భారతీయులు ఘనం జరుపుకునే రెండు పండుగలు త్వరలో రాబోతున్నాయి. సెప్టెంబర్ 22న దేవీ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కాబోతున్నాయి. అక్టోబర్ 2న దసరా పండుగల జరగనుంది. అక్టోబర్ 20న దీపావళికి యావత్ దేశం రెడీ అవుతోంది. పిల్లలకు సుమారు 10 రోజుల పాటు సెలవులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో చాలా మంది కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ పండుగల సీజన్ లో ఎక్కువ మంది భారతీయులు వెళ్లాలని ప్లాన్ చేసుకున్న పలు దేశీయ, విదేశీయ పర్యాటక ప్రదేశాల గురించి Booking.com కీలక డేటా వెల్లడించింది. ప్రయాణీకులలో మూడింట ఒక వంతు మంది నిర్దిష్ట పండుగలు ఎక్కువగా జరుపుకునే ప్రాంతాలకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలిపింది.
71% మంది దసరా, దీపావళి పండుగలు ఘనంగా జరుపుకునే ప్రత్యేకమైన సాంస్కృతిక బ్యాగ్రౌండ్ ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు మొగ్గుచూపుతున్నారు. 59% మంది భిన్నమైన సంస్కృతిని అనుభవించడానికి ప్రయాణించాలని చూస్తున్నారు. స్థానిక పండుగలను అన్వేషించడానికి 56% ఆసక్తి చూపుతున్నారు. సంస్కృతులు, సంప్రదాయాలు, ప్రజలను కలిపే మార్గంగా పండుగ ప్రయాణాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. భారతీయులు ఈ సీజన్ ను ఎక్కువగా సాంస్కృతిక పరమైన ప్రాముఖ్యతను ఇచ్చేందుకు ఇష్టపడుతున్నారు.
Booking.com డేటా ప్రకారం, చాలా మంది సంస్కృతి, సుందరమైన గమ్యస్థానాలకు ప్రసిద్ధి అయిన రాజస్థాన్ కు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. పండుగ సీజన్ లో చాలా మంది పర్యాటకులు తమ ఫస్ట్ ఆప్షన్ గా రాజస్థాన్ ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ సంవత్సరం పండుగ ప్రయాణానికి ట్రెండ్ అవుతున్న నగరాలు, ప్రదేశాలను పరిశీలిస్తే.. పర్యాటకుల సెర్చ్ లిస్టులో ఉదయపూర్ ఏకంగా 110 శాతంతో టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక టాప్ 5 నగరాల్లో జైపూర్, డార్జిలింగ్, గోవా, వారణాసి, మున్నార్, ఊటీ, వర్కల, ఋషికేశ్ ఉన్నాయి. బృందావన్ లో గణనీయమైన పెరుగుదల కనిపించింది. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వసతికి సంబంధించిన సెర్చింగ్ ఏకంగా 150% పెరిగింది.
Read Also: ఐస్ క్రీమ్ అనకూడదా? ఇంగ్లీష్ పదాలపై కిమ్ మామ ఆంక్షలు, ఆ పదాలన్నీ బ్యాన్!
ఇక పండుగ సీజన్ లో ఎక్కువ మంది భారతీయులు పలు అంతర్జాతీయ డెస్టినేషన్స్ ను కూడా ఇష్టపడుతున్నారు. వాటిలో దుబాయ్ టాప్ ప్లేస్ లో నిలిచింది. ఆ తర్వాత స్థానంలో సింగపూర్, టోక్యో, బ్యాంకాక్, ఒసాకా, ఫుకెట్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి.
Read Also: ఇండియన్ రైల్ ఎక్కిన కెనడా అమ్మాయి.. రైల్వే గురించి ఆమె చెప్పింది వింటే ఫ్యూజులు అవుట్!