BigTV English

Robotics Sector:పదేళ్లలో 2 లక్షల రోబోల తయారీ..! దుబాయ్ టార్గెట్..

Robotics Sector:పదేళ్లలో 2 లక్షల రోబోల తయారీ..! దుబాయ్ టార్గెట్..

Robotics Sector:టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిన తర్వాత ఏ పరిశోధనల్లో పెట్టుబడి పెడితే లాభం వస్తుంది అనే విషయంపై ప్రైవేట్ సంస్థలే కాదు.. ప్రభుత్వాలు కూడా ఆలోచించడం మొదలుపెట్టాయి. అందులో ఒకటే రోబోటిక్స్. రోబోటిక్స్, ఆటోమేషన్ రంగాలలో గత కొన్నాళ్లుగా బిలియన్ డాలర్ల పెట్టుబడులు జరుగుతున్నాయి. అందుకే దుబాయ్ కూడా ఈ రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టింది.


ఇప్పటికే దుబాయ్ అనేది ఇతర దేశాల కంటే టెక్నాలజీ విషయంలో చాలా ముందంజలో ఉంది. మ్యూజియం ఆఫ్ ఫ్యూచర్ పేరుతో దుబాయ్ చేసిన కొత్త అన్వేషణ అందరినీ ఆకట్టుకుంటోంది. దాని కారణంగా దుబాయ్ టూరిజం కూడా లాభాల్లో నడుస్తోంది. అందుకే రోబోటిక్స్, ఆటోమేషన్‌లో కూడా పెట్టుబడులు పెట్టి తమ జీడీపీని వచ్చే 10 ఏళ్లలో 9 శాతం పెంచుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

రోబోటిక్స్‌లో ఒక వరల్డ్ క్లాస్ ఎకోసిస్టమ్‌ను తయారు చేయాలని దుబాయ్ ఆలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇందులో దుబాయ్ ప్రభుత్వం కీలక పాత్ర పోషించనుంది. ఇందులో భాగంగానే దుబాయ్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ప్రోగ్రామ్, ఎమిరేట్స్ రోబోటిక్స్ కాంపిటీషన్, రోబో డే ఈవెంట్ వంటి కార్యక్రమాలను తాజాగా నిర్వహించారు. రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ విషయంలో దుబాయ్‌ను ప్రపంచంలోనే టాప్ 10 సిటీగా నిలబెట్టాలని వారు ఆలోచిస్తున్నట్టుగా సమాచారం.


ఆర్ అండ్ ఏ అప్లేకేషన్స్ విషయంలో ప్రపంచ దేశాల చూపు దుబాయ్‌పైనే ఉండేలా నిపుణులు ప్లాన్ చేస్తున్నారు. కొత్త కొత్త ఐడియాలతో, ఇన్నోవేషన్స్‌తో రోబోటిక్స్ రంగాన్ని ముందుకు నడిపించాలని వారు అనుకుంటున్నారు. ఇతర రంగాల్లో కూడా రోబోటిక్స్ వినియోగాన్ని పెంచి క్లాలిటీ ఆఫ్ లైఫ్‌ను మెరుగుపరచడాన్నే దుబాయ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దాంతో పాటు టూరిజం, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో కూడా రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను మెరుగుపరిచే దిశగా దుబాయ్ అడుగులు వేస్తోంది.

దూబాయ్ ఆర్ అండ్ ఏ ప్రోగ్రామ్‌లో భాగంగా వచ్చే పదేళ్లలో 2,00,000 రోబోలను తయారు చేసి అన్ని రంగాలలో సర్వీసులను అందించాలని పరిశోధకులు భావిస్తున్నారు. దీని వల్ల దుబాయ్‌కు ఎకానమీ పేరిగేలా సన్నాహాలు చేస్తున్నారు. ఎంతోమంది నిపుణులు, ఇంజనీర్లు ఉన్న దుబాయ్ ఫ్యూచర్ ల్యాబ్స్ ప్రభుత్వానికి మద్దతుగా పనిచేయనుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీని మెరుగుపరుస్తూ దుబాయ్‌ను ముందుగా తీసుకెళ్లడానికి ఫ్యూచర్ ల్యాబ్స్ సహాయపడనుంది.

Tags

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×