BigTV English
Advertisement

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు

Coffee face mask: కాఫీ పొడితో ఈ ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మంపై ఉన్న టాన్ మొత్తం పోతుంది, మెరిసిపోతారు
కాలుష్యం వల్ల చర్మంపై మురికి పేరుకు పోతుంది. దీన్నే టాన్ అంటారు. ఆ టాన్ తొలగించుకుంటేనే అసలైన మెరుపు కనిపించేది.  ముఖం ఉబ్బినట్టుగా, చర్మం పేలవంగా అనిపిస్తున్నా కాఫీ మాస్క్ ను ఒకసారి వేసుకొని చూడండి. ఈ ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల మీ చర్మంపై ఉన్న మృత కణాలు మురికి, దుమ్ము, ధూళి అన్నీ తొలగిపోతాయి. అసలైన మెరుపు మీ చర్మానికి వస్తుంది. ఇక్కడ మేము కాఫీ పొడితో కాఫీ స్క్రబ్ ఎలా తయారు చేయాలో ఇచ్చాము. దీన్ని స్క్రబ్ గానే కాదు, ఫేస్ మాస్క్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.
కాఫీ ఫేస్ మాస్క్ తయారీ
కాఫీ పొడిని ఒక రెండు స్పూన్లు తీసుకొని మెత్తగా దంచుకోండి. ఆ కాఫీ పొడిని ఒక గిన్నెలో వేయండి. ఆ గిన్నెలోనే ఒకటిన్నర స్పూను బ్రౌన్ షుగర్, ఒక స్పూను ఆలివ్ నూనె, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ పాలు పోసి పేస్టులాగా కలుపుకోండి. దీన్ని ముఖానికి అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉండండి. 20 నిమిషాల పాటు అలా మసాజ్ చేసుకోండి. ఆపైన చల్లని నీటితో వాష్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చర్మంపై ఉన్న మృతకణాలన్నీ తొలగిపోతాయి. మీ ముఖం మెరుస్తూ కనిపిస్తుంది. చర్మంపై ఉన్న మురికి అంతా తొలగిపోయి ముఖం మృదువుగా మారుతుంది.
ఈ కాఫీ ఫేస్ మాస్క్‌ను అప్పుడప్పుడు వేసుకోవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఎందుకంటే కాఫీ పొడిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. మీరు ఈ కాఫీ ఫేస్ మాస్క్ ను ప్రయత్నించడం వల్ల చర్మంపై కాలుష్య ప్రభావం పడకుండా అడ్డుకుంటాయి. దీనివల్ల మీరు యవ్వనంగా కనిపిస్తారు. మొటిమలు రావడం కూడా తగ్గుతుంది.
ఈ ఫేస్ మాస్క్ లో వాడిన బ్రౌన్ షుగర్ వల్ల చర్మం పొలుసులుగా రాలకుండా మృదువుగా మారుతుంది. మృతకణాలు కూడా తొలగిపోతాయి. కాబట్టి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. బ్రౌన్ షుగర్ లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువ. ఇది చర్మానికి మెరుపును అందిస్తుంది.
ఫేస్ మాస్క్ లో వాడిన మరొక పదార్థం ఆలివ్ నూనె. ఇది సహజ సిద్ధంగానే మాయిశ్చరైజర్ గా పని చేస్తుంది. ఆలివ్ నూనెలో మన చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ కె, విటమిన్ డి, విటమిన్ ఈ, విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఈ నూనెలో యాంటీ బ్యాక్టీరియాల్ గుణాలు కూడా ఎక్కువే. ఇవి బ్యాక్టీరియా ప్రభావం చర్మంపై పడకుండా కాపాడతాయి. ఇందులో వాడిన తేనె కూడా మన శరీరానికి ఎంతో అవసరమైనది. దీనిలో ఉండే యాంటీ మైక్రోబయల్ గుణాలు మొటిమలు రాకుండా అడ్డుకుంటాయి. ముఖంపై ముడతలు, గీతలు రాకుండా నిరోధిస్తాయి. ఇక పాల విషయానికొస్తే పాలల్లో విటమిన్ డి, విటమిన్ ఏ రెండూ ఉంటాయి. ఈ రెండూ కూడా చర్మం ముడతలు పడకుండా, గీతలు పడకుండా కాపాడుతుంది.
గమనిక: నిపుణుల సలహాలు సూచనలు సేకరించిన తర్వాతే.. ఈ బ్యూటీ టిప్స్ పాటించగలరు. ఈ వివరాలు కేవలం మీ అవగాహన కోసమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘బిగ్ టీవీ’ నెట్‌వర్క్‌కు ఎటువంటి బాధ్యత వహించదని గమనించగలరు.


Related News

Dosakaya Pachadi: దోసకాయ కాల్చి ఇలా రోటి పచ్చడి చేశారంటే అదిరిపోతుంది

Most Dangerous Foods: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారాలు.. సరిగ్గా వండకపోతే ప్రాణాలకే ప్రమాదం !

Omelette Vs Boiled Egg: ఎగ్స్ Vs ఆమ్లెట్.. బరువు తగ్గడానికి ఏది తింటే బెటర్ ?

Saliva Test: ఏంటి నిజమా? లాలాజలంతో గుండె పనితీరు గుర్తించొచ్చా..! అదెలా ?

Tips For Hair: జుట్టు త్వరగా పెరగాలా ? అయితే.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Banana: ఖాళీ కడుపుతో అరటిపండు తింటే.. జరిగేది ఇదే ?

Heart Health:గుండె జబ్బులు ఉన్నాయని తెలిపే.. సంకేతాలు ఇవేనట !

Fruits For Weight loss: బరువు తగ్గాలనుకునే వారు.. ఎలాంటి ఫ్రూట్స్ తినాలి ?

Big Stories

×