Clarity From Whatsapp : మంగళవారం వాట్సప్ సేవలు గంటన్నరకు పైగా నిలిచిపోవడంపై.. భారత ప్రభుత్వం ఆ సంస్థను వివరణ కోరింది. సేవల్లో ఎందుకు అంతరాయం ఏర్పడిందో కారణాలు చెప్పాలని వాట్సప్ కు సూచించింది. సాంకేతిక సమస్యల వల్ల అంతరాయం ఏర్పడిందా? సైబర్ ఎటాక్ ఏమైనా జరిగిందా? అన్న వివరాలు చెప్పాలంటూ… వాట్సప్ నుంచి ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ వివరణ కోరింది. భారత్‌కు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తో సమన్వయం చేసుకుంటూ… సేవల్లో అంతరాయానికి గల కారణాలను కనిపెట్టాలని వాట్సప్ కు సూచించింది. వారంలోగా నివేదిక సమర్పించాలని వాట్సప్ ను ఆదేశించింది…. ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.
గత మంగళవారం భారత్ సహా అనేక దేశాల్లో వాట్సప్ సేవలు నిలిచిపోయాయి. వాట్సప్‌లో పంపిన మెసేజ్‌ల డెలివరీ స్టేటస్ చూపించకపోవడంతో పాటు… డబుల్ టిక్, బ్లూ టిక్ మార్కులు కనిపించలేదు. దీంతో మెసేజ్ వెళ్లిందా? లేదా? అని యూజర్లు గందరగోళానికి గురయ్యారు. సమస్యను గుర్తించిన వెంటనే వేల మంది యూజర్లు వెబ్‌సైట్‌లో ఫిర్యాదులు చేశారు. మెసేజ్‌లు పంపడంలో సమస్యలు ఎదుర్కొన్నామని కొందరు… సర్వర్ సంబంధిత సమస్యలు ఉన్నాయని మరికొందరు… బ్లూ టిక్ కనిపించడం లేదని ఇంకొందరు ఫిర్యాదుల్లో రాసుకొచ్చారు. సుమారు గంటన్నర తర్వాత సమస్య పరిష్కారమైంది. ఇంతకుముందు కూడా వాట్సాప్ సేవల్లో చాలాసార్లు అంతరాయం ఏర్పడినా… ఈ స్థాయిలో సమస్య తలెత్తడం ఇదే తొలిసారి. యూజర్లకు కలిగిన అసౌకర్యానికి వాట్సప్ క్షమాపణ చెప్పినా… అంతరాయానికి కారణాలను మాత్రం వెల్లడించలేదు. దాంతో… వల్లో అంతరాయానికి కారణాలేంటో చెప్పాలని వాట్సప్‌ను ఆదేశించింది… ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ.