Minister Uttam Kumar Reddy: ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గాన్వేషణను ముమ్మరం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. అందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుంటున్న రెస్క్యూ టీంలు సహాయక చర్యలను వేగవంతం చేశారని ఆయన తెలిపారు.
‘సహాయక చర్యలకు ఆటంకంగా మారిన బురద నీటిని తొలగించే ప్రక్రియను మరింత స్పీడ్ పెంచాం. ఆధునిక పరిజ్ఞానంపై రెస్క్యూ టీంలు దృష్టి సారించాయి. సహాయక చర్యల్లో ఎక్కడ రాజీ పడకుండా రాష్ట్ర ప్రభుత్వం రెస్క్యూ టీం లకు వెసులుబాటు కలిపించింది. అందులో భాగంగానే నేడు నేవి, ఆర్మీ, ర్యాట్ మైనర్స్, ఎన్.డి.ఆర్.ఎఫ్, ఎస్.డి.ఆర్.ఎఫ్ లతో ప్రత్యేకంగా సమీక్ష సమావేశం నిర్వహించాం. బాధితులను రక్షించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాం. రెండు రోజుల్లో ఆపరేషన్ పూర్తి చేస్తాం’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
‘సహాయక చర్యలను మరింత ముమ్మరంగా సాగేలా రెస్క్యూ టీంలకు నిర్దేశించాం. టన్నెల్ లోపల జరుగుతున్న పనులపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ జరిగుతుంది’ అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయట పడేసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గడిచిన ఐదు రోజులుగా సర్వశక్తులు ఒడ్డి పోరాడుతుంది. అన్ని వ్యవస్థలను ఇక్కడే కేంద్రకరింప చేసి పనిచేస్తున్నాం. ఇండియన్ మెరైన్ కమాండో ఫోర్స్ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. సానుకూలంగా పరిణామాలు మారవచ్చని ఆశిస్తున్నాం’ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు.
ALSO READ: CM Revanth Reddy: ఆ మరణాల వెనుక ఉన్న మిస్టరీ ఏంటి..? సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి కూడా వెళ్లారు. సహాయక చర్యలు చేపడుతున్న అధికారులతో ఆయన సమావేశం అయ్యారు. సహాయక చర్యలు చేపడుతున్న తీరు, ఎదురవుతున్న సమస్యలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆరా తీశారు. ఘటన జరిగిన తీరును, చేపడుతున్న సహాయక కార్యక్రమాలను, ఎదురవుతున్న సమస్యల గురించి ఎమ్మెల్యేకు అధికారులకు వివరించారు.
ALSO READ: NAFED Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. నెలకు రూ.1,50,000 జీతం.. ఇంకా మూడు రోజులే..!
‘సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. ఐదు రోజులుగా నిద్ర హారాలు మాని సిబ్బంది సహాయక చర్యలు చేపడుతోంది. కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ లో నాకున్న అనుభవంతో ఈ సమస్య నుండి బయటపడడానికి దేశవ్యాప్తంగా ఉన్న నిష్ణాతులతో మాట్లాడుతున్నా. దీంట్లో ఎక్స్‌పర్ట్ అయిన హర్పాల్ సింగ్‌తో ఫోన్‌లో మాట్లాడాను. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి దగ్గరుండి సహాయక చర్యలపై సమీక్ష చేస్తున్నారు. ప్రమాదంపై బీఆర్ఎస్ ట్రోల్స్ చేయడం బాధాకరం. పదేళ్లుగా ఎస్ఎల్‌బీసీకి ఏమీ చేయని బీఆర్ఎస్ చిల్లర రాజకీయం చేస్తుంది. హరీష్ రావు ఇక్కడికి వచ్చి రాజకీయం చేయొద్దు. సహాయక చర్యలకు ఇబ్బంది పెట్టొద్దు’ అని ఎమ్మెల్యే కోమట్టిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.