BigTV English

Singer Kankavva: కష్టాల కడలిలో సింగర్ కనకవ్వ.. ఇన్ని ఇబ్బందులు పడిందా?

Singer Kankavva: కష్టాల కడలిలో సింగర్ కనకవ్వ.. ఇన్ని ఇబ్బందులు పడిందా?

Singer Kankavva: ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్, (Folk Songs)ఫోక్ డాన్స్ ఇష్టపడే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. అలాగే ఫోక్ సింగర్స్ (Folk Singers)కూడా ఇటీవల కాలంలో ఎంతో మంచి సక్సెస్ అందుకుంటున్నారు. ఇలా మారుమూల పల్లెలో పొలం పనులు చేసుకుంటూ ఎంతో టాలెంట్ ఉన్నప్పటికీ , తమ టాలెంట్ బయట పెట్టడానికి సరైన వేదిక లేక ఎంతో మంది ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. ఇలా మారుమూల పల్లె నుంచి అద్భుతమైన పాటలను ఆలపిస్తూ ఇండస్ట్రీలో మంచి సక్సెస్ అందుకున్న వారిలో ఫోక్ సింగర్ కనకవ్వ (Kanakavva)ఒకరు. “నర్సపల్లె”(Narsapalle) అనే పాట ఎంతో ఫేమస్ అయిన కనకవ్వ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ఫోక్ సాంగ్స్ పాడుతూ బిజీగా ఉన్నారు.


చిన్నతనంలోనే పాటలపై ఆసక్తి…

ఇలా ఎన్నో టీవీ షోలో వేదికలపై ఈమె తన అద్భుతమైన గాత్రంతో పాటలు ఆలపిస్తూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా కనకవ్వ “బిగ్ టీవీ” (Big tv)నిర్వహించిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఎన్నో విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా కనకవ్వ మాట్లాడుతూ తాను చిన్న వయసులోనే పాటలపై ఎంతో ఆసక్తితో పాటలు పాడేదాన్ని అయితే కొంచెం పెద్దగైన తర్వాత పెళ్లి చేసే అత్తారింటికి పంపించారని తెలిపారు. ఇక అత్తారింట్లో పొలం పనులు ఇంటి పనులు చూసుకుంటూ ఉండే వాళ్ళమని తెలిపారు.


వీధుల వెంట పండ్లు అమ్ముకొని…

ఇక ప్రతిరోజు తాను కొండకు వెళ్లి పండ్లను కోసుకొచ్చి నెత్తిన గంపలో ఆ పండ్లు పెట్టుకొని వీధి వీధి తిరుగుతూ పండ్లు అమ్ముకుంటూ జీవితం గడిపానని తన కష్టాల గురించి తెలిపారు. అయితే చిన్నప్పటినుంచి తన అవ్వ దగ్గర పాటలు నేర్చుకున్నానని తన అవ్వ కారణంగానే తాను పాటలు పాడగలిగానని కనకవ్వ తెలిపారు. ఇలా పాటలపై మంచి పట్టు ఉన్న నేపథ్యంలోనే ఇప్పుడు పాడగలుగుతున్నానని వెల్లడించారు. ఇక మొదటిసారి ఒక కార్యక్రమంలో పాట పాడమని చెప్పినప్పుడు చాలా భయపడిపోయానని ఇప్పుడు అలవాటైందని కనకవ్వ వెల్లడించారు.

ఇకపోతే నాకు చదువు రాదు.. నేను చిన్నప్పుడు నేర్చుకున్న పాటలు ఎప్పుడూ ఎలా పాడమన్నా పాడుతాను కానీ, ఎవరైనా రాసిన పాటలు పాడమంటే పాడలేనని కనకవ్వ తెలియచేశారు. మరి ఎవరైనా కొత్తగా రాసిన పాటలను ఎలా పాడుతావు? అంటూ ఈమెకు ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు కనకవ్వ సమాధానం చెబుతూ పాట పాడేటప్పుడు చెవులకు అదేదో (హెడ్ ఫోన్స్)పెట్టుకోమని ఒకటి ఇస్తారు కదా.. అది పెట్టుకొని అందులో పాట వచ్చిన తర్వాత దానినే నేను పాడుతాను అంటూ ఈ సందర్భంగా కనకవ్వ తెలిపారు. ఇలాంటివి చూసినప్పుడే నేను కూడా చదువుకొని ఉంటే బాగుండేది అనిపిస్తుందని కనకవ్వ తెలియచేశారు. ఏది ఏమైనా ఎక్కడో మారుమూల పల్లెల్లో పనులు చేసుకుంటూ ఉండే కనకవ్వ తన టాలెంట్ తో ఇప్పుడు సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారని చెప్పాలి.

Also Read: Lasya Smily: శేఖర్ వైరస్ మాస్టర్ నిజస్వరూపం ఇదే.. హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన లాస్య స్మైలీ!

Related News

Poster Talk Septmber : ఆగస్టు ఆగం అయింది… మరి సెప్టెంబర్ సేవ్ చేస్తుందా ?

Big Tv Folk Night: స్టేజ్ కాదు ఇల్లు దద్దరిల్లే టైం వచ్చింది.. ఫుల్ ఎపిసోడ్ ఆరోజే!

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Big Stories

×