి అక్కడి నుంచి వారిని పంపించే ప్రయత్నం చేశాయని రాసుకొచ్చాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోకు తమిళ క్యాబ్ డ్రైవర్లను లింక్ చేయడం పట్ల పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కొంత మంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. మొత్తంగా తమిళనాడు క్యాబ్ డ్రైవర్ విమానాశ్రయంలో ఒక మహిళా ప్రయాణీకుడితో అనుచితంగా ప్రవర్తించాడనేది తప్పుడు ప్రచారం. ఇదో వ్యక్తిగత వివాదానికి సంబంధించిన వ్యవహారంగా తేలింది.

Read Also:  కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Related News

Train Viral Video: సెల్ఫీకి ప్రయత్నం.. క్షణాల్లో దొంగల బుట్టలో ఫోన్.. వీడియో వైరల్!

RGV Tweet: కుక్కతో ఆంటీలు డ్యాన్స్.. ఆర్జీవీ ట్వీట్ చూస్తే నవ్వు ఆగదు!

Street Dogs: ఆ దేశంలో పిల్లలకు బదులు.. వీధి కుక్కలను దత్తత తీసుకుంటారట!

Viral Video: గజరాజుతో సెల్ఫీ.. కిందపడేసి మరీ తొక్కేసింది, ధైర్యం ఉంటేనే ఈ వీడియో చూడండి!

Poop Suitcase: ట్రంప్‌తో మీటింగ్‌‌కు పుతిన్ తన మలాన్ని ఎందుకు తీసుకెళ్లారు? ఆ సూట్ కేస్ నిండా అదేనా?

Big Stories

×