BigTV English

File Transfer Ban in China: చైనాలో ఫైల్ ట్రాన్స్‌ఫర్ నిషేధం.. స్మార్ట్ ఫోన్స్‌లో..

File Transfer Ban in China: చైనాలో ఫైల్ ట్రాన్స్‌ఫర్ నిషేధం.. స్మార్ట్ ఫోన్స్‌లో..

File Transfer Ban in China : కృత్రిమ మేధస్సు అనేది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. దాని సామర్థ్యంతో తయారైన చాట్‌జీపీటీ కూడా అన్ని రంగాల్లో తన సత్తాను చాటుకుంటోంది. అయినా కూడా చాట్‌జీపీటీ వల్ల మంచి జరగదు అని పలు టెక్ దిగ్గజ సంస్థలు, అభివృద్ధి చెందిన దేశాలు సైతం వీటిని వినియోగించడం నిషేధించారు. ఇప్పటికీ పలు దేశాల్లో చాట్‌జీపీటీపై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. అదే విధంగా ఇంటర్నెట్ సర్వీసుల విషయంలో చైనా కూడా ప్రజలపై ఆంక్షలు విధిస్తోంది.


స్మార్ట్ ఫోన్స్‌లో ఫైల్ ట్రాన్స్‌ఫర్ కోసం అనేక యాప్స్ అందుబాటులో ఉంటాయి. యాప్స్ కాకపోయినా.. ఈ ఫోన్లలో కొన్ని ఫీచర్లు ఫైల్స్‌ను ట్రాన్స్‌ఫర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తాయి. అలాంటి వాటికి ఉదాహరణే యాపిల్ ఎయిర్ డ్రాప్, గూగుల్ ఫైల్స్. ఇప్పుడు ఇలాంటి ఫైల్ ట్రాన్స్‌ఫర్ ఫీచర్ల వల్ల చైనా ప్రభుత్వానికే ప్రమాదం ఉందని అక్కడి అధికారులు భావిస్తున్నారు. ఇలాంటి ఫైల్ ట్రాన్స్‌ఫర్ యాప్స్‌ను ఉపయోగించడం నేషనల్ సెక్యూరిటీ థ్రెట్‌కు దారితీస్తుందని అనుకుంటున్నారు. అందుకే ప్రజలపై ఆంక్షలు విధించడానికి వెనకాడడం లేదు.

ఈరోజుల్లో ఏ సమాచారాన్ని షేర్ చేసుకోవాలన్నా స్మార్ట్ ఫోన్స్‌లో అనేక ఆప్షన్స్ ఉంటున్నాయి. అలాగే డేటా ట్రాన్స్‌ఫర్ కోసం కూడా అనేక ఆప్షన్స్ ఉన్నాయి. అందులో ఎయిర్ డ్రాప్, గూగుల్ ఫైల్స్ కూడా ఒకటి. కానీ ఇలాంటి వాటి వల్ల చైనాకు సంబంధించిన సున్నితమైన సమాచారం దేశం దాటి బయటికి వెళుతుందని ప్రభుత్వం అనుమానిస్తోంది. ఇది కొంతవరకు నిజమే అయినా.. ప్రజలు అందరిపై ఇలాంటి ఆంక్షలు విధించడం వారిని కాస్త నిరాశకు గురిచేస్తోంది. కానీ చైనా పద్ధుతులు తెలిసిన మిగిలిన దేశాలు ముందు నుండి ఆ దేశం అంతే కదా అని విమర్శలు మొదలుపెట్టారు.


ఫైల్ ట్రాన్స్‌ఫర్‌కు సంబంధించిన యాప్స్‌ను నిషేధించాలని చైనా ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. దీనికి సంబంధించిన ఏ చర్యా తీసుకోలేదు. చైనాకు చెందిన సైబర్ సెక్యూరిటీ డిపార్ట్‌మెంట్ అనేది దీనికి సంబంధించి ఒక డ్రాఫ్ట్‌ను ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం ఈ విషయంలో త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇది అందరి ప్రజలపై ఒక ఆంక్ష లాగా ఉండిపోయినా కూడా దీనిని మీరడానికి ఎటువంటి అవకాశం ఉండదని నిపుణులు అంటున్నారు. ఒకవేళ మీరినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వారు భావిస్తున్నారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×