Common Travel Pass: హైదరాబాద్ సిటీ ప్రయాణికులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ చెప్పింది. మెట్రో రైల్, ఆర్టీసీ బస్సులకు కలిపి కామన్ పాస్‌లను తెలంగాఱ ప్రభుత్వం తీసుకువచ్చింది. దంతో రేపు అధికారికంగా డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రారంభించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఆర్టీసీ బస్ – మెట్రో రైల్ కలిపి రోజు వారి నెల వారి పాసులు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆర్టీసీ మెట్రో రైల్ జాయింట్ పాస్‌తో ఆర్టీసీ బస్సు, మెట్రో రైల్‌లో ప్రయాణించే సదుపాయంను తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకురానుంది. రోజు వారి పాస్ 400, నెల వారి పాస్ 8500గా ప్రభుత్వం ఖరారు చేసింది. ఇందుకుగాను ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో ఆన్లైన్ టికెటింగ్‌ను ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఫిజికల్ టికెట్ అవసరం లేకుండా మొబైల్ లోనే టికెట్ పొందే సదుపాయంను ప్రభుత్వం కల్పించింది. దీంతో పాటుగా వారం రోజుల పాస్‌ను సైతం ఆర్టీసీ తీసుకోచ్చింది. దీంతో మీ టికెట్ యాప్ ద్వారా మొబైల్ లోనే రోజు వారి టికెట్, డే పాస్, వారం రోజుల బస్ పాస్, నెల వారి బస్ పాస్ పొందే సదుపాయంను కల్పించారు. అప్ గ్రేడ్ చేసిన మీ టికెట్‌ను రేపు ప్రారంభించనున్న ప్రభుత్వ అధికారుల ఆర్టీసీ అధికారుల తెలిపారు.
Also read: బీసీలను మోసం చేయడానికి చంద్రబాబు కొత్త డ్రామా: బోత్స సత్యనారాయణ!