Big Stories

China:- తొలిసారి అలాంటి శాటిలైట్‌తో చైనా ప్రయోగం..

China:- సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో మోనార్క్‌గా నిలవాలని చైనా ప్రయత్నిస్తోంది. ప్రపంచ దేశాలను శాసిస్తున్న ప్రతీ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్‌మెంట్ తమ వద్దే జరగాలని కోరుకుంటోంది. అందుకే అదే దిశగా అడుగులు వేస్తూ అమెరికాకు టార్గెట్‌గా మారింది. స్పేస్ టెక్నాలజీలో కూడా పలు సాహసాలు చేయడానికి చైనా సిద్ధమవుతోంది. తాజాగా వెరీ లో ఎర్త్ ఆర్బిట్‌లోకి తమ మొదటి శాటిలైట్‌ను పంపించడానికి చైనా సిద్ధపడినట్టు తెలుస్తోంది.

- Advertisement -

చైనా.. ప్రస్తుతం స్పేస్ టెక్నాలజీలో కూడా దూకుడుగా వ్యవహరిస్తోంది. తమ దగ్గర ఉన్న వనరులతోనే ఎవరి సాయం లేకుండా రాకెట్లను, శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని చాలా ప్రయత్నాలు చేస్తోంది. కానీ మొదటిసారిగా వెరీ లో ఎర్త్ ఆర్బిట్‌లోకి శాటిలైట్‌ను పంపాలని చైనా సన్నాహాలు మొదలుపెట్టింది. ఈ విషయాన్ని స్వయంగా చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ (కాసిక్).. ఆ దేశ మీడియాకు ప్రకటించింది. వెరీ లో ఎర్త్ ఆర్బిట్ (వ్లియో)లోకి తమ మొదటి శాటిలైట్‌ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనున్నామని తెలిపింది.

- Advertisement -

మామూలుగా వ్లియో శాటిలైట్లు భూమికి 150 నుండి 300 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణిస్తూ ఉంటాయి. ఇవి మిగతా శాటిలైట్లతో పోలిస్తే చాలా తక్కువ. మిగతా వాటితో పోలిస్తే వ్లియో శాటిలైట్లకు చాలా తక్కువ పవర్ అవసరం అవుతుంది. అందుకే తమ మొదటి వ్లియో శాటిలైట్ లాంచ్ కోసం కాసిక్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఎన్నో అడ్వాన్స్ టెక్నాలజీతో ఈ శాటిలైట్‌ను తయారు చేయనుంది. అల్ట్రా లో ఆర్బిట్ ఫ్లైట్ టెక్నాలజీ, హై రెజల్యూషన్ గ్రౌండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, ఆన్‌బోర్డ్ ఇంటలిజెంట్ ప్రాసెసింగ్ అండ్ డేటా ట్రాన్స్‌మిషన్ టెక్నాలజీ లాంటివి ఈ వ్లియో శాటిలైట్‌లో ఉండనున్నట్టు తెలుస్తోంది.

చైనాకు చెందిన ఈ వ్లియో శాటిలైట్లు ఎంతకాలం పాటు అంతరిక్షంలో ఎగరనున్నాయి అనే విషయాలను కాసిక్ ఇంకా బయటపెట్టలేదు. మామూలుగా చైనాలో పెద్ద పెద్ద స్పేస్ కాంట్రాక్ట్స్ అన్ని కాస్క్ చూసుకుంటోంది. అలా కాకుండా చిన్న ప్రాజెక్ట్స్ కోసం ప్రత్యేకంగా కాసిక్ అనే సంస్థను తయారు చేసింది. తమ వద్దక వచ్చిన ప్రాజెక్ట్స్‌ను కమర్షియల్‌గా పెంచుకుంటూ కాసిక్ కూడా బాగానే ముందుకెళ్తోంది. వ్లియో శాటిలైట్ లాంచ్‌తో కాసిక్ మరిన్ని ప్రాజెక్ట్స్‌ను అందుకునే అవకాశం ఉందని అక్కడి ప్రజలు అంచనా వేస్తున్నారు.

కొత్తగా స్మార్ట్ బ్యాండేజ్.. ప్రత్యేకంగా వారికోసమే..

for more updates follow this link:-Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News