HIT 4 Movie Story : నాని తన ఎంటైర్ కెరీర్‌లో ఫస్ట్ టైం బ్లడ్ బాత్ మూవీ చేశాడు. అదే హిట్ 3. అవుట్ అండ్ అవుట్ వయోలెన్స్ మూవీగా వచ్చిన హిట్ 3 బాక్సాఫీస్ దగ్గర ప్రస్తుతానికి మంచి ఫర్మామెన్స్ ఇస్తుంది. రెండు రోజుల్లోనే 63 కోట్లు కలెక్ట్ చేసినట్టు నిర్మాతలు పోస్టర్ అయితే వదిలారు. ఇదింత పక్కన పెడితే.. హిట్ 3లో తమిళ హీరో కార్తీ స్పెషల్ పాత్రలో కనిపించిన సంగతి అందరికీ తెలిసిందే. హిట్ ఫ్రాంచైజీలో వచ్చే హిట్ 4లో హీరో కార్తీనే అనే క్లారిటీ కూడా వచ్చింది. అయితే.. హిట్ 4ను చేయడానికి కార్తీ ఒప్పుకోవడానికి కారణం ఏంటో మీకు తెలుసా..?
హిట్ ఫాంచైజీని డైరెక్టర్ శేలేష్ కొలను సక్సెస్‌ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నాడు. హిట్ 1 నుంచి మొదలు పెడితే రిసెంట్‌గా వచ్చిన హిట్ 3 వరకు అన్నీ కూడా సక్సెసే అని చెప్పొచ్చు. ఇప్పుడు హిట్ 4 కూడా రాబోతుంది. దీనిలో తమిళ నటుడు కార్తీ హీరోగా రాబోతున్నాడు. ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీ కనిపించబోతున్నాడు. నిజానికి హిట్ 3 లో కార్తీ గెస్ట్ రోల్ అని, హిట్ 4లో హీరో కార్తీనే అని గాసిప్స్ వచ్చాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ గాసిప్స్ నిజమయ్యాయి.
అసలు కథే లేదు..
ఇదింత పక్కన పెడితే… హిట్ 4ని కార్తీ ఒప్పుకోవడానికి పెద్దగా కారణాలేమీ లేవట. ఇంకా పర్టికూలర్‌గా చెప్పాలంటే… హిట్ 4 కథ ఏంటో కూడా కార్తీకి తెలియదట. ఇంకా చెప్పాలంటే… డైరెక్టర్ శైలేష్ అసలు ఇంకా కథనే ప్రిపేర్ చేయలేదట. త్వరలోనే శైలేష్ సిడ్నీకి వెళ్తున్నారట. అక్కడే 6 నెలల పాటు ఉండి.. హిట్ 4 కథను రెడీ చేయబోతున్నాట.
కథే లేకుండా కార్తీ ఎలా ఒప్పుకున్నాడు..?
అవును.. ఇప్పటి వరకు హిట్ 4 కథే లేదు. డైరెక్టర్ శైలేష్ కొలను ఇంకా ఆ హిట్ 4 కథను రెడీ చేయలేదు. ఓ చిన్న లైన్ మాత్రమే కార్తీకి చెప్పాడట. అంతే.. అంతుకు మంచి… స్టోరీ గురించి కార్తీకి ఎలాంటి క్లూ లేదని సమాచారం. అయినా కార్తీ ఎందుకు ఈ సినిమాను ఒప్పుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయట.
కార్తీకి స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలని అనేది చాలా రోజుల నుంచి ఉండిపోయిన కోరిక. గతంలో నాగార్జునతో ఊపిరి అనే సినిమా చేశాడు. దీని తర్వాత కార్తీ మళ్లీ స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయలేదు. ఇప్పుడు హిట్ ఫ్రాంచైజీ నుంచి ఆ అవకాశం వచ్చింది. పైగా దీనికి నాని ప్రొడ్యూసర్. నాని అప్రొచ్ అవ్వడంతో… కార్తీ కాదనలేదు. పైగా తనకు స్ట్రెయిట్ తెలుగు మూవీ చేయాలి అనే కోరిక కూడా ఉంది. అలా… హిట్ 4 ఫుల్ స్టోరీ తెలియకపోయినా… కార్తీ ఆ సినిమాను ఒప్పుకున్నాడని సమాచారం.