Dog Viral Video: సోషల్ మీడియా ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడేం జరిగిన ఇట్టే తెలిసిపోతుంది. ముఖ్యంగా కామెడీ వీడియోలు, పాముల వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. నెటిజన్లు కూడా వీటిని చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వైరల్ వీడియోలకు మిలియన్ కొద్ది వ్యూస్ వస్తున్నాయి. లక్షల్లో లైకులు, వేలల్లో కామెంట్లు చేస్తున్నారు. తాజాగా ముంబై వీధుల్లో జరిగిన ఓ ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వీధి కుక్క చాలా ఖరీదైన లంబోర్గినీ హురాకాన్ అనే కారును అడ్డుకుని రోడ్డుకు నేనేరా బాస్ అంటూ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. దీన్ని చూసిన నెటిజన్లు కాసేపు నవ్వుకోక తప్పదు. వీడియో కూడా మస్త్ షేర్ అవుతోంది. మరీ వీడియో ఆ రేంజ్ లో ఉంది. ఈ సంఘటకు సంబంధించిన పూర్తి వివరాలను చూసేద్దాం.
ఇదిగో వీడియో..
Kalesh b/w Sir Dogesh and Lamborghini
pic.twitter.com/EbgnzoErvI
— Ghar Ke Kalesh (@gharkekalesh) July 15, 2025
ముంబైలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక వీధి కుక్క, లంబోర్గినీ హురాకాన్ అనే ఖరీదైన సూపర్‌కార్‌ను అడ్డుకుని, రోడ్డుపై తన ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ వీడియోలో.. ఒక ఆరెంజ్ రంగు లంబోర్గినీ రోడ్డుపై వస్తుండగా, ఒక వీధి కుక్క ధైర్యంగా ముందుకు వచ్చి కారును అడ్డుకుంది. డ్రైవర్ కుక్కను తప్పించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఆ కుక్క మాత్రం బెదరకుండా గట్టిగా మొరిగి, కారును వెంబడించింది. చివరకు, డ్రైవర్ కారును సైడ్‌కు తిప్పి వేగంగా వెళ్లిపోయాడు. కానీ కుక్క మాత్రం దానిని కొంతదూరం వెంబడించడం వీడియోలో కనిపిస్తుంది. దీంతో వీడియో సోషల్ మీడియాలో తెగ ఇంట్రెస్టింగ్ గా మారింది.
మామూలు డోగేష్ భాయ్ కాదు నువ్వు..
ఈ వీడియోను చూసిన నెటిజన్లుల ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. కొంత మంది నెటిజన్లు ఈ కుక్కను సరదాగా ‘డోగేష్ భాయ్’ అని కామెంట్ చేస్తు్న్నారు. మరి కొంత మంది ‘ఈ రోడ్డుకు ఆ కుక్కనే బాస్’ అని రాసుకొచ్చారు. మరో నెటిజన్ అయితే ఇలా రాశాడు. ‘డోగేష్ భాయ్ కి ఇంత పెద్ద వాళ్లకు పోటీగా వెళ్తున్నాడు’ అని చమత్కారంగా కామెంట్ చేశాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో ఇప్పటివరకు 6లక్షల మంది చూశారు. కామెంట్, లైకులు కూడా వేలల్లో వస్తున్నాయి.
ఈ హాస్యాస్పదమైన సంఘటన ముంబై వీధుల్లో వీధి కుక్కల ఆధిపత్యాన్ని చాటడమే కాక.. భారతదేశంలో వీధి కుక్కల సమస్యపై కూడా చర్చకు దారితీసింది. 2023లోని స్టేట్ ఆఫ్ పెట్ హోమ్‌లెస్‌నెస్ ఇండెక్స్ ప్రకారం, భారతదేశంలో సుమారు 6.2 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కల వల్లే దేశంలో 62% యాక్సిడెంట్లకు కారణమవుతున్నాయని ఒక నివేదిక తెలిపింది. అయినప్పటికీ, ఈ వీడియో హాస్యాన్ని అందించడంతో పాటు, వీధి కుక్కల ధైర్యాన్ని.. వాటి పట్ల సమాజంలోని కొందరి ఆప్యాయతను కూడా హైలైట్ చేసింది. మీరు నవ్వుకోవాలంటే.. వీడియోను మరోసారి చూడండి.. నవ్వేసేయండి..
ALSO READ: Heavy rain: హైదరాబాద్‌ను కమ్మేసిన క్యుములోనింబస్ మేఘాలు.. ఈ ప్రాంతాల్లో అతిభారీ వర్షం