Idhayam Murali: మ్యూజిక్ డైరెక్టర్ ss థమన్.. ఇప్పుడు నందమూరి థమన్ గా మారిపోయాడు. బాలకృష్ణకు ఆస్థాన సంగీత దర్శకుడిగా మారిపోవడంతో ఆయనకు నందమూరి అనే ఇంటిపేరునే ఇచ్చేశారు ఫ్యాన్స్. ప్రస్తుతం తెలుగులో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న థమన్.. నటుడిగా కూడా ఒక సినిమా చేశాడన్న సంగతి తెల్సిందే. స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాయ్స్. సిద్దార్థ్, జెనీలియా జంటగా నటించిన ఈ చిత్రంలో నలుగురు ఫ్రెండ్స్ లో థమన్ ఒకడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఇక బాయ్స్ తరువాత థమన్ మ్యూజిక్ మీద ఫోకస్ పెట్టి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యాడు.
చాలా గ్యాప్ తరువాత థమన్ మళ్లీ వెండితెరపై సందడి చేయడానికి రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ స్టార్ హీరో అధర్వ హీరోగా నటిసున్న చిత్రం ఇదయం మురళి. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రీతి ముకుందన్, కాయాదు, నట్టి, థమన్ ఎస్, నిహారిక NM, రక్షణ్ నటిస్తున్నారు. ఇది కూడా ముగ్గురు ఫ్రెండ్స్ కథలా కనిపిస్తుంది. ఇందులో ఒక ఫ్రెండ్ గా థమన్ నటిస్తున్నాడు.
తాజాగా ఈ సినిమా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రపంచంలోనే మొదటి ఎమోషన్ ఏంటి.. కచ్చితంగా ప్రేమనే అని అధర్వ వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. 2012 వాలెంటైన్స్ డే.. అథర్వ, థమన్, రక్షణ్ ముగ్గురు స్నేహితులు. నిహారికను థమన్ ప్రేమిస్తాడు. ఎప్పటినుంచో ఆమెకు ప్రపోజ్ చేయాలనీ చూస్తూ ఉంటాది. ఇక ప్రేమికుల రోజు కావడంతో ఒక రింగ్ తీసుకొని ప్రపోజ్ చేయడానికి వెళ్తుండగా.. అథర్వ ఆపి.. ఇలా ఇస్తే కిక్ ఏముంటుంది అని.. వాళ్లు తినే ఐస్ క్రీమ్ లో ఆ రింగ్ ను పెట్టి పంపిస్తాడు.
Manchu Manoj: జాతి పేరు చెప్పుకోని మార్కెట్లో అమ్ముడుపోను.. నన్ను తొక్కడం వారివల్లే అవుతుంది
ఇక నిహారిక పక్కనే ఉన్నా కాయాదును అథర్వ లవ్ చేస్తూ ఉంటాడు. నిహారిక ఐస్ క్రీమ్ మొత్తం తినేస్తుంది కానీ రింగ్ కనిపించదు. దీంతో ఆ సస్పెన్స్ తట్టుకోలేక థమన్ నేరుగా వెళ్లి ప్రపోజ్ చేస్తాడు. ఆమె ఓకే అంటుంది. అయితే అథర్వ మాత్రం తన ప్రేమను చెప్పలేకపోతాడు. కట్ చేస్తే.. 2025లో అథర్వ అమెరికాలో ఉంటాడు. అతడికి మరికొద్దిసేపటిలో పెళ్లి. ఇంటి నుంచి మామయ్య కాల్ చేసి రమ్మని పోరు పెడుతుంటాడు. కానీ, ఆ పెళ్లి అతనికి ఇష్టం లేదన్నట్లు చూపించారు.
ఇక అమెరికా నుంచి ఇండియా వచ్చిన అథర్వ ఎవరిని పెళ్లాడతాడు.. ? అనేది సినిమా కథ. వరల్డ్ బెస్ట్ లవర్ అంటే ఎంతోమంది పేర్లు చెప్తారు. కానీ వరల్డ్ బెస్ట్ లవర్ అంటే మురళీ అని చెప్పగానే టైటిల్ ను చూపించారు. జూన్ జులై లో ఈ సినిమా రిలీజ్ కానుందని తెలిపారు. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో థమన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.